వావ్‌ ఇట్స్‌ అమేజింగ్‌.. మాలిక్‌ వచ్చేశాడు!

Shoaib Malik Return to Pakistan T20 Team Against Bangladesh Series - Sakshi

పాకిస్తాన్‌ మాజీ సారథి, ఆల్‌రౌండర్‌ షోయబ్‌ మాలిక్‌ అనూహ్యంగా పాకిస్తాన్‌ టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో తలపడబోయే పాకిస్తాన్‌ జట్టును ఆ దేశ సెలక్లర్లు ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన పాక్‌ జట్టులో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ షోయబ్‌ మాలిక్‌, మహ్మద్‌ హఫీజ్‌లను సెలక్టర్లు ఎంపిక చేశారు. అంతేకాకుండా అన్‌క్యాప్డ్‌ ప్లేయర్స్‌ హారిస్‌ రౌఫ్‌, అహ్సన్‌ అలీలను కూడా ఎంపిక చేశారు. అయితే సీనియర్‌ బౌలర్లు మహ్మద్‌ అమిర్‌, వాహబ్‌ రియాజ్‌లను జట్టు నుంచి తప్పించడం గమనార్హం. గత కొంత కాలంగా ఫామ్‌లో లేక తంటాలు పడుతున్న మాలిక్‌ పాక్‌ జట్టులో స్థానం కోల్పోయాడు. ఈ క్రమంలోనే వన్డేలకు గుడ్‌బై చెప్పిన మాలిక్‌ టీ20ల్లో కొనసాగుతానని ప్రకటించిన విషయం తెలిసిందే. 

పాకిస్తాన్‌ క్రికెట్‌ను గాడిన పెట్టేందుకు చర్యలు ప్రారంభించామని, దీనిలో భాగంగానే జట్టులో మార్పులు చేపట్టామని ఆ దేశ ప్రధాన కోచ్‌, చీఫ్‌ సెలక్టర్‌ మిస్బావుల్‌ హక్‌ పేర్కొన్నాడు. తామి ఆడిని చివరి 9 టీ20 సిరీస్‌ల్లో 8 ఓడిపోయామని గుర్తు చేసిన ఆయన ఇక ఓటముల పరంపరకు చెక్‌ పెట్టబోతున్నట్లు విశ్వాసం వ్యక్తం చేశాడు. ఆసియా కప్‌, ప్రపంచకప్‌ గెలిచే పాక్‌ జట్టును తయారు చేస్తున్నామన్నాడు. మాలిక్‌, హపీజ్‌లు తమ అనుభవంతో పాక్‌ జట్టుకు పునర్వైభవం తీసుకొస్తారనే ధీమా వ్యక్తం చేశాడు. ఇక మాలిక్‌ ఎంపిక పట్ల పాక్‌ అభిమానులు సంభ్రమాశ్చర్యాలకు గురువుతున్నారు. ‘ఏంటి మాలిక్‌ను ఎంపిక చేశారా?’, ‘వావ్‌ ఇట్స్‌ అమేజింగ్‌.. మాలిక్‌ పాక్‌ జట్టులోకి వచ్చాడా!’అంటూ పాక్‌ ఫ్యాన్స్‌ సరదాగా కామెంట్‌ చేస్తున్నారు.   

పాకిస్తాన్‌ టీ20 జట్టు:
బాబర్‌ అజమ్‌(సారథి), అహ్సన్‌ అలీ, అమద్‌ బట్‌, హారీస్‌ రౌఫ్‌, ఇఫ్తికార్‌ అహ్మద్‌, ఇమాద్‌ వసీమ్‌, కౌష్దిల్‌ షా, మహ్మద్‌ హఫీజ్‌, మహ్మద్‌ హస్నైన్‌, మహ్మద్‌ రిజ్వాన్‌, ముసా ఖాన్‌, షాదాబ్‌ ఖాన్‌, షహీన్‌ షా ఆఫ్రిది, షోయబ్‌ మాలిక్‌, ఉస్మాన్‌ ఖాదిర్‌. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top