అమెజాన్ ఫౌండర్ 'జెఫ్ బెజోస్'.. తన ప్రియురాలు 'లారెన్ శాంచెజ్'ను త్వరలోనే పెళ్లిచేసుకోనున్నారు.
ఈ పెళ్ళికి ఏకంగా రూ. 5,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది.
జెఫ్ బెజోస్ డిసెంబర్ 28న ఆస్పెన్‌లో లారెన్ శాంచెజ్‌ను వివాహం చేసుకోనున్నారు.
2023 మేలో బెజోస్, లారెన్ నిశ్చితార్థం చేసుకున్నారు.
ఆ సమయంలో ఈమెకు బెజోస్ సుమారు రూ.21 కోట్ల ఖరీదైన పింక్ డైమండ్ రింగ్ ఇచ్చినట్లు సమాచారం.
త్వరలో జరగనున్న వీరి పెళ్ళికి.. పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.


