అంబేద్కర్‌ స్మృతివనం: ‘ఆ ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది’ | Sakshi
Sakshi News home page

అంబేద్కర్‌ స్మృతివనం: నిర్మాణ పనులను పరిశీలించిన మేరుగు, సజ్జల

Published Wed, Jul 5 2023 4:08 PM

Sajjala And Merugu Nagarjuna Inspecting Ambedkar Statue Works In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: విజయవాడలో అంబేద్కర్‌ స్మృతివనం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక, విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలో స్మృతివనం నిర్మాణ పనులను మంత్రి మేరుగు నాగార్జున, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పరిశీలించారు. అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటు పనులు, స్మృతివనం నిర్మాణ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్బంగా మంత్రి నాగార్జునకు, సజ్జలకు పనుల వివరాలను అధికారులు వివరించారు. 

అనంతరం, మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. అంబేద్కర్‌ స్మృతివనం నిర్మాణం గొప్ప కార్యక్రమం. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుంది. గత ప్రభుత్వం దళితులను ఎంతో మోసం చేసింది. అంబేద్కర్‌ విగ్రహం నిర్మించేందుకు సరైన స్థలం కూడా చంద్రబాబు ఇవ్వలేదు. ప్ర‍స్తుతం పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే అంబేద్కర్ స్మృతివనం పనులు పూర్తి చేసి ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. 

ఈ సందర్బంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. విజయవాడ నగరం నడిబొడ్డున అంబేద్కర్‌ విగ్రహం నిర్మాణం జరుగుతోంది. భారతదేశం గర్వించదగ్గ అంబేద్కర్ స్మారకార్ధం స్మృతివనం పనులు 20 ఎకరాలలో శరవేగంగా జరుగుతున్నాయి. దేశంలోనే అతి పెద్ద 125 అడుగుల విగ్రహాన్ని నగరం నడిబొడ్డున ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు అంబేద్కర్ స్మృతివనం పనులు పరిశీలించాం. భారతదేశం గర్వించదగిన నేత అంబేద్కర్. ప్రపంచంలోనే భారత రాజ్యాంగం చాలా పటిష్టమైనది. అన్ని వర్గాలకి అంబేద్కర్ ఆదర్శం. అంబేద్కర్ పేరు చరిత్రలో నిలిచిపోయేలా ప్రతిపాదించడమే కాదు.. పనులు ప్రారంభించిన ఘనత సీఎం జగన్‌ది. 

అంబేద్కర్‌ జ్ఞాపకాలను ఎన్నేళ్లయినా గర్వంగా చెప్పుకుంటాం. రాజకీయపరంగా ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా గొప్ప రాజ్యాంగాన్ని అంబేద్కర్‌ రూపొందించారు. టీడీపీ హయాంలో అంబేద్కర్‌ విగ్రహ నిర్మాణానికి మూలపడిన ప్రాంతంలో స్థలం పేరుకే కేటాయించారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటించి ఎటువంటి పనులు చేయలేదని అన్నారు. 

ఇది కూడా చదవండి: మరోసారి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే: నటుడు సుమన్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement