
జియో, ఎయిర్‌టెల్ రీఛార్జ్ ప్లాన్స్ ధరలను భారీగా పెంచిన తరువాత బీఎస్ఎన్ఎల్ ఊపందుకుంది. ఇప్పటికే లక్షలమంది యూజర్లు బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌లోకి చేరారు. తమ యూజర్లకు అత్యుత్తమ సర్వీస్ అందించడానికి.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) త్వరలో 4G, 5G రెడీ సిమ్ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి రీవడానికి సిద్ధమైంది. ఈ విషయాన్ని టెలికమ్యూనికేషన్స్ విభాగం ఇటీవల వెల్లడించింది.
ఈ విషయాన్ని డాట్ ఇండియా తన అధికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేసింది. 4G, 5G సర్వీస్ అనేది భౌగోళిక పరిస్థితులతో సంబంధం లేకుండా ఎక్కడైనా ఉపయోగించుకోవడానికి అనుకూలంగా ఉంటుందని ఇందులో పేర్కొన్నారు.
భారతదేశంలో ప్రముఖ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ కంపాటబుల్ ఓవర్ ది ఎయిర్ (OTA), యూనివర్సల్ సిమ్ (U SIM) ప్లాట్‌ఫారమ్‌ను త్వరలోనే విడుదల చేయనుంది. దీని ద్వారా యూజర్లు తమ మొబైల్ నెంబర్లను ఎంచుకోవచ్చు. దీనికి ఎలాంటి భౌగోళిక పరిమితులు లేవు.
గత సంవత్సరం.. నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం మొత్తం రూ. 89,047 కోట్లతో బీఎస్ఎన్ఎల్ కోసం మూడవ పునరుద్ధరణ ప్యాకేజీని ఆమోదించింది. బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణ వ్యూహంలో భాగంగా ఈ ప్యాకేజ్ ప్రకటించడం జరిగిందని ప్రభుత్వం తెలిపింది. ఇందులో 4G/5G స్పెక్ట్రమ్ కేటాయింపులు కూడా ఉన్నాయి.
BSNL ready. Bharat ready.#ComingSoon pic.twitter.com/BpWz0gW4by
— DoT India (@DoT_India) August 10, 2024