Top Stories
ప్రధాన వార్తలు

వార్ టెన్షన్.. శ్రీనగర్ ఎయిర్‌పోర్టు వద్ద భారీ పేలుళ్లు..
War Live Updates..దాదాపు గంటన్నర పాటు మోదీ-దోవల్ భేటీ..పాకిస్తాన్ దాడులు, భారత్ కౌంటర్‌పై చర్చ.దాదాపు గంటన్నర పాటు మోదీ-దోవల్ భేటీత్రివిధ దళాధిపతులతో రాజ్‌నాథ్ సింగ్ భేటీరాజ్నాథ్ భేటీలో పాల్గొన్న ఎన్ఎస్ఏ ధోవల్.సరిహద్దుల్లో ఉద్రికత్తలపై గంటకుపైగా చర్చ. శ్రీనగర్ ఎయిర్‌పోర్టు వద్ద భారీ పేలుళ్లు..శ్రీనగర్ ఎయిర్‌పోర్టు సమీపంలో భారీ పేలుళ్లుఉదయం 11.45 గంటల సమయంలో పేలుడు శబ్దాలు వినిపించినట్లు అధికారుల వెల్లడికొన్ని ప్రాంతాల్లో మోగిన సైరన్లు.. పేలుడు శబ్దాలతో వణికిపోయిన ప్రజలుశనివారం తెల్లవారుజామున కూడా ఇదే తరహా ఘటన చోటుచేసుకున్నట్లు వెల్లడించిన అధికారులు Srinagar airport early morning pic.twitter.com/rK9diP6Xov— Maroof (@maroof2221) May 10, 2025పాక్‌కు భారీ నష్టం..పాకిస్తాన్‌పై విరుచుకుపడుతున్న భారత వైమానిక దళం.చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పాక్‌పై దాడులురెండు రోజులుగా పాక్‌లోని ప్రధాన నగరాలపై వాయుసేన దాడులుభారత వైమానిక దాడుల్లో లాహోర్, రావల్పిండి, సియాల్కోట్, పెషావర్, ఇస్లామాబాద్‌లో భారీ నష్టం.నూర్ఖాన్, ముర్షీద్, రఫికీ ఎయిర్‌బేస్‌లపై దాడి.నాలుగు పాక్ ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేసిన భారత్.భారత్ దాడులతో పాక్ ప్రజలు నగరాలు వదిలేసి వెళ్లిపోతున్నారు.కరాచీలోనూ భయంతో పాక్ ప్రజలు తరలి వెళ్తున్నారు.ఇస్లామాబాద్‌లో ఇప్పటికే పెట్రోల్ బంక్‌లు బంద్.పాకిస్తాన్లో ఎయిర్‌పోర్టులన్నీ షట్‌డౌన్.సియోల్కోట్లో మరో ఉగ్ర స్థావరాన్ని ధ్వంసం చేసిన భారత్. అజిత్ దోవల్ భేటీ.. కాసేపట్లో ప్రధాని మోదీతో భేటీ కానున్న అజిత్ దోవల్. సరిహద్దుల్లో పరిస్థితిని ప్రధాని మోదీకి వివరించనున్న దోవల్.ఇంతకుముందే త్రివిధ దళాలతో భేటీ అయిన దోవల్. ఢిల్లీ..రక్షణశాఖ కార్యాలయంలో కీలక సమావేశం.ౌసౌత్ బ్లాక్‌లో సమావేశమైన త్రివిధ దళాధిపతులు.మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమైన త్రివిధ దళాధిపతులు.పాకిస్తాన్ దాడులపై తీసుకోవాల్సిన చర్యలపై చర్యలుఉదయం 10:30 గంటకు విదేశాంగ శాఖ మీడియా సమావేశం. ఆపరేషన్ సిందూర్‌పై వివరాలు వెల్లడించనున్న అధికారులు.పంజాబ్ భటిండాలో రెడ్ అలర్ట్‌ప్రజలు ఇళ్లలోనే ఉండాలని హెచ్చరికలు జారీ.జమ్ము కశ్మీర్లో కొనసాగుతున్న పాకిస్తాన్ కాల్పులు.రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్న పాకిస్తాన్ ఆర్మీ.#WATCH | J&K: Parts of a damaged drone found in a field in RS Pura. pic.twitter.com/Y3akkre6pQ— ANI (@ANI) May 10, 2025#WATCH | J&K: A house in the civilian area in Jammu suffered massive damage due to heavy shelling by Pakistan. pic.twitter.com/eqbHYcqB9w— ANI (@ANI) May 10, 2025అమృత్‌సర్‌లో రెడ్ అలర్ట్..భారత్, పాకిస్తాన్ దాడుల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం.భారీగా భద్రతా దళాల మోహరింపు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ.ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచనలు చేసిన అధికారులు.జమ్ము, రాజస్థాన్, పంజాబ్‌లో జనావాసాలపై పాక్ దాడులు.జానీపూర్ నివాస ప్రాంతంలో పాక్ మిస్సైల్ దాడులు. #WATCH | J&K: SDRF, local police, administration, and other agencies are at the spot. They cordoned off the place near Aap Shambhu Temple where a Pakistani strike occurred.As per the SDRF personnel, there has been no casualty. pic.twitter.com/FLLcHEc96X— ANI (@ANI) May 10, 2025పౌరులు, ఆలయాలే టార్గెట్‌గా పాకిస్తాన్ దాడులు.. పాక్ మిలిటరీ పోస్ట్.. టెర్రర్ లాంఛ్‌ప్యాడ్ ధ్వంసంసరిహద్దుల్లో ఉద్రిక్తంగా మారుతున్న పరిస్థితులునియంత్రణ రేఖకు ఆవల పాకిస్తాన్ పోస్టుల నుంచి డ్రోన్లు ప్రయోగిస్తున్న దాయాది.ఆ పోస్టులను ధ్వంసం చేసిన భారత ఆర్మీపంజాబ్‌లోని అమృత్‌సర్‌లో పాకిస్తాన్ క్షిపణి శకలాలు లభ్యంజమ్మూలోని శంభూ ఆలయం సమీపంలోనూ క్షిపణి శకలాలు లభ్యంపౌరులు, ఆలయాలే టార్గెట్‌గా పాకిస్తాన్ దాడులు. #WATCH | A projectile debris in Rajasthan's Barmer as Pakistan started targeting civilian areas. pic.twitter.com/tENtKWlLOa— ANI (@ANI) May 10, 2025 #WATCH | J&K | Splinters and debris of a projectile retrieved from Akhnoor pic.twitter.com/SR3qe3gHbv— ANI (@ANI) May 10, 2025 పాక్‌కు చుక్కలే..పాక్ దాడులను సైన్యం దీటుగా తిప్పికొడుతోంది.పాక్ డ్రోన్లను, మిస్సైల్స్‌ను కూల్చివేసిన భారత్. #WATCH | Parts of a projectile found in a field in Amritsar, Punjab. pic.twitter.com/bPxXOxWT8n— ANI (@ANI) May 10, 2025#WATCH | Amritsar, Punjab | Debris of a drone were recovered from a field in Muglani Kot village pic.twitter.com/zxmklvX2tL— ANI (@ANI) May 10, 2025 #WATCH | Pakistani Posts and Terrorist Launch Pads from where Tube Launched Drones were also being launched, have been destroyed by the Indian Army positioned near Jammu: Defence Sources(Source - Defence Sources) pic.twitter.com/7j9YVgmxWw— ANI (@ANI) May 10, 2025నేడు భారత సైన్యం మీడియా సమావేశం.నేటి ఉదయం 10 గంటలకు భారత సైన్యం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.ఆపరేషన్ సిందూర్ 2.0పై ప్రకటన చేసే అవకాశం ఉంది. భారత్ దాడులు తీవ్రతరం..లాహోర్, ఇస్లామాబాద్ టార్గెట్‌గా భారత్ దాడులు. మూడు పాకిస్తాన్ ఎయిర్‌బేస్‌ల్లో పేలుళ్ల శబ్దాలుశనివారం తెల్లవారుజామున పాక్‌లోని పలు వైమానిక స్థావరాల్లో శక్తిమంతమైన పేలుళ్లు.వీటిల్లో ఇస్లామాబాద్ సమీపంలో ఉన్న కీలక స్థావరంరెండు పాకిస్థాన్ ఫైటర్ జెట్ల కూల్చివేతశ్రీనగర్ బేస్ నుంచి క్షిపణులను ప్రయోగించి కూల్చివేసిన భారత్‌పఠాన్‌కోట్‌లో పేలుళ్ల శబ్దాలుశనివారం తెల్లవారుజామున 5 గంటలకు వినిపించిన శబ్దాలుశ్రీనగర్‌లోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలుఆకాష్ జెట్‌తో పాక్ క్షిపణులను కూల్చివేసిన భారత్. Pakistan tried to hit the capital of India, New Delhi by it's long range missile Fateh-2But intercepted by Barak-8 missile defence system in Sirsa of Haryana#IndianArmy please ekbar attacking mode me aajao 😡🙏#IndiaPakistanWar #IndianNavyAction pic.twitter.com/x3kd7v87W2— Priyanshu Kumar (@priyanshu__63) May 9, 2025📹VIDEO : Pakistani citizen (lahore) sharing reality of Indo-pak war. exposed Pakistan's failure & pak media lies.India is right on Top. 👍👍 pic.twitter.com/Ff44gptNlc— Vaishnavi (@vaishu_z) May 9, 2025 Lahore, Pakistan is now being targeted by India. Pakistan’s 2nd largest city and one that is fully undisputed.This war is escalating very quickly. pic.twitter.com/6lzojd3DcY— Spencer Hakimian (@SpencerHakimian) May 10, 2025పాకిస్తాన్ డ్రోన్ దాడులకు భారత్ ప్రతీకార దాడులు.పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మూసివేత. పాక్ ఎయిర్‌స్పేస్‌లో విమానాల రాకపోకలు నిలిపివేత.పాకిస్తాన్‌లోని మూడు ఎయిర్ బేస్‌లపై భారత్ దాడులు చేసింది. లాహోర్, రావాల్పిండి, పెషావర్లపై దాడి చేసింది. నూర్ఖాన్, మురీద్, రఫికి ఎయిర్ బేస్‌లపై దాడులు చేసిన భారత్. డ్రోన్స్, మిస్సైల్స్‌తో పాకిస్తాన్ ఎయిర్ బేస్‌లపై దాడి చేసిన భారత్.నూర్ఖాన్ ఎయిర్‌బేస్ సమీపంలో రెండు పేలుళ్లు సంభవించాయి. అటు, లాహోర్, రావల్పిండి, ఇస్లామాబాద్‌లో వరుస పేలుళ్లు.భారత్ వ్యూహ్మాతక సైనిక శిబిరాలే లక్ష్యంగా పాకిస్తాన్ దాడులను తెగబడింది.జమ్ము,శ్రీనగర్, అమృత్సర్లను టార్గెట్ చేసిన పాకిస్తాన్.భారత్‌లోని 26 ప్రదేశాలు లక్ష్యంగా పాకిస్తాన్ డ్రోన్ దాడులు.మిస్సైల్స్ ద్వారా పాక్ దాడులను అడ్డుకున్న భారత్.ఫతా వన్ మిస్సైల్‌ను ధ్వంసం చేసిన భారత్ ఎయిర్ డిఫెన్స్ సిస్టం.#WATCH | Jalandhar, Punjab: Parts of a Pakistan drone recovered after a blast in Kanganiwal village in Rural Jalandhar. (Visuals deferred by unspecified time) pic.twitter.com/ZogqS588tR— ANI (@ANI) May 10, 2025 #WATCH | Loud explosions are being heard in Poonch area of Jammu and Kashmir. (Visuals deferred by unspecified time) pic.twitter.com/VkjzgY8jYc— ANI (@ANI) May 10, 2025టార్గెట్ పఠాన్‌కోట్..పఠాన్‌కోట్‌ను టార్గెట్ చేసిన పాకిస్తాన్.రెండు పాక్ యుద్ధ విమానాలను కూల్చివేసిన భారత్.అన్నిచోట్ల పాక్ దాడులను తిప్పి కొట్టిన భారత సైన్యం.భారత్ దెబ్బతో పాకిస్తాన్ ఎయిర్‌బేస్ బంద్.. అన్ని విమానాలను రద్దు చేసిన పాక్.శ్రీనగర్ టార్గెట్‌గా పాకిస్తాన్ ాదాడులు.శ్రీనగర్‌లోని రెండు ప్రాంతాల్లో భారీ పేలుడు. At least 4 airbases in Pakistan have been targeted by Indian strikes: Sources pic.twitter.com/3ZegA6YmzM— ANI (@ANI) May 10, 2025పాక్ డ్రోన్లు దాడులు.. సరిహద్దు ప్రాంతాలపై పాక్ దాడులు వరుసగా కొనసాగుతున్నాయి. చీకట్లు పడుతూనే జమ్ము కశ్మీర్ మొదలుకుని రాజస్తాన్ దాకా 26కు పైగా ప్రాంతాల్లో దాయాది మరోసారి క్షిపణి, డ్రోన్ దాడులకు దిగింది.కశ్మీర్‌లోని ఉరి, సాంబా, నౌగావ్, పూంఛ్, జమ్మూ, ఉధంపూర్, నగ్రోటా, రాజౌరీ, పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, అమృత్సర్, రాజస్తాన్‌లోని జైసల్మేర్, ఫోక్రాన్ తదితర ప్రాంతాలు వీటిలో ఉన్నాయి. అక్కడి పౌర ఆవాసాలతో పాటు సైనిక స్థావరాలను పాక్ డ్రోన్లు లక్ష్యంగా చేసుకున్నాయి.దాడులను సైన్యం దీటుగా తిప్పికొడుతోంది. వాటిని ఎక్కడివక్కడ కూల్చేస్తోంది. ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాలన్నింటా అప్రమత్తత పాటిస్తున్నారు. ముందు జాగ్రత్తగా బ్లాకౌట్ కొనసాగుతుండటంతో ఆయా రాష్ట్రాల్లో శ్రీనగర్ మొదలుకుని జోద్పూర్ దాకా పలు పట్టణాల్లో చీకట్లు కమ్ముకున్నాయి.మరోవైపు సరిహద్దుల పొడవునా పాక్ భారీగా కాల్పులకు తెగబడుతోంది. జమ్మూలోని రాంగఢ్, సుచేత్‌గఢ్ మొదలుకుని రాజస్తాన్‌లోని గంగానగర్ దాకా పలు ప్రాంతాలు కాల్పుల మోతతో దద్దరిల్లిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పలు సరిహద్దు జిల్లాలకు రెడ్ అలర్టులు జారీ చేశారు.పేలుళ్లు, సైరన్లు శుక్రవారం అర్ధరాత్రి దాకా సరిహద్దుల పొడవునా పదులకొద్దీ పాక్ డ్రోన్లను సైన్యం కూల్చేసింది. మంటల్లో కాలుతూ కూలిపోతున్న డ్రోన్లతో ఆకాశం ప్రకాశమానంగా మారింది. అంతకుముందు శ్రీనగర్ విమానాశ్రయం, దక్షిణ కశ్మీర్‌లోని అవంతిపురా వైమానిక బేస్‌పై డ్రోన్ దాడులకు పాక్ చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టింది. అంతకుముందు జమ్మూతో పాటు పలు ఇతర ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు విని్పంచాయి. సైరన్లు మోగాయి.పాక్ కాల్పులకు ఒక మహిళ బలవగా 18 మందికి పైగా గాయపడ్డారు. లైట్లు ఆర్పేయాల్సిందిగా స్థానిక మసీదుల్లోని లౌడ్‌స్పీకర్ల ద్వారా ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేశారు. తన చుట్టుపక్కల ప్రాంతాలన్నీ బాంబులు, కాల్పుల మోతతో దద్దరిల్లిపోతున్నాయంటూ జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.బారాముల్లా, కుప్వారా, బందీపురా వంటి సరిహద్దు జిల్లాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలు, బంకర్లకు తరలిస్తున్నారు. దాడులు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సరిహద్దుల వెంబడి మరిన్ని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను సైన్యం యుద్ధ ప్రాతిపదికన మోహరిస్తోంది. ఓవైపు దాడులకు తెగబడుతూనే, మరోవైపు భారత్‌తో ఉద్రిక్తతలను తగ్గించాలంటూ ఇరాన్, సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాలను పాక్ ప్రాధేయపడుతోంది. పాక్‌తో యుద్ధ పరిస్థితి నెలకొని ఉందని అమెరికాలో భారత రాయబారి వినయ్ క్వాట్రా అభిప్రాయపడ్డారు.

పాకిస్తాన్‌తో యుద్ధం.. ఆర్మీ అధికారుల మీడియా సమావేశం లైవ్
సాక్షి, ఢిల్లీ: పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలకు దిగింది. భారత్‌లోని 26 ప్రదేశాల్లో పాక్ దాడులకు తెగబడిందని ఆర్మీ అధికారులు తెలిపారు. పాక్ దాడులను భారత్ సమర్ధవంతంగా తిప్పికొట్టిందని స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్‌పై విదేశాంగ శాఖ, రక్షణ శాఖ సంయుక్త సమావేశంగా మీడియా సమావేశం నిర్వహించింది. ఆపరేషన్ సిందూర్‌పై అధికారులు వివరాలను వెల్లడించారు. ఉద్రిక్తతలపై తాజా పరిస్థితులను కర్నల్ సోఫియా ఖురేషి వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాక్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. దాడులతో ఉద్రిక్తతలు పెంచుతోంది. వాటిని భారత సైన్యం సమర్థంగా తిప్పికొడుతోంది. శ్రీనగర్, ఉధంపూర్, బటిండాలో దాడులు జరుపుతోంది. పలు చోట్ల పాఠశాలలు, వాయుసేన ఆసుపత్రులపై కూడా దాడులు చేస్తోంది. భుజ్, బటిండాలోని ఎయిర్‌స్టేషన్లలపై పాక్ దాడి చేసింది. లాంగ్ రేంజ్ క్షిపణులు, యుద్ధ విమానాలు, డ్రోన్లతో పాకిస్తాన్ దాడులు చేస్తోంది. పాక్ దాడులను భారత్ ధీటుగా తిప్పి కొడుతోంది. పాకిస్తాన్ పశ్చిమ ప్రాంతంలో క్షిపణులతో దాడికి దిగింది. యుద్ధ విమానాలు, డ్రోన్లతో దాడులు చేస్తోంది.పాకిస్తాన్ మిస్సైల్స్‌ను భారత వాయుసేన తిప్పి కొట్టింది. పాక్ ఎయిర్‌బేస్‌లను గట్టిగా దెబ్బతీశాం. సోషల్ మీడియాలో పాక్ తప్పుడు ప్రచారం చేస్తోంది. పాక్ దాడులను పూర్తి స్థాయిలో తిప్పికొట్టాం. పాక్ దాడులు చేసిన ప్రతీచోటా భారత్ గట్టిగా ప్రతిఘటించింది. పాకిస్తాన్ హైస్పీడ్ మిస్సైల్ మోర్టార్లను ప్రయోగించిందన్నారు. వింగ్ కమాండర్ ఒమికా సింగ్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలను కొనసాగిస్తోంది. డ్రోన్స్, లాంగ్ రేంజ్ మిస్సైల్స్ ఉపయోగిస్తుంది. పటాన్ కోట్ , ఉడంపూర్, బూజ్ ప్రాంతాలపై దాడికి దిగింది. పాకిస్తాన్ దాడులను తిప్పి కొట్టాం. భారత్ కేవలం పాకిస్తాన్ మిలిటరీ కేంద్రాలను టార్గెట్ చేసి దాడులు చేసింది. పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తోంది. భారత్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లకు ఎలాంటి హాని జరగలేదు అని అన్నారు. #WATCH | Delhi | #OperationSindoor | Wing Commander Vyomika Singh says, "In a swift and calibrated response, Indian armed forces carried out a precision strike only at identified military targets... Pakistan has also attempted to execute a continued malicious misinformation… pic.twitter.com/8rnxPfK1IR— ANI (@ANI) May 10, 2025విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రి మాట్లాడుతూ.. భారత్ ఎస్ 400 ధ్వంసం చేశారన్న వార్తలు అవాస్తవం. సిరాసా, సూరత్ ఘడ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్‌కు ఎలాంటి నష్టం జరగలేదు. పాకిస్తాన్ సామాన్య ప్రజలపై దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఒక అధికారి చనిపోయారు’ అని తెలిపారు. #WATCH | #OperationSindoor | Foreign Secretary Vikram Misri says, "We have also seen in some of the remarks that the Pakistani army spokesman seems to take great joy at the fact that the Indian public should criticise the government of India with various issues. It may be a… pic.twitter.com/EiEUNejOut— ANI (@ANI) May 10, 2025

విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం!.. బీసీసీఐకి చెప్పేశాడు!
