ఎస్‌బీఐ ఫెస్టివ్ ఆఫర్స్: ఎస్‌ఎంఈలకు తీపి కబురు

దేశంలోని అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ సీజన్ షురూ అయిన నేపథ్యంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎస్‌ఎంఈ) కోసం వరుస పండుగ ఆఫర్‌లను ప్రారంభించాలని యోచిస్తోంది. కొన్ని లాభదాయకమైన హోమ్ లోన్ డిస్కౌంట్‌లతో పాటు ఎస్‌ఎంఈల కోసం కొలేటరల్-ఫ్రీ లోన్స్ అందించాలని ఎస్‌బీఐ నిర్ణయించింది. ముఖ్యంగా ఈ పండుగ సీజన్‌లో SMEల కోసం ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా రుణాలను అందిస్తున్నట్టు బ్యాంకు తెలిపింది. (ఎస్‌బీఐ మాజీ చైర్మన్ రజనీష్ సంపాదన ఎంతో తెలిస్తే!)
ఎస్‌బీఐ ఎండీ అలోక్ కుమార్ చౌదరి జీ బిజినెస్‌కు అందించిన వివరాల ప్రకారం ఎస్‌ఎంఈల కోసం కొలేటరల్-ఫీ లోన్( ఎలాంటి తనఖా) అందించేందు ప్లాన్ చేస్తోంది. దీని ద్వారా చిన్న, మధ్య తరహా వ్యాపారులు డిజిటల్‌గా క్రెడిట్ సౌకర్యాలను పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వ వివిధ పథకాలను కస్టమర్లకు విస్తరించే లక్ష్యంలో భాగంగా ఇది డిజిటల్ సేవల ద్వారా వినియోగదారులకు అనుకూలమైన సేవలతో నిమగ్నమవ్వడానికి కూడా సహాయపడుతుందని భావిస్తోంది.అలాగే ‘అండర్‌రైటింగ్’ ప్రక్రియ లేదా రుణదాత ఒకరి ఆదాయం, ఆస్తులు, అప్పు, ఆస్తి వివరాలను ధ్రువీకరించే ప్రక్రియ మరింత ఈజీ చేస్తుంది.
అంతేకాదు ఎస్‌ఎంఈలకు ఈ పండుగ సీజన్‌లో ఎస్‌బీఐ యోనో యాప్‌లో తమ ఉత్పత్తులను ప్రదర్శించే అవకాశాన్నికల్పిస్తోంది. బ్యాంక్ తన ఎస్‌ఎంఈ రుణగ్రహీతలను ఇతర ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లాగా యోనో యాప్‌లో తమ ఉత్పత్తుల లిస్టింగ్‌కు అనుమతిస్తుందని, ఈ ఆఫర్లు కస్టమర్లకు నచ్చతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇతర ఆఫర్లపై కూడా మాట్లాడిన ఆయన ఎంపిక చేసిన కస్టమర్లకు తమ గృహ రుణాలపై 65 బేసిస్ పాయింట్ల (బీపీఎస్) వరకు రాయితీలను కూడా అందిస్తోంది. ఈ డిస్కౌంట్ డిసెంబర్ 31, 2023 వరకు కొనసాగుతుందన్నారు.