2024 వృద్ధి 6.8 శాతం: మూడీస్‌ | Sakshi
Sakshi News home page

2024 వృద్ధి 6.8 శాతం: మూడీస్‌

Published Tue, Mar 5 2024 4:49 AM

Moodys lifts GDP forecast to 6. 8percent from 6. 1percent for 2024 - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ 2024 క్యాలెండర్‌ ఇయర్‌ వృద్ధి అంచనాను గ్లోబల్‌ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ 70 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం) పెంచింది. ఇంతక్రితం 6.1 శాతం అంచనాలను  6.8 శాతానికి పెంచుతున్నట్లు వివరించింది. ‘‘అంచనాల కంటే బలమైన’’ ఆర్థిక గణాంకాలు తమ తాజా అంచనా పెంపునకు కారణంగా పేర్కొంది.

జీ20 దేశాలలో భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతుందని వివరించింది. 2025లో దేశ వృద్ధి రేటును 6.4 శాతంగా రేటింగ్‌ దిగ్గజం పేర్కొంది. 2023లో దేశ ఎకానమీ ఊహించినదానికన్నా అధికంగా మంచి పురోగతిని సాధించినట్లు తెలిపింది. ప్రభుత్వ మూలధన వ్యయాలు, పటిష్ట తయారీ కార్యకలాపాలు 2023లో భారత్‌ బలమైన వృద్ధి ఫలితాలకు దోహదపడ్డాయని మూడీస్‌ తన నివేదికలో పేర్కొంది.

Advertisement
 
Advertisement
 
Advertisement