సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి

Feb 18 2026 7:02 AM | Updated on Feb 18 2026 7:02 AM

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి

కామారెడ్డి టౌన్‌ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేస్తున్న కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల ని, పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యాలను పకడ్బందీగా అ మలు చేయాలని తెలంగాణ మెడికల్‌ ఎంప్లాయీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యూ సుఫ్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం జిల్లా ప్రభు త్వ ఆస్పత్రిలో నిర్వహించిన జిల్లా జనరల్‌ బాడీ స మావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మా ట్లాడారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్మికుల శ్రమను దోచుకుంటోందని విమర్శించా రు. ఏప్రిల్‌ నుంచి అమలు చేయాలనుకుంటున్న 12 గంటల పని విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఈ సమావేశంలో జిల్లా గౌరవ అధ్యక్షులు ఎల్‌.దశరథ్‌, జిల్లా అధ్యక్షులు కె.శ్రీనివాస్‌, సహాయ కా ర్యదర్శి సురేఖ, కోశాధికారి ఎండీ రఫీక్‌, రైతు సంఘం కన్వీనర్‌ ఎం. దేవయ్య, సూపర్వైజర్‌ ఇర్ఫాన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement