ఇంతింతై.. పురమంతై..
న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 17 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
– IIలో u
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతోంది. స్థానిక సంస్థల్లో ప్రభుత్వం 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తుండగా.. అంతకన్నా ఎక్కువ సంఖ్యలోనే సీ్త్రలు ఎన్నికవుతున్నారు. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ కౌన్సిలర్లుగా మహిళలే ఎక్కువ సంఖ్యలో గెలిచారు.
అదనంగా మూడు స్థానాలు..
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 92 వార్డులున్నాయి. కామారెడ్డిలో 49, బాన్సువాడలో 19, ఎల్లారెడ్డి, బిచ్కుందలలో 12 చొప్పున వార్డులుండగా.. 45 వార్డులను మహిళలకు రిజర్వ్ చేశారు. అయితే ఎన్నికలలో రిజర్వ్ అయినవార్డుల్లోనే కాకుండా జనరల్ వార్డుల్లోనూ మహిళలు పోటీ చేసి సత్తా చాటారు. మొత్తం 48 చోట్ల విజయం సాధించారు. కామారెడ్డిలో 25 స్థానాల్లో మహిళలు గెలవగా.. బాన్సువాడలో 10 చోట్ల, బిచ్కుందలో 7 వార్డుల్లో, ఎల్లారెడ్డిలో 6 చోట్ల గెలుపొందారు.
జనరల్ స్థానంలోనూ ఆమెకే పట్టం
జిల్లాలో నాలుగు బల్దియాలు ఉండగా.. రెండు చైర్‌పర్సన్ స్థానాలను మహిళలకు రిజర్వ్ చేశారు. అయితే మూడింటిలో మహిళలకు అవకాశం దక్కడం గమనార్హం. కామారెడ్డి, బాన్సువాడలను మహిళలకు కేటాయించగా.. అదనంగా జనరల్ స్థానమైన బిచ్కుంద సైతం వారి ఖాతాలనే చేరింది. మరోవైపు నాలుగుచోట్లా వైస్ చైర్‌పర్సన్‌లుగా మహిళలే ఎన్నికవడం గమనార్హం.
బల్దియాలలో పెరిగిన ప్రాతినిధ్యం
జిల్లాలో మూడు బల్దియాల
చైర్‌పర్సన్‌లుగా మహిళలు
నాలుగుచోట్ల వైస్ చైర్‌పర్సన్‌లుగా
వారికే అవకాశం
ఇంతింతై.. పురమంతై..
ఇంతింతై.. పురమంతై..


