Sharad Pawar Calls Opposition Unity Strategy To Defeat BJP - Sakshi
Sakshi News home page

వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించాలంటే అదొక్కటే మార్గం.. 

Jun 16 2023 8:33 PM | Updated on Jun 16 2023 8:54 PM

Sharad Pawar Calls Opposition Unity Strategy To Defeat BJP - Sakshi

న్యూఢిల్లీ: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధ్యక్షుడు సీనియర్ నేత శరద్ పవార్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీని ఎదుర్కోవడానికి విపక్షాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. జూన్ 23న బీహార్లో జరగనున్న విపక్షాల సమావేశంలో కూడా తాను ఇదే విషయాన్ని ప్రతిపాదించనున్నట్లు తెలిపారు.  

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 24వ ఆవిర్భావ దినోత్సవంలో ఆ పార్టీ అధ్యక్షులు శరద్ పవర్ మాట్లాడుతూ పార్టీ వర్గాలకు తమ భవిష్యత్తు కార్యాచరణ గురించి వివరించారు. కేంద్రంలో బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఐక్యతతో పోరాడాలని ఆకాంక్షించారు. బీజేపీ పార్టీని ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో బీజేపీని వద్దనుకుంటున్నారంటే రేపు కేంద్రంలో కూడా ఆ పార్టీని వద్దనుకునే అవకాశం లేకపోలేదు. ఇలాంటి సమయంలోనే ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలి. కలిసికట్టుగా బీజేపీని సాగనంపే ప్రయత్నం చేయాలని అన్నారు. 

బీజేపీ అధికారంలోకి రావడం కోసం కష్టసాధ్యమైన హామీలిచ్చి ప్రజలను మభ్య పెట్టింది. ప్రజలకు ఆ విషయం తేటతెల్లమైంది.  ఇప్పుడు వారు ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారు. అన్ని బీజేపీయేతర పార్టీలు సమిష్టిగా పోరాడితే ఆ పార్టీని ఓడించడం పెద్ద కష్టమేమీ కాదని అన్నారు. 

ఈ సందర్బంగా తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ప్రస్తావన తీసుకుని రాగా ఆయన స్పందిస్తూ అన్ని పార్టీలకూ తమ విస్తృతిని ఏ రాష్ట్రంలోనైనా పెంచుకునే అవకాశముంది. కానీ నాకెందుకో అది బీజేపీకి చెందిన తోక పార్టీగా అనిపిస్తోందన్నారు.  

ఇది కూడా చదవండి: వారితో చేతులు కలపడం దండగ.. 

        

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement