బీఆర్‌ఎస్ నాయకులను నిలదీయండి
భిక్కనూరు: గ్రామాలలో బీఆర్‌ఎస్ నాయకులను నిలదీయాలని బీజేపీ నేత ఏనుగు శ్రీధర్ రెడ్డి పార్టీ నాయకులకు సూచించారు. మంగళవారం భాగిర్తిపల్లి గ్రామ బీజేపీ నాయకులు ఇటీవల కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో ఎనిమిదో వార్డ్ కౌన్సిలర్‌గా గెలుపొందిన సందర్భంగా ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ బిఆర్‌ఎస్ పార్టీలు రెండూ ఒకటేనని మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలందరికీ తెలిసిందన్నారు. నేతలు గంగయ్యగారి యాదగిరి, గాండ్ర రాజకుమార్, కుమార్ స్వామి, మహేష్ ఉన్నారు


