భోజనానికి సగటున 96 నిమిషాలు! | Study reveals what the average person does all day | Sakshi
Sakshi News home page

భోజనానికి సగటున 96 నిమిషాలు!

Jun 19 2023 5:17 AM | Updated on Jun 19 2023 5:17 AM

Study reveals what the average person does all day - Sakshi

ఆధునిక యుగంలో మనిషి జీవితం యాంత్రికంగా మారిపోతోంది. పొద్దున నిద్ర నుంచి లేచింది మొదలు రాత్రి మళ్లీ పడకపైకి చేరేదాకా అంతా రొటీన్‌గా సాగిపోతోంది. పల్లె జీవితానికి, నగర జీవితానికి కొంత వ్యత్యాసం ఉంటోంది. పల్లె అయినా, నగరమైనా తినడం, పని చేయడం, నిద్రపోవడం.. ఇదే చక్రం పునరావృతం అవుతోంది.

ప్రపంచవ్యాప్తంగా మనుషుల సగటు జీవితం ఎలా సాగుతోందన్న దానిపై కెనడాలోని మెక్‌గిల్‌ యూనివర్సిటీ పరిశోధకులు ఆసక్తికరమైన అధ్యయనం నిర్వహించారు. ప్రజల రోజువారీ జీవితం ఎలా ఉంటోంది? ఏ పనికి ఎంత సమయం కేటాయిస్తున్నారు? అనేది నిశితంగా పరిశీలించారు. ఇందుకోసం 58 దేశాల్లో వివిధ జాతీయ సర్వేల గణాంకాలను క్రోడీకరించారు. ప్రపంచ జనాభాలో 60 శాతం ఈ అధ్యయనం పరిధిలోకి వచ్చారు. అధ్యయనంలో ఏం తేలిందంటే..   

► ఉద్యోగం, ఉపాధి కోసం మనుషులు వారానికి సగటున 41 గంటలు వెచి్చస్తున్నారు.  
► ఇంట్లో పరిశుభ్రతకు 2.5 గంటలు, తోట పనులు, ఇతర వ్యక్తిగత పనులకు 3.4 గంటలు వెచి్చస్తున్నారు.  
► స్నేహితులతో బయట ఆనందంగా గడపడానికి, టీవీ వీక్షించడానికి, ఆటలు ఆడడానికి సగటున 6.5 గంటలు వెచి్చస్తున్నట్లు తమ అధ్యయనంలో వెల్లడయ్యిందని పరిశోధకుడు ఎరిక్‌ గాల్‌బ్రెయిత్‌ చెప్పారు.  
► గిన్నెలు కడుక్కోవడం, వంట చేసుకోవడం, టేబుళ్లు శుభ్రం చేసుకోవడానికి జనం 55 నిమిషాలు ఖర్చు చేస్తున్నారు.  
► భోజనం చేయడానికి 96 నిమిషాలు(1.6 గంటలు) వెచ్చిస్తున్నారు.  
► చేపలు పట్టడం, పంటల సాగు, ఇతర వ్యవసాయ సంబంధిత పనులకు 52 నిమిషాల (0.9 గంటలు) సమయం ఖర్చవుతోంది.  
► స్నానం, ఆరోగ్య సంరక్షణ వంటి పనుల్లో 2.5 గంటలు గడుపుతున్నారు.  
► సర్వేలో చిన్న పిల్లలను కూడా చేర్చడంతో కొన్ని పనులకు పట్టే సమయం అధికంగా ఉన్నట్లు కనిపిస్తుందని అధ్యయనకర్తలు వెల్లడించారు.  
► నిద్ర కోసం వెచి్చస్తున్న సమయం 9 గంటలు కాగా, ఇందులో పిల్లల నిద్ర 11 గంటలు, పెద్దల నిద్ర 7.5 గంటలుగా ఉంది.  
► కొన్ని విషయాల్లో దేశాల మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. మతపరమైన ప్రార్థనలు, పూజలకు నిత్యం 12 నిమిషాలు వెచి్చస్తుండగా, కొన్ని దేశాల్లో ఈ సమయం మరింత ఎక్కువగా ఉంటోంది.
► వివిధ దేశాల నడుమ ఆదాయంలో తేడాలు, సాంస్కృతిక వ్యత్యాసాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. అలాగే ఆయా దేశాల్లో వివిధ పనులకు ప్రజలు వెచి్చంచే సమయాల్లోనూ తేడాలు ఉంటాయని పరిశోధకులు వెల్లడించారు.  
► ఉదాహరణకు సంపన్న దేశాలతో పోలిస్తే పేద దేశాల్లో వ్యవసాయం కోసం వెచ్చించే సమయం అధికం.  
► ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణించే సమయం విషయంలో దేశాల మధ్య పెద్దగా తేడాలు లేవని గుర్తించారు. 
 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement