డిమాండ్‌కు మించి సరఫరా జరుగుతుండటంతో హైదరాబాద్‌లో (hyderabad) అమ్ముడుపోకుండా ఉన్న ఇళ్లు(ఇన్వెంటరీ) (residential real estate inventory) పెరిగిపోతున్నాయి. దేశంలోని ఏడు ప్రధాన మెట్రో నగరాలతో పోలిస్తే ముంబై తర్వాత హైదరాబాద్‌లోనే అత్యధిక ఇన్వెంటరీ ఉంది. - సాక్షి, సిటీబ్యూరో
ఇక, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాలతో పోలిస్తే మన దగ్గరే ఎక్కువ. గతేడాది నాటికి గ్రేటర్‌లో 1,01,091 ఇళ్ల ఇన్వెంటరీ (వీటిలో నిర్మాణంలో ఉన్నవి, పూర్తయినవి కలిపి) ఉంది. వీటి విక్రయానికి కనిష్టంగా 19 నెలల కాలం పడుతుంది. గత రెండేళ్లలో నగరంలో గృహాల సరఫరా పెరగడమే ఇన్వెంటరీ పెరుగుదలకు ప్రధాన కారణం.
దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో ఏడాది తొలి తొమ్మిది నెలల కాలంలో మొత్తం 5,64,416 యూనిట్ల ఇన్వెంటరీ మిగిలి ఉందని, వీటి విక్రయానికి కనిష్టంగా 14 నెలల కాలం పడుతుందని అనరాక్ గ్రూప్ నివేదిక వెల్లడించింది.
ఇదీ చదవండి: మెట్రో వెంట.. రియల్ ఎస్టేట్ బూమ్!
2024లో కొత్త ఇళ్ల సరఫరా అంతకు ముందు ఏడాదితో పోలిస్తే తగ్గిందని అనరాక్ నివేదిక పేర్కొంది. ఎన్నికల నేపథ్యంలో అప్రూవల్స్‌లో జాప్యం కారణంగా హౌసింగ్ సప్లయి తగ్గిపోయినట్లు చెప్పినట్లు చొప్పుకొచ్చింది.

2025 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని ప్రధాన నగరాల్లో దాదాపు 253 మిలియన్ చ.అ.మేర కొత్త ఇళ్ల సరఫరాను ప్రారంభించే ప్రణాళికలను టాప్ 11 లిస్టెడ్ డెవలపర్లు ఏడాది ప్రారంభంలో ప్రకటించారని అనరాక్ గుర్తు చేసింది. అయితే సార్వత్రిక, రాష్ట్రాల ఎన్నికల కారణంగా
వీటిలో కేవలం 23% లేదా 57 మిలియన్ చ.అ.ల మేర ప్రాజెక్ట్‌లు మాత్రమే ఏడాది ప్రథమార్థంలో ప్రారంభమయ్యాయి.


