అంతరిక్ష పర్యాటకం సాధ్యమే! | Sakshi
Sakshi News home page

అంతరిక్ష పర్యాటకం సాధ్యమే!

Published Sat, Apr 6 2024 6:07 AM

Science has no gender say top women scientists: ts - Sakshi

భవిష్యత్‌లో పూర్తిస్థాయి దేశీయ అంతరిక్ష పరిశోధనలు 

చంద్రయాన్‌ ల్యాండర్‌ మన పరిశోధనల సక్సెస్‌కు సూచిక

సైన్స్‌కు లింగ భేదం లేదు..

పురుషులు, మహిళలు ఉమ్మడి లక్ష్యం కోసం పనిచేస్తున్నారు 

ఫిక్కీ కార్యక్రమంలో డీఆర్‌డీఓ, ఇస్రో మహిళా శాస్త్రవేత్తలు టెస్సీ థామస్, కల్పన కాళహస్తి 

సాక్షి, హైదరాబాద్‌:  భవిష్యత్తులో అంతరిక్ష పర్యాటకం సాధ్యమేనని.. మన దేశం పూర్తిస్థాయి దేశీయ పరిశోధనలతో ముందుకు వెళ్తోందని ఇస్రో శాస్త్రవేత్త కల్పన కాళహస్తి, మిస్సైల్‌ విమెన్‌ ఆఫ్‌ ఇండియాగా పేరుపొందిన డీఆర్‌డీవో శాస్త్రవేత్త టెస్సీ థామస్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ది పార్క్‌ హోటల్‌లో ఫిక్కీ ఫ్లో ఆధ్వర్యంలో శుక్రవారం ‘స్టెల్లార్‌ జరీ్నస్‌’కార్యక్రమం నిర్వహించారు. ఫిక్కీ చైర్‌పర్సన్‌ ప్రియా గజ్దర్‌.. పలువురు శాస్త్రవేత్తలు, ఫిక్కీ ఆధ్వర్యంలోని 200 మంది మహిళలు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెస్సీ థామస్, కల్పన కాళహస్తి తమ అనుభవాలను పంచుకున్నారు. 

మార్స్‌పైకి మనిషి వెళ్లడం చూడాలి.. 
సైన్స్‌కు లింగ భేదం లేదని.. డీఆర్‌డీఓ, ఇస్రో వంటి వేదికల్లో పురుషులు, మహిళలు ఉమ్మడి లక్ష్యం కోసం కలసి పనిచేస్తున్నారని టెస్సీ థామస్‌ పేర్కొన్నారు. తాను డీఆర్‌డీఓ వేదికగా పరిశోధన రంగంలోకి అడుగుపెట్టినప్పుడు మహిళలు ఒకట్రెండు శాతమే ఉండేవారని.. ఇప్పుడు 15 శాతం ఉన్నారని తెలిపారు. వినయం, నిబద్ధతను తన గురువు అబ్దుల్‌ కలాం వద్ద నేర్చుకున్నానని చెప్పారు. దేశ రక్షణ వ్యవస్థ కోసం అగ్ని క్షిపణులను రూపొందించడంలో కృషి తనకు జీవితకాల సంతృప్తిని ఇచి్చందన్నారు. అగి్న–4, అగ్ని–5 క్షిపణుల రూపకల్పనలో దేశీయ సాంకేతికత వాడుతున్నామని వివరించారు.మార్స్‌పైకి మనిíÙని పంపడాన్ని చూడాలనేది తన కోరిక అని చెప్పారు. 


ఏలియన్స్‌ లేవని చెప్పలేం..: సాధారణ హాలీవుడ్‌ సినిమా బడ్జెట్‌ కన్నా తక్కువ ఖర్చుతో భారత్‌ మూన్‌ ల్యాండర్‌ను ప్రయోగించడం దేశ ఆర్థిక క్రమశిక్షణకు అద్దం పడుతుందని ఇస్రో శాస్త్రవేత్త కల్పన కాళహస్తి తెలిపారు. ‘‘మూన్‌ ల్యాండర్‌ 4 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి, అధిక వేగంతో చంద్రుడి సమీపానికి చేరుకుంది. ఆ వేగాన్ని సమర్థవంతంగా నియంత్రించి.. చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా ల్యాండ్‌ చేయగలిగాం. శక్తివంతమైన భారత పరిశోధనలకు ఇది మంచి ఉదాహరణ. భవిష్యత్‌లో మరిన్ని అద్భుతాలు సృష్టిస్తాం. ప్రయోగాల్లో పూర్తిస్థాయిలో దేశీయ సాంకేతికతను ఉపయోగించనుండటం గర్వకారణం..’’అని చెప్పారు. అంతరిక్ష పర్యాటకం దిశగా ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు సాగుతున్నాయన్నారు. అంగారకుడిపై పరిశోధన కూడా తన కలల ప్రాజెక్టు అని చెప్పారు. ఏలియన్ల గురించి ప్రస్తావిస్తూ.. విశ్వంలో మనకు తెలియని అద్భుతాలెన్నో ఉన్నాయని, అందులో ఏలియన్స్‌ కూడా భాగం కావొచ్చని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement