breaking news
Zubeen Garg
-
ప్రముఖ సింగర్ అనుమానాస్పద మృతి.. ఆ ఇద్దరు అరెస్ట్
ప్రముఖ గాయకుడు, కింగ్ ఆఫ్ హమ్మింగ్ జుబీన్ గార్గ్ (Zubeen Garg) మృతి కేసులో పోలీసులు ఇద్దర్ని అరెస్ట్ చేశారు. నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ (NEIF) నిర్వాహకుడు శ్యాంకను మహంత, జుబీన్ గార్గ్ మేనేజర్ సిద్దార్థ శర్మను బుధవారం అదుపులోకి తీసుకున్నారు. సింగపూర్‌లో ఈవెంట్ ముగించుకుని వచ్చిన మహంతను న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్‌లో, సిద్దార్థ శర్మను గురుగ్రామ్‌లోని అతడి అపార్ట్మెంట్లో అరెస్ట్ చేశారు. విచారణ కోసం వీరిద్దరినీ గౌహతికి తీసుకెళ్లినట్లు సీనియర్ పోలీస్ అధికారి మీడియాకు వెల్లడించారు.సింగర్ అనుమానాస్పద మృతిసింగపూర్లో జరిగిన నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్లో ప్రదర్శన ఇచ్చేందుకు వెళ్లిన జుబీన్.. సెప్టెంబర్ 19న సముద్ర స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు మరణించారు. ఆ సమయంలో అతని ఒంటి మీద లైఫ్ జాకెట్ లేదు. దీంతో ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. సింగర్ మృతికి కారణమైనవారిని వదిలేది లేదని అస్సాం ముఖ్యమత్రి హిమంత బిశ్వశర్మ ప్రకటించారు. సీఎం ఆదేశాల మేరకు ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారిస్తోంది.ఎవరీ జుబీన్ గార్గ్?జుబీన్ గార్గ్ అసలు పేరు మోహిని మోహన్. 1972 నవంబర్ 18న అస్సాంలో జన్మించారు. తల్లి గాయని, తండ్రి కవి కావడంతో ఇద్దరి ప్రతిభను అందిపుచ్చుకుని మంచి గాయకుడిగా మారారు. మూడేళ్ల వయసు నుంచే పాటలు పాడటం ప్రారంభించారు. ప్రఖ్యాత సంగీతకారుడు జుబీన్ మెహతా అంతటివాడు కావాలని జుబీన్ గార్గ్ అని పెట్టుకున్నారు. 40కిపైగా భాషల్లో పాటలు పాడారు. సింగర్‌గానే కాకుండా రచయిత, సంగీత దర్శకుడు, సినీ దర్శకుడు, నటుడిగా ప్రేక్షకులను అలరించారు.చదవండి: దుస్తులు విప్పేసి కొట్టేందుకు యత్నం.. హీరోయిన్‌పై కేసు -
వారి గుండె అస్సాం కోసమే కొట్టుకుంది
ఒక గాయకుడు మరణిస్తే జనం సముద్రంలా పోటెత్తడం జుబీన్ గార్గ్ అంతిమ యాత్రలో దేశం చూసింది. ఎవరీ జుబీన్ గార్గ్ అని ఆరా తీసింది. అతడు అస్సాం గొంతుక, అస్సాం సంగీతానికి గుండెకాయ. అభిమానులు ‘కింగ్ ఆఫ్ హమ్మింగ్’ అని పిలుచుకునే జుబీన్ గార్గ్ ఈశాన్య రాష్ట్రాలన్నీ గర్వపడే సంగీత సముద్రం. గాయకుడు, సంగీత కారుడు, వాద్యకారుడు, సామాజిక సేవకుడు, దాత... ఇంకా మరెన్నో. ఇప్పటికి దాదాపు పదివేలకు పైగా పాటలు పాడి, రికార్డు చేసి స్థానిక గీతాలకు గొంతుకనిచ్చాడు. అంతేకాదు ప్రజల తరఫున అవసరమైనప్పుడల్లా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తడానికి కూడా వెనుకాడలేదు. అందుకే అతణ్ణి జనం గుండెల్లో పెట్టుకున్నారు.చని పోతే గుండెలు పగిలేలా ఏడ్చారు. ఒకప్పుడు దేశాన్ని ఒక ఊపు ఊపిన ‘యాలీ... రహమ్ వాలీ’ పాట జుబిన్ పాడిందే.జుబీన్ మెహతా అంతటి వాడు కావాలని...జుబీన్ గార్గ్ అసలు పేరు మోహిని మోహన్. ప్రఖ్యాత సంగీతకారుడు జుబీన్ మెహతా అంతటివాడు కావాలని జుబీన్ గార్గ్ అని పెట్టుకున్నాడు. గార్గ్ అతని గోత్రనామం. తల్లి గాయని కావడం, తండ్రి కవి కావడంతో వారిద్దరి అంశతో వాగ్గేయకారుడు అయ్యాడు. క్షణాల్లో పాట కట్టి పాడగలడు. అందులో అస్సామీ సంస్కృతిని చూపిస్తాడు. హిందీ, బెంగాలీ, అస్సామీ తదితర భాషల్లోనే కాదు ఈశాన్య రాష్ట్రాల స్థానిక భాషల్లో కూడా పాడాడు.సింగపూర్‌లో జరుగుతున్న నార్త్ ఇండియా ఫెస్టివల్లో ప్రదర్శన ఇచ్చేందుకు వెళ్లిన జుబిన్ సెప్టెంబర్ 19న సముద్ర స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు మరణించాడు. ఆ సమయంలో అతని ఒంటి మీద లైఫ్ జాకెట్ లేదు. అతని పార్థివదేహం భారత్‌కు చేరుకోగానే వేలాది మంది అభిమానులు అతన్ని ఆఖరిసారి చూసేందుకు ఎయిర్ పోర్ట్‌కు తరలి వచ్చారు. సెప్టెంబర్ 23న జరిగిన అంతిమయాత్రలో లక్షలాది మంది పాల్గొన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. అతని స్మారక స్థూపం కోసం మూడున్నర ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది.అతని ప్రేమకథజుబీన్ గార్గ్‌కు వేలాది మంది అమ్మాయిలు ఫాన్స్‌గా ఉన్నారు. వారిలో ఒకమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు గరిమా సైకియా. జుబిన్ ఆల్బమ్స్ ‘అనామిక’, ‘మాయ’ విని గరిమ ఆయనకు అభిమానిగా మారారు. ఆ సమయంలో ఆమె ముంబయిలో ఉన్నారు. ఇంటి నుంచి దూరంగా ఉంటూ, హోమ్‌సిక్ అనుభవిస్తున్న ఆమెకు ఆ పాటలు ప్రశాంతతను అందించాయి. తన అభిమానాన్ని ఓ ఉత్తరం రూపంలో రాసి ఆయనకు పంపారు. జుబీన్ తన అభిమానులకు ఎప్పుడూ ప్రత్యుత్తరం రాయలేదు. మొదటిసారి గరిమ రాసిన ఉత్తరానికి ప్రత్యుత్తరం రాశాడు.వారి ప్రేమకు అక్కడే బీజం పడింది. ఆ తర్వాత కొంతకాలం ఉత్తరాల ద్వారా ప్రేమ బలపడింది. అయితే అన్ని ప్రేమకథల్లాగే వీరి ప్రేమకూ ఆటంకాలు తప్పలేదు. గరిమ కుటుంబం ఈ ప్రేమను అంగీకరించలేదు. ఆమె తండ్రి ససేమిరా అన్నారు. గరిమ సైతం జుబీన్ ప్రవర్తనతో కొంత విసిగి పోయారు. ఆయనకు దూరంగా ఉండటమే మంచిదని భావించి దూరంగా వెళ్లారు. ఆ తర్వాత జుబీన్ పరిస్థితి తలకిందులైంది.దేని మీదా ఏకాగ్రత నిలవలేదు. ఆ ప్రభావం అతను చేస్తున్న పని మీద పడింది. పాటల్లో పస ఉండటం లేదని అభిమానులు పెదవి విరిచారు. డిప్రెషన్ చుట్టుముట్టింది. ఇదంతా విన్నాక గరిమ మనసు కరిగింది. ఒకరినొకరు విడిచి ఉండలేరని ఇద్దరికీ అర్థమై 2002 ఫిబ్రవరి 4న వివాహం చేసుకున్నారు. 23 ఏళ్లుగా వారి బంధం పటిష్ఠంగా ఉంది. ఉన్నట్టుండి జుబీన్ లేక పోవడాన్ని గరిమ జీర్ణించుకోలేక పోతున్నారు. వారిద్దరి ప్రేమ గురించి తెలిసినవారంతా కన్నీరు పెడుతున్నారు. సమాజం కోసం కలిసి నడిచారుజుబీన్ గార్గ్–గరిమ దంపతులకు సొంత పిల్లలు లేరు. కానీ 15 మంది నిరుపేద పిల్లల్ని వారు దత్తత తీసుకొని, వారి ఆలనా పాలనా చూశారు. వీరిలో ‘కాజలి’ అనే పాప వారిద్దరికీ ఎంతో ప్రియమైన బిడ్డ. ఓరోజు జుబీన్ కారులో ఇంటికి వస్తున్న సమయంలో రోడ్డు పక్కన ఓ చిన్నారి కనిపించింది. చిన్నవయసులో కూలి పనులు చేస్తూ యజమాని చేత తిట్లు తింటోంది. వెంటనే స్పందించిన జుబీన్ ఆ పాపను అక్కున చేర్చుకున్నారు. తన బిడ్డగా దత్తత చేసుకున్నారు. అనంతరం ఆ పాపకు చదువు, పోషణ బాధ్యతంతా తానే తీసుకున్నారు. ఈ విషయంలో గరిమ ఆయనకు చేదోడుగా నిలిచారు. అలా తమ వద్దకు వచ్చి చేరిన 15 మంది పిల్లల్ని సొంత తల్లిలా పెంచుతున్నారు. ఇది మాత్రమే కాదు, అస్సామ్ వరదలు వచ్చినప్పుడు బాధితులకు సాయం అందించారు. కోవిడ్ సమయంలో జనాలు ఇబ్బంది పడుతున్నప్పుడు ధైర్యంగా ముందుకొచ్చి, తమ ఇంటినే చికిత్సాలయంగా మార్చారు. ఎంతోమందికి వ్యక్తిగతంగా సాయం అందించారు. తన కళతోనే కాక, తన మంచి గుణాలతో ప్రజల గుండెల్లో నిలిచిన జుబీన్ లేరన్న విషాద వార్త అందర్నీ కలచివేసింది. మళ్లీ అలాంటి వ్యక్తి పుట్టబోరంటూ ఆయన అభిమానులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
జుబీన్ కడసారి చూపునకు లక్షలాదిగా జనం
గౌహతి: ప్రముఖ అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ కడసారి చూపు కోసం ఆదివారం అసోంలోని గౌహతికి లక్ష మందికి పైగా అభిమానులు తరలివచ్చారు. గౌహతిలోని అర్జున్ భోగేశ్వర్ బారువా స్పోర్ట్స్ కాంప్లెక్స్ కిక్కిరిసిపోయింది. ఉదయానికే అక్కడికి చేరుకున్న జనం ఎండ తీవ్రతను, ఆ తర్వాత వచ్చిన భారీ వర్షాన్ని సైతం జనం లెక్క చేయకుండా క్యూలో నిల్చున్నారు. అభిమానులు జుబీన్ చిత్రాలున్న కటౌట్లను చేబూని, ఆయనకిష్టమైన పాటలు పాడారు. జుబీన్ గార్గ్ శుక్రవారం సింగపూర్‌లోని సముద్రంలో ఈదుతూ చనిపోవడం తెల్సిందే. సింగపూర్ నుంచి జుబీన్ మృతదేహాన్ని విమానంలో శనివారం అర్ధరాత్రి ఢిల్లీకి తీసుకువచ్చారు. మరో విమానంలో ఆదివారం ఉదయం 7 గంటల సమయానికి గౌహతికి మృతదేహం చేరుకుంది. గౌహతి విమానాశ్రయం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరంలోని కహిలీపారలో ఉన్న జుబీన్ నివాసం వరకు దారి పొడవునా వేలాది మంది ఆఖరిసారిగా చూసుకునేందుకు రహదారిపైకి చేరారు. దీంతో ఆరు గంటల సమయం పట్టింది. మృతదేహం స్టేడియంకు చేరుకునేటప్పటికి మధ్యాహ్నం 3 గంటలయింది. అప్పటికే అభిమానులతో స్టేడియం కిక్కిరిసిపోయింది. వేదికపై గాజు శవ పేటికలో ఉంచిన జుబీన్ మృతదేహాన్ని కడసారి చూసుకునేందుకు జనం క్యూ కట్టారు. రాత్రయినా అభిమానుల తాకిడి కొనసాగుతోంది. దీంతో, అభిమానుల సందర్శనార్ధం మృతదేహాన్ని రాత్రంతా అక్కడే ఉంచుతామని, ఉదయం కూడా అక్కడే ఉంటుందని సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. తన భర్త కోసం తరలివచి్చన అసంఖ్యాక అభిమానులకు జుబీన్ భార్య, ప్రముఖ డిజైనర్ గరిమ కృతజ్ఞతలు తెలిపారు. -
సింగర్ జుబీన్ గార్గ్ కన్నుమూత
గౌహతి: ప్రఖ్యాత అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్(52) కన్నుమూశారు. సింగపూర్‌లో శుక్రవారం స్కూబా డైవింగ్ చేస్తుండగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి గురయ్యారు. ఆయన ప్రాణాలు కాపాడేందుకు సహచరులు సీపీయూ చేశారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ జుబీన్ తుదిశ్వాస విడిచినట్లు నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ నిర్వాహకుడు శ్యామ్కానూ మహంత వెల్లడించారు. ‘యా అలీ’గా ప్రసిద్ధుడైన జుబీన్ గార్గ్ ఈ వేడుకలో పాల్గొనడం కోసమే బుధవారం ఇండియా నుంచి సింగపూర్ చేరుకున్నారు. స్థానికంగా స్థిరపడిన అస్సాం ప్రజలతో కలిసి స్కూబా డైవింగ్ కోసం పడవలో బయలుదేరారు. సముద్రంలో స్కూబా డైవింగ్ చేస్తుండగా శ్వాస సంబంధిత సమస్య తలెత్తింది. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. శుక్రవారం ప్రారంభమైన నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ మూడు రోజులపాటు జరగాల్సి ఉండగా, జుబీన్ గార్గ్ మృతి నేపథ్యంలో ఈ వేడుకలు రద్దు చేసినట్లు నిర్వాహకులు చెప్పారు. జుబీన్ గార్గ్‌కు భార్య ఉన్నారు. ఆయన 1972 నవంబర్ 18న అస్సాంలో జన్మించారు. మూడేళ్ల వయసు నుంచే పాటలు పాడటం ప్రారంభించడం గమనార్హం. అస్సామీ భాషలో తన పాటలతో అలరించారు. అనామిక, మోనోర్ నిజానోత్, మాయ, ఆశా, ముజాలిర్ ఎజోనీ సువాలీ తదితర అల్బమ్లు విడుదల చేశారు. 40కిపైగా భాషల్లో పాటలు పాడారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. గాయకుడు, రచయిత, సంగీత దర్శకుడు, సినీ దర్శకుడు, నటుడిగా ప్రేక్షకులను అలరించారు. గదర్, దిల్ సే, డోలీ సజా కే రఖ్నా, ఫిజా, కాంటే, జిందగీ తదితర హిందీ చిత్రాల్లో ఆయన తన గళం వినిపించారు. అస్సాం సంస్కృతికి ప్రతీకగా నిలిచారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. పలు సామాజిక ఉద్యమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో భాగస్వామి అయ్యారు. కళాగురు ఆర్టిస్ట్ ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించారు. ప్రకృతి విపత్తుల సమయంలో బాధితులను ఆదుకున్నారు. గాయకుడు జుబీన్ గార్గ్ మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సంగీత రంగంలో ఆయన అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని శ్లాఘించారు. జుబీన్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు సానుభూతి ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’లో మోదీ పోస్టు చేశారు. జుబీన్ మృతికి కేంద్ర మంత్రులు అమిత్ షా, కిరణ్ రిజిజు, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తదితరులు సంతాపం ప్రకటించారు. -
బాత్రూంలో జారిపడ్డ ప్రముఖ సింగర్.. తలకు తీవ్ర గాయం
ప్రముఖ గాయకుడు, సంగీత స్వరకర్త జుబీన్ గార్గ్ ప్రమాదానికి గురయ్యారు. గువాహటిలో ఉన్న తన నివాసంలోని బాత్రూంలో కాలుజారి పడ్డారు. ఈ క్రమంలో ఆయన తలకు తీవ్ర గాయమైంది. కుటుంబ సభ్యులు వెంటనే గువాహటిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు సిటీ స్కాన్ చేయగా తలకు బలమైన గాయం తగిలినట్లు గుర్తించారు. ఆయన తలపై ఐదు కుట్లు పడినట్లు తెలుస్తోంది. (చదవండి: కటౌట్లా లేదు.. కట్ డ్రాయర్ యాడ్‌లా ఉంది.. నెటిజన్ ట్రోల్స్) కాగా, జుబీన్ గార్గ్ ఆరోగ్యం గురించి అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఆరా తీశారు. ఆయనకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మెరుగైన చికిత్సకై ఇతర ప్రాంతాలకు తరలించుట కోసం ఎయిర్ అంబెలెన్స్ని కూడా అందుబాటులో ఉంచాలని చెప్పారు. గార్గ్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించాల్సిందిగా ఆరోగ్యశాఖ మంత్రిని సీఎం కోరారు. తనదైన గాత్రంతో వందలాది పాటలు పాడిన జుబీన్ గార్గ్.. అసోంలో చాలా మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ‘గ్యాంగ్‌స్టర్’లోని ప్రసిద్ధ యాలీ పాట జుబిన్‌కు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. పలు అస్సాం, బెంగాలీ సినిమాలతో పాటు బాలీవుడ్ చిత్రాలకు కూడా సంగీత దర్శకుడిగా పనిచేశాడు.