మోదీ ట్విట్టర్‌తో అమెరికా కటీఫ్‌ | White House unfollow On PM Narendra Modi Twitter | Sakshi
Sakshi News home page

మోదీ ట్విట్టర్‌తో అమెరికా కటీఫ్‌

Apr 30 2020 2:28 AM | Updated on Apr 30 2020 6:36 AM

White House unfollow On PM Narendra Modi Twitter - Sakshi

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ‘ట్విట్టర్‌’లో భారత ప్రధాని మోదీతో స్నేహానికి ముగింపు పలికారు. ట్రంప్‌ ట్విట్టర్‌ ఖాతాను నిర్వహిస్తున్న అధ్యక్షుడి నివాసమైన వైట్‌హౌస్‌ ట్విట్టర్‌లో మోదీని అన్‌ఫాలో చేసింది. రాష్ట్రపతి కోవింద్‌ను, ప్రధాని కార్యాలయం(పీఎంవో), అమెరికాలోని భారత రాయబార కార్యాలయాన్ని అనుసరించడం మానేసింది. కొన్ని రోజుల క్రితం వరకు మోదీసహా 19 మంది భారతీయులను ట్విట్టర్‌లో ఫాలో అయ్యేది. తాజాగా ఆ సంఖ్య 13కు పడిపోయింది.

ఈ 13 మంది అమెరికా పరిపాలనతో సంబంధం ఉన్న భారతీయులు.  వైట్‌హౌస్‌ ట్విట్టర్‌ ఖాతాను 2.1కోట్ల ఫాలోవర్లు ఉన్నారు. మూడు వారాల క్రితం  మోదీ వైట్‌హౌస్‌ ట్విట్టర్‌ ఖాతాను ఫాలో అవుతున్న తొలి ప్రపంచస్థాయి నాయకుడిగా గుర్తింపు పొందారు. ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి వైట్‌హౌస్‌ మోదీ ట్విట్టర్‌ ఖాతాను అనుసరించడం ప్రారంభించింది. మోదీ ట్విట్టర్‌ ఖాతాను వైట్‌హౌస్‌ అన్‌ఫాలో చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇలా ఎందుకు చేసిందన్న స్పష్టం కాకపోయినప్పటికీ అమెరికా–భారత్‌ మధ్య దెబ్బతిన్న బంధాలకు ఇదొక నిదర్శనమని నిపుణులు భావిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement