బిగుస్తున్న ఉచ్చు.. మాజీ సీఎస్‌ సోమేష్‌పై సీబీఐ, ఈడీకి ఫిర్యాదు

Complaint Against Former Telangana Cs Somesh Kumar To Cbi And Ed - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అధికారాన్ని అడ్డం పెట్టుకుని భారీగా అక్రమాస్తులు సంపాదించారంటూ మాజీ సీఎస్‌ సోమేష్ కుమార్‌పై యాక్షన్ ఫర్ యాంటీ కరప్షన్ కన్వీనర్‌ శ్రీకాంత్ సీబీఐ, ఈడీకి ఫిర్యాదు చేశారు. తన కుటుంబ సభ్యులు, బినామీల పేరిట ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

సోమేష్‌కుమార్ తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించిన శ్రీకాంత్‌.. ఆయనకు గుర్‌గావ్‌లో చాలా కమర్షియల్ కాంప్లెక్స్‌లు ఉన్నాయన్నారు. నోయిడాలోనూ కీలక  ప్రాంతాల్లో బినామీల పేరుతో స్థలాలు కొన్నారని శ్రీకాంత్ అంటున్నారు. రాజకీయ నేతలకు అనుకూలంగా చాలా వివాదాస్పద జీవోలను జారీ చేశారన్న శ్రీకాంత్‌.. యాచారంలో సోమేష్‌కుమార్‌ భార్య పేరిట 25 ఎకరాల భూమిని కొన్నారని ఫిర్యాదులో ప్రస్తావించారు.

ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోనూ సోమేష్‌కుమార్‌కు కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయని ఫిర్యాదు చేసిన శ్రీకాంత్‌.. సోమేష్‌కుమార్, ఆయన కుటుంబానికి ఉన్న ఆస్తులన్నీ అధికారాన్ని దుర్వినియోగంతోనే సంపాదించారని ఆరోపించారు. సోమేష్‌కుమార్ ఆస్తులపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని డిమాండ్‌ చేసిన శ్రీకాంత్‌.. దర్యాప్తునకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.

ఇదీ చదవండి: టీవీ5 సాంబశివరావుపై చీటింగ్‌ కేసు నమోదు

whatsapp channel

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top