ఢిల్లీలో పొలిటికల్ అడ్వర్టైజ్‌మెంట్స్ తొలగించిన ఎంసీడీ | MCD Removes Over 520000 Political Ads in Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో పొలిటికల్ అడ్వర్టైజ్‌మెంట్స్ తొలగించిన ఎంసీడీ

Apr 2 2024 11:02 AM | Updated on Apr 2 2024 11:11 AM

MCD Removes Over 520000 Political Ads in Delhi - Sakshi

సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో దేశంలో ఎలక్షన్ కోడ్ అమలులో వచ్చింది. దీనిని దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) తన 12 జోన్‌ల నుంచి 5,20,042 పొలిటికల్ అడ్వర్టైజ్‌మెంట్స్ (హోర్డింగ్‌లు, పోస్టర్లు, వాల్ పెయింటింగ్‌లు, జెండాలు) తొలగించింది. 

ఎన్నికల షెడ్యూల్‌ను ఎలక్షన్ కమిషన్ (ఈసీ) మార్చి 16న ప్రకటించడంతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) అమల్లోకి వచ్చింది. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీలో మే 25న ఢిల్లీలో ఓటింగ్ ఉంటుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ తొలగించిన మొత్తం పొలిటికల్ అడ్వర్టైస్మెంట్లలో.. 257280 హోర్డింగ్‌లు, 192601 వాల్ పెయింటింగ్‌లు & పోస్టర్‌లు, 40022 సంకేతాలు, 30139 జెండాలు ఉన్నట్లు సమాచారం. ఎన్నికలు ముగిసే వరకు ఈ నియమం అమలులో ఉంటుందని ఎంసీసీ పేర్కొంది.

ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన 24 గంటల్లోపు బహిరంగ ప్రదేశంలో ఏదైనా రాజకీయ పార్టీ లేదా నాయకుడిని ప్రోత్సహించే పోస్టర్‌లు, హోర్డింగ్‌లు లేదా బ్యానర్‌లను తొలగించాలని ఈసీ ఇప్పటికే ఆదేశించింది. కాబట్టి ఎంసీడీ బ్యానర్లను ఎప్పటికప్పుడు తొలగిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement