దేవర భామకు బిగ్ ఛాన్స్.. ఏకంగా రూ.500 కోట్ల సినిమాలో! | Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: స్టార్‌ హీరో సరసన ఛాన్స్ కొట్టేసిన దేవర హీరోయిన్.. ఎవరంటే?

Published Sun, Jan 28 2024 7:19 PM

Janhvi Kapoor Gets Chance With Star Hero In Huge Budget Movie Goes Viral - Sakshi

శ్రీదేవి ముద్దుల కూతురు, బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌ ఇప్పటికే టాలీవుడ్‌ ఎంట్రీ ఖాయమైంది. జూనయర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో కనిపించనుంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. బాలీవుడ్‌ సినిమాల్లో అరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ.. ఇప్పుడు సౌత్‌లోనూ అడుగుపెడుతోంది. ఇప్పటికే టాలీవుడ్‌ క్రేజీ ఛాన్స్‌ కొట్టేసిన జాన్వీ మరో జాక్‌ పాట్‌ తగినలినట్లు లేటేస్ట్ టాక్. కోలీవుడ్‌లోనూ స్టార్‌ హీరోతో నటించబోతోందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అదేంటో తెలుసుకుందాం. 

(ఇది చదవండి: రాజమౌళిపై కోపం వచ్చింది.. ఎందుకంటే: హనుమాన్ డైరెక్టర్)

కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్య, బాలీవుడ్ డైరెక్టర్‌ రాకేశ్ ఓంప్రకాశ్ మిశ్రా క్రేజీ ప్రాజెక్ట్ కర్ణలో నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. మహాభారతంలోని కర్ణుడి పాత్రను ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ

తాజాగా ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు బీటౌన్‌లో టాక్ నడుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే మేకర్స్ ఆమెను సంప్రదించినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై జాన్వీ కపూర్ టీమ్‌ కానీ, మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరికొద్ది రోజుల్లోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముంది. ఒకవేళ ఇదే నిజమైతే కోలీవుడ్‌లో జాన్వీ కపూర్‌ అరంగేట్రం ఇవ్వనుంది. 
  


 

Advertisement
 
Advertisement