నాలుగు చక్రాల ఎలక్ట్రిక్‌ బైక్‌లు వచ్చేస్తున్నాయ్‌ | Sakshi
Sakshi News home page

నాలుగు చక్రాల ఎలక్ట్రిక్‌ బైక్‌లు వచ్చేస్తున్నాయ్‌

Published Sun, Dec 3 2023 10:01 AM

Karver Cycle Concept K1 review - Sakshi

మోటార్‌ సైకిల్‌కి రెండు చక్రాలు ఉండటం మామూలే! ఇది నాలుగు చక్రాల మోటార్‌ సైకిల్‌. దీనికి ముందు వైపున, వెనుక వైపున కూడా రెండేసి చక్రాలు ఒకదానికొకటి దగ్గరగా అమర్చి రూపొందించడం విశేషం. అమెరికన్‌ డిజైనర్‌ కిప్‌ కుబిజ్‌ ఈ నాలుగు చక్రాల మోటార్‌ సైకిల్‌కి రూపకల్పన చేశాడు.

ఇది ఎలక్ట్రిక్‌ హైడ్రోజన్‌ హైబ్రిడ్‌ బైక్‌. దీనికి ఒక సీటు మాత్రమే ఉండటంతో దీనిపై ఇద్దరు ప్రయాణించే అవకాశం లేదు. రోడ్ల మీద మాత్రమే కాకుండా, ఎగుడు దిగుడు గతుకుల దారుల్లోనూ సులువుగా ప్రయాణించేలా దృఢమైన టైర్లతో దీనికి నాలుగు చక్రాలను అమర్చారు.

అమెరికన్‌ కంపెనీ ‘టానమ్‌ మోటార్స్‌’ కోసం కిప్‌ కుబిక్‌ ఈ నాలుగు చక్రాల బైక్‌ను ‘కార్వర్‌ సైకిల్‌ కాన్సెప్ట్‌ కె–1’ పేరుతో రూపొందించాడు. దీనికి ఇంకా ధర నిర్ణయించలేదు. ఒకటి రెండేళ్లలో ఇది మార్కెట్‌లో అందుబాటులోకి రాగలదని చెబుతున్నారు. 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement