ఇందూరు మేయర్‌ పీఠంపై రామేశ్వర్‌పల్లి కోడలు | - | Sakshi
Sakshi News home page

ఇందూరు మేయర్‌ పీఠంపై రామేశ్వర్‌పల్లి కోడలు

Feb 17 2026 7:28 AM | Updated on Feb 17 2026 7:28 AM

ఇందూర

ఇందూరు మేయర్‌ పీఠంపై రామేశ్వర్‌పల్లి కోడలు

ఇందూరు మేయర్‌ పీఠంపై రామేశ్వర్‌పల్లి కోడలు ‘కామారెడ్డి’ చైర్‌పర్సన్‌ రాజంపేట ఆడబిడ్డే! పట్టణ ప్రజలూ కాంగ్రెస్‌కు పట్టం కట్టారు చిరుత పులి, పిల్లల సంచారం

భిక్కనూరు: నిజామాబాద్‌ మేయర్‌గా ఎన్నికైన కూరగాయల ఉమారాణి భిక్కనూరు మండలం రామేశ్వర్‌పల్లి కోడలు కావడంతో గ్రామంలో సంబురాలు జరుపుకున్నారు. ఉమారాణి మామయ్య పెంటయ్యది రామేశ్వర్‌పల్లి. ఆయన మేనత్తకు పిల్లలు లేకపోవడంతో అక్కడికి వెళ్లి వారి ఇంట్లో ఉంటూ పండ్లు, కూరగాయల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకున్నారు. స్వగ్రామానికి తరచూ వచ్చి వెళ్లేవారు. పెంటయ్య కుమారుడు రమేశ్‌ కూరగాయల వ్యాపారం చేస్తూనే కరాటే మాస్టర్‌గా పనిచేశారు. రమేశ్‌ సతీమణి ఉమరాణి నిజామాబాద్‌ మేయర్‌ అయ్యారు. ఉమారాణి కూడా తరచూ రామేశ్వర్‌పల్లి గ్రామానికి వస్తుంటారనిగ్రామస్తులు తెలిపారు. తమ చిన్నన్న పెంటయ్య కూరగాయల వ్యాపారం చేయడం వల్ల వారి ఇంటిపేరు కూరగాయలుగా మారిందని రామేశ్వర్‌పల్లి గ్రామానికి చెందిన తేలు ధర్మస్వామి తెలిపారు. తమ ఇంటి కోడలు మేయర్‌ కావడంతో ఆనందం వ్యక్తం చేశారు.

భిక్కనూరు: కామారెడ్డి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నికై న ఇప్ప ఉమారాణి రాజంపేట మండల కేంద్రానికి చెందిన ఆడపడుచు కావడంతోమండల కేంద్రంలో ప్రజలు సోమవారం సంబురాలు జరుపుకున్నారు. ఉమారాణి తల్లిదండ్రులు మాణిక్య రాజమణి రాజయ్య. తండ్రి పోస్టుమన్‌గా పనిచేసి పదేళ్ల క్రితం మరణించారు. తల్లి రాజమణి బీడీ కార్మికురాలిగా పనిచేస్తోంది. రాజమణి గతంలో వార్డు సభ్యురాలుగా ఐదేళ్లు సేవలందించారు. ఉమారాణికి ఇద్దరు సోదరులు. ఒక సోదరుడు ఆటో డ్రైవర్‌గా పనిచేస్తుండగా.. మరో సోదరుడు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పీఆర్‌వోగా ఉన్నారు.

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ‘పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ గ్రామాల్లో కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులే సర్పంచ్‌లుగా గెలుపొందారు. ఇప్పుడు మున్సిపల్‌ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ మంచి విజయాలు సాధించింది. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారు’ అని డీసీసీ అధ్యక్షుడు ఏలె మల్లికార్జున్‌ పేర్కొన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికలు పూర్తయిన తరువాత ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు కాంగ్రెస్‌ కై వసం చేసుకున్నందుకు ఆనందంగా ఉందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా పథకాలు అమలు చేసి ప్రజలకు అందించడం వల్లే ప్రజలు ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. అభివృద్ధితో పాటు సంక్షేమం విషయంలో ప్రభుత్వం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదన్నారు. ఏ ఎన్నికల్లో అయినా కాంగ్రెస్‌ విజయాలు సొంతం చేసుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన నాయకులు, కార్యకర్తలకు, పట్టం కట్టిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

నిజాంసాగర్‌: జుక్కల్‌ మండలం బస్వాపూర్‌ శివారులోని మక్క చేను వద్ద సోమవారం సాయంత్రం చిరుతపులితో పాటు రెండు పిల్లలు గ్రామస్తులకు కనిపించాయి. ఈ విషయమై వారు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ శాఖ బీట్‌ అధికారి రాములుతో పాటు సిబ్బంది బస్వాపూర్‌ శివారులో పర్యటించి, చిరుత పులి పాదముద్రలు, చిన్న పులి కూనల పాదముద్రలను గుర్తించారు. చిరుత పులి సంచరిస్తున్నందున రైతులు, చుట్టు పక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామ శివారు ప్రాంతాలు, పంట చేనుల్లోకి చిరుత పులి రావడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. చిరుతను బంధించి ప్రజలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.

ఇందూరు మేయర్‌ పీఠంపై రామేశ్వర్‌పల్లి కోడలు
1
1/1

ఇందూరు మేయర్‌ పీఠంపై రామేశ్వర్‌పల్లి కోడలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement