breaking news
McGill University
-
భోజనానికి సగటున 96 నిమిషాలు!
ఆధునిక యుగంలో మనిషి జీవితం యాంత్రికంగా మారిపోతోంది. పొద్దున నిద్ర నుంచి లేచింది మొదలు రాత్రి మళ్లీ పడకపైకి చేరేదాకా అంతా రొటీన్‌గా సాగిపోతోంది. పల్లె జీవితానికి, నగర జీవితానికి కొంత వ్యత్యాసం ఉంటోంది. పల్లె అయినా, నగరమైనా తినడం, పని చేయడం, నిద్రపోవడం.. ఇదే చక్రం పునరావృతం అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా మనుషుల సగటు జీవితం ఎలా సాగుతోందన్న దానిపై కెనడాలోని మెక్‌గిల్ యూనివర్సిటీ పరిశోధకులు ఆసక్తికరమైన అధ్యయనం నిర్వహించారు. ప్రజల రోజువారీ జీవితం ఎలా ఉంటోంది? ఏ పనికి ఎంత సమయం కేటాయిస్తున్నారు? అనేది నిశితంగా పరిశీలించారు. ఇందుకోసం 58 దేశాల్లో వివిధ జాతీయ సర్వేల గణాంకాలను క్రోడీకరించారు. ప్రపంచ జనాభాలో 60 శాతం ఈ అధ్యయనం పరిధిలోకి వచ్చారు. అధ్యయనంలో ఏం తేలిందంటే.. ► ఉద్యోగం, ఉపాధి కోసం మనుషులు వారానికి సగటున 41 గంటలు వెచి్చస్తున్నారు. ► ఇంట్లో పరిశుభ్రతకు 2.5 గంటలు, తోట పనులు, ఇతర వ్యక్తిగత పనులకు 3.4 గంటలు వెచి్చస్తున్నారు. ► స్నేహితులతో బయట ఆనందంగా గడపడానికి, టీవీ వీక్షించడానికి, ఆటలు ఆడడానికి సగటున 6.5 గంటలు వెచి్చస్తున్నట్లు తమ అధ్యయనంలో వెల్లడయ్యిందని పరిశోధకుడు ఎరిక్ గాల్బ్రెయిత్ చెప్పారు. ► గిన్నెలు కడుక్కోవడం, వంట చేసుకోవడం, టేబుళ్లు శుభ్రం చేసుకోవడానికి జనం 55 నిమిషాలు ఖర్చు చేస్తున్నారు. ► భోజనం చేయడానికి 96 నిమిషాలు(1.6 గంటలు) వెచ్చిస్తున్నారు. ► చేపలు పట్టడం, పంటల సాగు, ఇతర వ్యవసాయ సంబంధిత పనులకు 52 నిమిషాల (0.9 గంటలు) సమయం ఖర్చవుతోంది. ► స్నానం, ఆరోగ్య సంరక్షణ వంటి పనుల్లో 2.5 గంటలు గడుపుతున్నారు. ► సర్వేలో చిన్న పిల్లలను కూడా చేర్చడంతో కొన్ని పనులకు పట్టే సమయం అధికంగా ఉన్నట్లు కనిపిస్తుందని అధ్యయనకర్తలు వెల్లడించారు. ► నిద్ర కోసం వెచి్చస్తున్న సమయం 9 గంటలు కాగా, ఇందులో పిల్లల నిద్ర 11 గంటలు, పెద్దల నిద్ర 7.5 గంటలుగా ఉంది. ► కొన్ని విషయాల్లో దేశాల మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. మతపరమైన ప్రార్థనలు, పూజలకు నిత్యం 12 నిమిషాలు వెచి్చస్తుండగా, కొన్ని దేశాల్లో ఈ సమయం మరింత ఎక్కువగా ఉంటోంది. ► వివిధ దేశాల నడుమ ఆదాయంలో తేడాలు, సాంస్కృతిక వ్యత్యాసాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. అలాగే ఆయా దేశాల్లో వివిధ పనులకు ప్రజలు వెచి్చంచే సమయాల్లోనూ తేడాలు ఉంటాయని పరిశోధకులు వెల్లడించారు. ► ఉదాహరణకు సంపన్న దేశాలతో పోలిస్తే పేద దేశాల్లో వ్యవసాయం కోసం వెచ్చించే సమయం అధికం. ► ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణించే సమయం విషయంలో దేశాల మధ్య పెద్దగా తేడాలు లేవని గుర్తించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కోవిడ్ టీకా వచ్చే ఏడాదికి అనుమానమే
న్యూఢిల్లీ: సాధారణ ప్రజలకు 2020–21 ఏడాది మధ్య నాటికి కూడా సమర్థవంతమైన వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని వ్యాక్సిన్ల అభివృద్ధిలో నిమగ్నమైన కొందరు నిష్ణాతులు చెప్పారు. కెనడాలోని మెక్‌గిల్ విశ్వవిద్యాలయ పరిశోధకులు, 2020 జూన్ చివరలో టీకా తయారీ రంగంలో పనిచేస్తున్న 28 మంది పరిశోధకులపై ఒక సర్వే నిర్వహించారు. (చదవండి: గుడ్‌న్యూస్ : జనవరి నాటికి కోవిడ్-19 వ్యాక్సిన్) అమెరికా చెపుతున్నట్టు 2021 నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వీరిలో చాలా మంది చెప్పారని మెక్‌గిల్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ జొనాథన్ కిమ్మెల్మాన్ అన్నారు. కనీసం 2022 నాటికైనా అందుబాటులోకి వస్తే అది గొప్ప విషయమేననీ, సమర్థవంతమైన వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే ముందు, వ్యాక్సిన్ తయారీలో కొన్ని తప్పులు దొర్లే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. (చదవండి: వ్యాక్సిన్ కహానీ: అందుబాటులోకి వచ్చేదెలా?) -
మధుమేహ మందుతో మూత్రకోశ కేన్సర్ ముప్పు
టొరంటో: మధుమేహానికి వాడే ఓ ఔషధం మూత్రకోశ కేన్సర్ ముప్పును అధికం చేస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. టైప్-2 మధుమేహ వ్యాధిగ్రస్తుల రక్తంలోని షుగర్ స్థాయిని నియంత్రించే థయాజోలిడినెడియోన్స్ తరగతికి చెందిన పియోగ్లిటాజోన్ను ఉపయోగించడం వల్ల ఈ ప్రమాదం ఉందని కెనడాలోని మెక్‌గిల్ విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఇతర యాంటీబయోటిక్స్‌తో పోల్చినప్పుడు టైప్-2 మధుమేహ రోగుల్లో పియోగ్లిటాజోన్ వాడకం వల్ల బ్లాడర్ కేన్సర్ అవకాశాలు 63% పెరుగుతున్నాయంది. బ్రిటన్ ‘క్లినికల్ ప్రాక్టీస్ రీసెర్చ్ డేటాబేస్’ నుంచి సేకరించిన వివరాలపై అధ్యయనం చేసిన వర్సిటీ ఈ నిర్ధారణకు వచ్చింది. స్కిన్ ప్యాచ్: టైప్2 మధుమేహులకు చెమట ద్వారా గ్లూకోజు స్థాయిలను పసిగట్టి తగిన మోతాదులో ఇన్సులిన్‌ను సూక్ష్మసూదుల ద్వారా శరీరంలోకి పంపే ‘డయాబెటిక్ కంట్రోల్ స్కిన్‌ప్యాచ్’ను కొరియాబృందం అభివృద్ధిచేసింది.