ఈసీ సస్పెన్షన్‌ ఆర్డర్‌పై క్యాట్‌ స్టే | Sakshi
Sakshi News home page

ఈసీ సస్పెన్షన్‌ ఆర్డర్‌పై క్యాట్‌ స్టే

Published Fri, Apr 26 2019 3:56 AM

EC bars Karnataka IAS officer from poll duty - Sakshi

బెంగళూరు: ఒడిశాలో ప్రధాని మోదీ హెలికాప్టర్‌ను తనిఖీ చేసినందుకు మహ్మద్‌ మొహ్సిన్‌ అనే ఐఏఎస్‌ అధికారిని సస్పెండ్‌ చేస్తూ ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులపై కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌ (క్యాట్‌) గురువారం స్టే విధించింది. కర్ణాటక కేడర్‌కు చెందిన మొహ్సిన్‌ను ఒడిశాలో ఎన్నికల సాధారణ పరిశీలకుడిగా నియమించగా, ఆయన మోదీ హెలికాప్టర్‌ను సంబాల్‌పూర్‌లో తనిఖీ చేయడం, అది నిబంధనలకు విరుద్ధం అంటూ ఈసీ మొహ్సిన్‌పై సస్పెన్సన్‌ వేటు వేయడం తెలిసిందే. ఎస్పీజీ రక్షణ కలిగిన వారి హెలికాప్టర్లను తనిఖీ చేయకూడదని ఎన్నికల సంఘం పేర్కొనగా, అలాంటిదేమీ లేదని క్యాట్‌ తాజాగా వెల్లడించింది. విచారణను జూన్‌ 6కి వాయిదా వేసింది. కాగా, ఆయనపై విధించిన సస్పెన్షన్‌ను మాత్రం ఈసీ ఎత్తివేసింది.

Advertisement
 
Advertisement