
పాకిస్తాన్ తో యుద్ధం వేళ.. పారామిలటరీ బలగాలకు సెలవులు రద్దుకావడంతో అంతా విధుల్లోకి తిరిగి హాజరయ్యే పరిస్థితి అనివార్యమైంది. ఈ క్రమంలోనే పెళ్లైన ఓ జవాన్ విధుల్లోకి హాజరయ్యాడు. మహారాష్ట్రకు చెందిన మనోజ్ పాటిల్ మే 5వ తేదీన వివాహం చేసుకున్నాడు. అయితే పారామిలటరీ బలగాలు అంతా విధులకు హాజరు కావాలనే ఆదేశాల నేపథ్యంలో మనోజ్ పాటిల్ తిరిగి విధుల్లో చేరాడు.
పెళ్లైన మూడు రోజులకే విధులకు హాజరయ్యాడు. అయితే నవ వధువు తన భర్తను దేశ రక్షణ కోసం సరిహద్దుల్లోకి పంపి అందరికీ ఆదర్శంగా నిలవగా.. ఈ నూతన వధూవరుణ కథే దేశభక్తికి చిహ్నంగా నిలిచింది. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో వైరల్‌గా మారింది. ఆ నవ వధువు దేశ భక్తిని అంతా కొనియాడుతున్నారు. తన సింధూరాన్ని దేశ రక్షణ కోసం పంపిన వనిత అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
सगळ काही भारत मातेसाठी...
लग्नाच्या तीन दिवसांनंतर महाराष्ट्राचे सुपूत्र मनोज पाटील देश सेवेसाठी रवाना... #oprationsindoor #IndianNavyAction #IndiaPakistanTensions #jalgaonnews #India #army #manojpatil #देशसेवा pic.twitter.com/1gmbhYcoTD— Ganesh Pokale... (@P_Ganesh_07) May 9, 2025
