వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి
ఎల్లారెడ్డి: వేసవిలో నీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో తాహేరాబేగం అన్నారు. మంగళవారం మత్తమాల, జంగమాయిపల్లి, మల్కాపూర్, అల్మాజీపూర్, రుద్రారం గ్రామాలలో నీటి ట్యాంకులను పరిశీలించారు. అనంతరం పంచాయతి కార్యదర్శులతో మాట్లాడుతు వేసవిలో నీటి ఎద్దడి లేకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ఎంపీవో ప్రకాష్, సర్పంచులు, ఏఈ వినోద్, కార్యదర్శులు తదితరులున్నారు.
తాగునీటి ఇబ్బందులు లేకుండా చూస్తాం
మద్నూర్(జుక్కల్): వేసవి కాలంతో గ్రామంలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని సుల్తాన్‌పేట్ సర్పంచ్ రాజేశ్వర్‌గౌడ్ పేర్కొన్నారు. సుల్తాన్‌పేట్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం వార్డు సభ్యులు, కార్యదర్శితో సమావేశం ఏర్పాటు చేశారు. తాగునీటి కోసం ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కార్యదర్శిని ఆదేశించారు. బోరుబావులు, చేతి పంపులకు అవసరమైన మరమ్మతులు చేయాలన్నారు. ఉప సర్పంచ్ బాల్‌రాజ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.


