బాబు నీచ రాజకీయాలకు ఇది పరాకాష్ట: భూమన | Bhumana Karunakar Reddy Serious On Chandrababu Over Tirumala Laddu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు నీచ రాజకీయాలకు ఇది పరాకాష్ట: భూమన కరుణాకరరెడ్డి

Sep 19 2024 10:37 AM | Updated on Sep 19 2024 12:47 PM

Bhumana Karunakar Reddy Serious On Chandrababu Over Tirumala Laddu

సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి ప్రసాదం విషయంలో చంద్రబాబు చేస్తున్న ఆరోపణలను టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి ఖండించారు. తిరుమల శ్రీవారి ప్రసాదాలు గురించి విష ప్రచారం చేస్తే స్వామి వారే వారికి శిక్ష విధిస్తారు అంటూ కామెంట్స్‌ చేశారు.

తాజాగా భూమన మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలకు ఇది పరాకాష్ట. తిరుమల శ్రీవారి ప్రసాదం గురించి విష ప్రచారం చేస్తే స్వామి వారే వారికి శిక్ష విధిస్తారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశంపై ఇలాంటి విష ప్రచారం తగదు చంద్రబాబు. పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదం తయారికి శ్రీ వైష్ణవులు ఎంతో శుద్ధిగా వాటిని తయారు చేస్తారు. లడ్డూ ప్రసాదం తయారీకి ప్రత్యేకమైన దిట్టం ఉంది. దాని ప్రకారమే ప్రసాదాలు తయారు అవుతాయి. వీటిలో ఎవరి జోక్యం ఉండదు.

1999-2003 చంద్రబాబు పాలనలో గతంలో పోటు వర్కర్లు ఆందోళనకు దిగారు. 2014-19 టీడీపీ పాలనలో నెయ్యి సరఫరా చేసిన కంపెనీలే 2019-24 లోనూ మెజారిటీ సంస్థలు నెయ్యి సరఫరా చేశాయి. అప్పటి నాణ్యత మా ప్రభుత్వం పాలనలో లేదని చెప్పడం అంటే ఇది చంద్రబాబు నీచ రాజకీయాలకు ఉదాహరణ. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజలు దృష్టి మరల్చడానికి ఇలాంటి కుట్రలు చేస్తున్నారు. చంద్రబాబు జీవితం అంత విష ప్రచారం, నీచ రాజకీయాలు చేయడమే. శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చేసిన అనుచిత వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలి. కనీసం ఇంట్లో ఉన్న వేంకటేశ్వర స్వామి చిత్ర పటం ముందుకు వెళ్లి అయినా క్షమాపణ కోరి, పశ్చాతాపం చేసుకో చంద్రబాబు అంటూ భూమన ఘాటు విమర్శలు చేశారు. 

ఇది కూడా చదవండి: సూపర్‌ సిక్స్‌-నారావారి వంచన ఫిక్స్‌.. జనం ఏమంటున్నారంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement