
ఐసీసీ ప్రతి నెలా ప్రకటించే ప్రతిష్టాత్మక ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు రేసులో వన్డే వరల్డ్‌కప్ 2023 హీరోలు పోటీపడుతున్నారు. అక్టోబర్ నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్‌గా క్వింటన్ డికాక్ (సౌతాఫ్రికా), రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్), జస్ప్రీత్ బుమ్రా (భారత్) ప్రకటించబడ్డారు. ఈ ముగ్గురి ఆటగాళ్ల హవా అక్టోబర్ నెలతో పాటు ప్రస్తుత మాసంలోనూ (నవంబర్) కొనసాగుతుంది. ప్రపంచకప్‌లో ఈ ఆటగాళ్లు ఆయా విభాగాల్లో అత్యుత్తమ స్థాయిల్లో ఉన్నారు.
అక్టోబర్ 5న మొదలైన వరల్డ్‌కప్ 2023లో డికాక్ ఇప్పటివరకు జరిగిన 8 మ్యాచ్‌ల్లో 4 సెంచరీల సాయంతో 550 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. రచిన్ రవీంద్ర సైతం ఎనిమిది మ్యాచ్‌లు ఆడి 3 సెంచరీల సాయంతో 523 పరుగులు చేసి అత్యధిక పరుగుల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. బౌలింగ్‌లో టీమిండియా పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.
Here are the Men's and Women's 'ICC Player of the Month nominees for October 2023. pic.twitter.com/0tK6mbq1s0
— CricTracker (@Cricketracker) November 7, 2023
బుమ్రా ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టి, వరల్డ్‌కప్ అత్యధిక వికెట్ల జాబితాలో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. ఐసీసీ అక్టోబర్ నెల పురుషుల ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ వివరాలతో పాటు మహిళల ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ పేర్లను కూడా ప్రకటించింది. మహిళల విభాగంలో వెస్టిండీస్ హేలీ మాథ్యూస్, బంగ్లాదేశ్ నహీద అక్తర్, న్యూజిలాండ్ అమేలయా కెర్ ఈ అవార్డు కోసం పోటీపడుతున్నారు.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న పురుషుల వన్డే ప్రపంచకప్‌లో భారత్, సౌతాఫ్రికా జట్లు ఇదివరకే సెమీస్‌కు అర్హత సాధించాయి. మిగిలిన రెండు బెర్త్‌ల కోసం ఆసీస్, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు పోటీపడుతున్నాయి. ఘోర పరాజయాలను మూటగట్టుకున్న బంగ్లాదేశ్, శ్రీలంక, ఇంగ్లండ్ జట్లు ఎలిమినేషన్‌కు గురయ్యాయి. నెదర్లాండ్స్ అధికారికంగా ఎలిమినేట్ కానప్పటికీ, సెమీస్ అవకాశాలు దాదాపుగా లేనట్లే.