బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌.. పార్టీని వీడనున్న ఎమ్మెల్యే | Shock To BRS Rajendra Nagar MLA prakash goud To Join Congress | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌.. పార్టీని వీడనున్న ఎమ్మెల్యే

Apr 19 2024 12:39 PM | Updated on Apr 19 2024 1:22 PM

Shock To BRS Rajendra Nagar MLA prakash goud To Join Congress - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయినబీఆర్‌ఎస్‌ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల ముందు నేతలు ఒక్కొకరుగా పార్టీని వీడుతున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీలు ఇలా అందరూ బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెబుతున్నారు. తాజాగా మారో సిట్టింగ్‌ ఎమ్మెల్యే కారు దిగేందుకు రెడీ అయ్యారు. బీఆర్‌ఎస్‌ రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు.

ఈ మేరకు ఎమ్మెల్యే శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు సీఎంకు తెలియజేశారు. తన అనుచరులతో కలిసి, సీఎం సమక్షంలో ప్రకాష్‌ గౌడ్‌ కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నారు. కాగా ఇప్పటికే బీఆర్‌ఎస్‌ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. వీరితోపాటు అనేకమంది ఎంపీలు, ముఖ్య నేతలు సైతం బీఆర్‌ఎస్‌ను వీడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement