తనిష్క్‌, రిలయన్స్‌కు చేదువార్త: వేల కోట్లతో మరో దిగ్గజం ఎంట్రీ

Aditya Birla Group forays branded jewellery retail biz invests Rs 5000cr - Sakshi

 బ్రాండెడ్ జ్యువెలరీ రిటైల్ వ్యాపారంలోకి ఆదిత్య బిర్లా

 5000 కోట్ల పెట్టుబడులు, త్వరలోనే దేశవ్యాప్తంగా రీటైల్‌  స్టోర్లు

ప్రముఖ వ్యాపార సంస్థ ఆదిత్య బిర్లా గ్రూప్ బ్రాండెడ్ జ్యువెలరీ రిటైల్ వ్యాపారంలోకి ప్రవేశించ నుంది. ఇప్పటికే పలురంగాల్లో దూసుకుపోతున్న కుమార్‌ మంగళం బిర్లా నేతృత్వంలోని సంస్థ వేల కోట్ల పెట్టుబడితో దేశవ్యాప్తంగా   ప్రత్యేక రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేయనుంది. 

బ్రాండెడ్ జ్యువెలరీ రిటైల్ వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నట్టు ఆదిత్యా బిర్లా ఓ ప్రకటనలో తెలిపింది. దాదాపు రూ. 5000 కోట్ల పెట్టుబడితో 'నావల్ జ్యువెల్స్' అనే కొత్త వెంచర్ కింద ఆభరణాల వ్యాపారం ఉంటుందని కంపెనీ తెలిపింది. ప్రత్యేకమైన డిజైన్, అధిక నాణ్యత కలిగిన ఆభరణాల ద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలందించే లక్ష్యంతో కొత్త వెంచర్ ఉంటుందని పేర్కొంది.  (నీతా అంబానీ ఔదార్యం: బాధితులకు భారీ సాయం)

వ్యూహాత్మక పోర్ట్‌ఫోలియో అని, తద్వారా దేశవ్యాప్తంగా వినియోగదారులకు చేరువ కావడానికి, సంస్థ ఉనికిని విస్తరించేందుకు అవకాశం లభిస్తుందని ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా అన్నారు.  ఇ‍ప్పటికే పెయింట్స్, B2B ఇ-కామర్స్‌లో ప్రవేశించడమే కాకుండా, మెటల్‌  పల్ప్ ఫైబర్, సిమెంట్, కెమికల్స్, టెక్స్‌టైల్స్, కార్బన్ బ్లాక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫ్యాషన్ రిటైల్, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాలలో  విస్తరించిన ఆదిత్య బిర్లా గ్రూప్ ఇపుడిక బ్రాండెడ్ జ్యువెలరీ విభాగంలోకి ఎంట్రీ ఇస్తోంది. (మనవరాలికోసం అంబానీ ఏం చేశారో తెలుసా? ఇంటర్నెట్‌లో వీడియో వైరల్‌)

దీంతో టాటా గ్రూప్‌నకు చెందిన తనిష్క్, రిలయన్స్ జ్యువెల్స్‌తో పోటీ పడనుంది ఆదిత్య బిర్లా గ్రూప్. కంపెనీ  డేటా ప్రకారం, దేశీయ ఆభరణాల మార్కెట్ 2025 నాటికి సుమారు రూ. 7.43 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా. భారత రత్నాభరణాల మార్కెట్  వాటా దేశ జీడీపీలో 7 శాతం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top