బీజేపీ సీఎంలను ఎంపిక చేసేది వీరే | Bjp To Send Observers For Cm Selection In Three States | Sakshi
Sakshi News home page

బీజేపీ సీఎంలను ఎంపిక చేసేది వీరే

Dec 8 2023 12:47 PM | Updated on Dec 8 2023 3:23 PM

Bjp To Send Observers For Cm Selection In Three States - Sakshi

న్యూఢిల్లీ: ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించిన మూడు రాష్ట్రాల్లో సీఎంల ఎంపికకు బీజేపీ హై కమాండ్‌ కసరత్తు ప్రారంభించింది. సీఎంల ఎంపిక కోసం ప్రత్యేకంగా పరిశీలకులను నియమించింది. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ల కొత్త సీఎంల ఎంపిక కోసం పరిశీలకులను ఆయా రాష్ట్రాలకు పంపనుంది.

రాజస్థాన్‌కు పరిశీలకులుగా వెళ్లనున్న వారిలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఉన్నారు. మధ్యప్రదేశ్‌కు హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్‌, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్‌ముండా ఛత్తీస్‌గఢ్‌కు పరిశీలకులుగా వెళ్లనున్నారు. వీరితో కలిపి మూడు రాష్ట్రాలకు మొత్తం 9 మంది పరిశీలకులను బీజేపీ అధినాయకత్వం పంపనుంది.

రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూడు రాష్ట్రాల్లో గతంలో సీఎంలుగా పనిచేసిన వారిని కాకుండా కొత్త ముఖాలను ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేసే ఆలోచనలో పార్టీ హై కమాండ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంతోనే అక్కడ సీఎంల ఎంపిక ఇంత ఆలస్యమవుతోందన్న ప్రచారం జరుగుతోంది. 

ఇదీచదవండి.. సహజీవనం ప్రమాదకరమైన జబ్బు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement