కామారెడ్డి చైర్‌పర్సన్‌గా ఉమారాణి
● వైస్ చైర్‌పర్సన్‌గా గోదావరి ఎన్నిక
● ప్రమాణ స్వీకారం చేసిన నూతన కౌన్సిల్ సభ్యులు
కామారెడ్డి టౌన్: కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో సోమవారం అదనపు కలెక్టర్ మధుమోహన్ సమక్షంలో నూతన సభ్యుల ప్రమాణస్వీకారోత్సవం, చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌ల ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి కాంగ్రెస్‌లో చేరిన 38వ వార్డు కౌన్సిలర్ ఇప్ప ఉమారాణి అభ్యర్థిత్వాన్ని ఆ పార్టీకి చెందిన 49వ వార్డు కౌన్సిలర్ ఇషాక్ షేరూ ప్రతిపాదించారు. 29వ వార్డు కౌన్సిలర్ అంజాద్ బలపరిచారు. బీజేపీ నుంచి 34వ వార్డు కౌన్సిలర్ గాండ్ల సుజిత పేరును 43వ వార్డు కౌన్సిలర్ ప్రీతి ప్రతిపాదించగా 11వ వార్డు కౌన్సిలర్ కాసర్ల రాణి బలపరిచారు. కాంగ్రెస్ అభ్యర్థికి కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఇండిపెండెంట్లు కలిపి 33 మంది, బీజేపీ అభ్యర్థికి ఎక్స్‌అఫీషియో ఓటు కలిగిన ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డితోపాటు 16 మంది బీజేపీ కౌన్సిలర్ల ఓట్లు వచ్చాయి. దీంతో 16 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు.
వైస్ చైర్మన్‌గా బీఆర్‌ఎస్‌కు చెందిన 12వ వార్డు కౌన్సిలర్ కాసర్ల గోదావరిని 45వ వార్డు కౌన్సిలర్ పిట్ల వేణు ప్రతిపాదించగా, 18వ వార్డు కౌన్సిలర్ అఫీజ్ బేగ్ బలపరిచారు. బీజేపీ నుంచి 39 వార్డు కౌన్సిలర్ శ్రీకాంత్ పేరును 9వ వార్డు కౌన్సిలర్ నరేందర్‌రెడ్డి ప్రతిపాదించగా, 33వ వార్డు కౌన్సిలర్ కుంట లక్ష్మారెడ్డి బలపరిచారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి కాసర్ల గోదావరి 16 ఓట్లు మెజారిటీతో వైస్ చైర్‌పర్సన్ అయ్యారు.
వైస్‌చైర్‌పర్సన్ పేరు: కాసర్ల గోదావరి
భర్త పేరు: కాసర్ల స్వామి
పిల్లలు: సాయి చరణ్, సాయి చైత్ర
వయసు: 40
విద్యార్హత: ఇంటర్మీడియట్
కులం: మున్నూరుకాపు
వృత్తి: గృహిణి
రాజకీయ నేపథ్యం : 2020–25
కౌన్సిలర్‌గా పనిచేశారు.
చైర్‌పర్సన్ పేరు : ఇప్ప ఉమారాణి
భర్త పేరు: ఇప్ప శ్రీనివాస్
పిల్లలు: తేజశ్విని, శ్రీవాస్తవ్
వయసు: 37
విద్యార్హత: బీఎస్సీ, బీఈడీ
కులం: ముదిరాజ్
వృత్తి: గృహిణి
రాజకీయ నేపథ్యం : మొదటిసారి
కౌన్సిలర్‌గా ఎన్నిక
కామారెడ్డి చైర్‌పర్సన్‌గా ఉమారాణి


