ఒక్కరోజే 499

All Time Record 499 Corona Cases Registered In Telangana - Sakshi

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు

6,526కి చేరిన కేసుల సంఖ్య

ముగ్గురు మృతి.. 198కి చేరిన మరణాలు

రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా రాకాసి

తొలి వెయ్యి కేసులకు 55 రోజుల సమయం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా రక్క సి తీవ్రంగా విజృంభిస్తోంది. శుక్రవారం ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో ఏకంగా 499 మందికి పాజిటివ్‌ వచి్చనట్టు నిర్ధారణ అయింది. దీంతో కరోనా కేసుల సంఖ్య 6,526కి చేరింది. ఇప్పటివరకు 3,352 మంది డిశ్చార్జి కాగా, 2,976 మంది వివిధ ఆస్పత్రులు, హోం క్వారంటైన్లో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం కరోనాతో ముగ్గురు చనిపోవడంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 198కి పెరిగింది. శుక్రవారం నమోదైన కేసుల్లో అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 329 ఉండగా.. రంగారెడ్డి జిల్లాలో 129 మంది ఈ వైరస్‌బారిన పడ్డారు. జనగామ జిల్లాలో 7, మహబూబ్‌నగర్‌లో 6, మేడ్చల్, మంచిర్యాల, వరంగల్‌ అర్బన్, నల్లగొండ, నిజామాబాద్‌ జిల్లాల్లో నాలుగు చొప్పున, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో రెండు చొప్పున, సంగారెడ్డి, జగిత్యాల, కరీంనగర్, యాదాద్రి జిల్లాలో ఒక్కో పాజిటివ్‌ కేసు ఉన్నాయి. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 2,477 మందికి పరీక్షలు నిర్వహించగా.. 20.14 శాతం మంది పాజిటివ్‌ వచి్చంది. కాగా, రాష్ట్రంలోని 34 ఆస్పత్రులను కోవిడ్‌–19 చికిత్సకు ప్రభుత్వం గుర్తించగా.. వీటిలో 17,081 బెడ్స్‌ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం 976 బెడ్స్‌పై మాత్రమే రోగులు ఉన్నట్టు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. 10 ప్రభుత్వ ల్యాబ్‌లు, 18 ప్రైవేటు ల్యాబ్‌లలో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది.

మరణాల్లో అత్యధికం వారే... : కరోనాతో రాష్ట్రంలో ఇప్పటివరకు 198 మంది మరణించగా.. వీరిలో 41–70 ఏళ్ల మధ్యనున్నవారు 144 మంది ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం కేసుల్లో అత్యధికంగా 51–60 ఏళ్ల మధ్య వయసున్న వారు 52 మంది మృతి చెందారు. ఆ తర్వాతి స్థానంలో 61–70 సంవత్సరాల మధ్యనున్నవారు 48 మంది, 41–50 ఏళ్ల మధ్యనున్నవారు 42 మంది, 71–80 సంవత్సరాల మధ్యనున్నవారు 26 మంది, 31–40 ఏళ్ల వారు 16 మంది, 81–90 ఏళ్ల వారు ఆరుగురు, పదేళ్లలోపు పిల్లలు నలుగురు, 21–30 సంవత్సరాలున్నవారు ముగ్గురు, 91 ఏళ్ల పైబడిన వారు ఒకరు మృత్యువాత పడ్డారు.

కొండాపూర్‌ ఏరియా ఆస్పత్రిలో ఒకేరోజు 33 మందికి... 
రాయదుర్గం: హైదరాబాద్‌ కొండాపూర్‌లోని ఏరియా ఆస్పత్రిలో కరోనా కోరలు చాస్తోంది. ఒక్కరోజే 33 మందికి పాజిటివ్‌ వచి్చంది. ఆస్పత్రిలోని 14 మందికి పాజిటివ్‌ రావడంతో అక్కడి వైద్యులు, సిబ్బంది, వారి కుటుంబసభ్యులు మొత్తం 94 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వారిలో 33 మందికి కరోనా పాజిటివ్‌ వచి్చనట్టు తేలింది. మరో 15 మందికి చెందిన రిపోర్టులు రావాల్సి ఉంది. అయితే, 95 మందికి కరోనా పరీక్షలు చేశారని, కానీ అధికారికంగా ఎలాంటి సమాచారం రాలేదని ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు.

3 రోజుల్లోనే వెయ్యి కేసులు
రాష్ట్రంలో కరోనా మహమ్మారి చెలరేగుతోంది. చాలా వేగంగా ఈ వైరస్‌ విస్తరిస్తోంది. తొలి వెయ్యి కేసులు నమోదు కావడానికి 55 రోజులు పట్టగా.. తాజాగా కేవలం మూడు రోజుల వ్యవధిలోనే వెయ్యి కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు మార్చి 2న వెలుగులోకి రాగా, 55 రోజులకు కేసుల సంఖ్య వెయ్యికి చేరింది. ఆ తర్వాత 31 రోజులకు 2 వేలకు చేరగా, మరో ఏడు రోజులకే 3వేల కేసులయ్యాయి. ఇంకో వారం రోజుల్లో 4వేలకు, మరో ఐదు రోజుల్లో 5వేలకు పెరిగాయి. తాజాగా మూడు రోజుల వ్యవధిలోనే మొత్తం కేసుల సంఖ్య 6 వేలకు పెరిగిపోయింది. దీంతో కరోనా వ్యాప్తి ప్రమాదకర స్థాయికి చేరుకుంటోందని అర్థమవుతోంది. శుక్రవారం ఏకంగా రికార్డు స్థాయిలో 499 మందికి పాజిటివ్‌ రావడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

పరీక్షల పెంపుతోనే..: తొలుత రాష్ట్రంలో కరోనా నిర్థారణ పరీక్షలు తక్కువగా జరగడంతో కొన్ని రోజుల క్రితం వరకు నిలకడగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో పెద్దగా ప్రమాదం లేదని అందరూ భావించారు. అయితే, గత మూడు నాలుగు రోజులుగా పరీక్షల సంఖ్యను కొంత వరకు పెంచడంతో పాజిటివ్‌ కేసుల సంఖ్యలోనూ పెరుగుదల కనిపిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు లే»ొరేటరీలన్నీ కలుపుకొని వచ్చే వారం పది రోజుల్లో హైదరాబాద్‌తో పాటు శివారు జిల్లాల్లో 50వేల మందికి పరీక్షలు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ మూడు రోజుల క్రితం ఆదేశించారు. ఈ నేపథ్యంలో పరీక్షల సంఖ్య పెరగడంతో కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. కరోనా వచి్చనా చాలామందిలో లక్షణాలు కనిపించకపోవడంతో రాష్ట్రంలో ఈ మహమ్మారి చాపకింద నీరులా విస్తరించి ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top