కారుకు నాలుగు చక్రాలు ఉండటం మామూలే.. వెరైటీగా రెండు చక్రాలతోనే

Shane: A First Of Its Kind Parallel Two Wheeled Electric Car Concept From Inventist - Sakshi

కారుకు నాలుగు చక్రాలు ఉండటం మామూలే! వెరైటీగా రెండు చక్రాలతోనే కారును రూపొందించాడు అమెరికాలో స్థిరపడిన చైనీస్‌ ఆవిష్కర్త షేన్‌ చెన్‌. ఇదివరకు ఇతడు హోవర్‌ బోర్డును ఆవిష్కరించాడు. సమాంతరమైన రెండు పెద్దచక్రాలతో రూపొందించిన ఈ కారుకు తన పేరునే పెట్టాడు.

‘షేన్‌’ పేరుతో రూపొందించిన ఈ కారు పూర్తి ఎలక్ట్రిక్‌ వాహనం. రీచార్జబుల్‌ బ్యాటరీ సాయంతో పనిచేసే ఈ కారులో ఏకకాలంలో డ్రైవర్‌ సహా ఐదుగురు ప్రయాణించడానికి వీలు ఉంటుంది. రెండు చక్రాలతోనే ఈ కారును రూపొందించడం వల్ల ఇది నగరాల్లోని రద్దీ ట్రాఫిక్‌లో సులువుగా ప్రయాణించగలదు.

ఇరుకిరుకు సందుల్లో కూడా తేలికగా మలుపులు తీసుకోగలదు. పట్టణ, నగర ప్రాంతాల్లో సుదూర ప్రయాణాలకు అనువుగా దీనిని రూపొందించడం విశేషం.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top