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) కూడా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) బాటలోనే నడవనున్నట్లు తెలుస్తోంది. టెస్టు క్రికెట్ నుంచి వైదొలిగేందుకు ఈ ‘రన్‌మెషీన్’ సిద్ధమైనట్లు సమాచారం. ఈ విషయం గురించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి కోహ్లి ఇప్పటికే సమాచారం అందించినట్లు తెలుస్తోంది.ఇప్పుడే వద్దుఅయితే, సెలక్టర్లు మాత్రం కోహ్లిని మరికొన్నాళ్లు కొనసాగాల్సిందిగా కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. ‘‘టెస్టు క్రికెట్ రిటైర్మెంట్ గురించి కోహ్లి ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేశాడు. తాను టెస్టుల నుంచి వైదొలుగుతానని బోర్డుకు చెప్పాడు.అయితే, ఇంగ్లండ్‌తో కీలక సిరీస్ ముందున్న నేపథ్యంలో కోహ్లి తన నిర్ణయంపై పునరాలోచన చేయాలని బీసీసీఐ అతడిని కోరింది. ఇంతవరకు అతడు మాత్రం ఈ విజ్ఞప్తిపై తన స్పందన తెలియజేయలేదు’’ అని బీసీసీఐ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.రోహిత్ గుడ్బైకాగా టెస్టుల్లో గత కొంతకాలంగా రోహిత్ శర్మ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అతడి సారథ్యంలో సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో 3-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైన భారత జట్టు.. ఆస్ట్రేలియా పర్యటనలోనూ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 1-3తో కోల్పోయింది. ఈ రెండు సిరీస్‌లలో ఆటగాడిగానూ విఫలమైన రోహిత్.. ఇటీవలే టెస్టులకు గుడ్‌బై చెప్పాడు.కోహ్లికి ఘనమైన రికార్డులుఇక ఈ రెండు సిరీస్‌లలో కోహ్లి కూడా స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. ఆసీస్‌తో పెర్త్‌లో శతకం బాదడం మినహా పెద్దగా అతడి బ్యాట్ నుంచి మెరపులేవీ లేవు. ఈ నేపథ్యంలో కోహ్లి కూడా టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే, కోహ్లి టెస్టు కెరీర్ ఎంతో ఘనమైనది. ముఖ్యంగా ఒంటిచేత్తో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి విదేశీ గడ్డలపై భారత్‌ను గెలిపించిన రికార్డు అతడి సొంతం.కాబట్టి రోహిత్ విషయంలో రిటైర్మెంట్కు సులువుగానే ఓకే చెప్పిన సెలక్టర్లు.. కోహ్లిని మాత్రం కొనసాగాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సీజన్లో మొదటిదైన ఇంగ్లండ్ సిరీస్‌లో అతడిని తప్పక ఆడించాలని బోర్డు నిర్ణయించుకున్నట్లు సమాచారం.కాగా 2011లో టీమిండియా తరఫున టెస్టుల్లో అడుగుపెట్టిన కోహ్లి ఇప్పటికి 123 మ్యాచ్‌లు ఆడాడు. సగటున 46.85తో 9230 పరుగులు సాధించాడు. అతడి ఖాతాలో 30 టెస్టు శతకాలు, 31 హాఫ్ సెంచరీలు, ఏడు డబుల్ సెంచరీలు ఉన్నాయి.వన్డేలలో ఇద్దరూ కొనసాగుతారు!మరోవైపు.. రోహిత్ విషయానికొస్తే.. భారత్ తరఫున 67 టెస్టుల్లో 12 శతకాలు, ఒక ద్విశతకం సాయంతో 4301 పరుగులు చేశాడు. ఇక టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియాను విజేతగా నిలిపిన తర్వాత రోహిత్ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లి కూడా రోహిత్‌తో పాటే తానూ వైదొలుగుతున్నట్లు వెల్లడించాడు.ఇప్పుడు రోహిత్ టెస్టులకు గుడ్‌బై చెప్పగా.. కోహ్లి కూడా అతడిని అనుసరించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కాగా ఈ ఇద్దరు ఇటీవల టీమిండియా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలవడంలో కీలక పాత్ర పోషించారు. కాబట్టి వన్డే వరల్డ్‌కప్-2027 వరకు యాభై ఓవర్ల ఫార్మాట్లో మాత్రం కొనసాగనున్నట్లు తెలుస్తోంది.చదవండి: IPL 2025: మిగిలిన మ్యాచ్‌లు మేము నిర్వహిస్తాం: బీసీసీఐకి ఆఫర్!

ఆంధ్రప్రదేశ్‌లో తిరోగమన ప్రభుత్వం!
‘‘ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రజల కంచాల్లోని కూడు లాగేశారు.. ప్రతి ఇంటికీ బాబు మోసం" ఇది వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విమర్శ. ఈ వార్త ప్రజలకు అందిన రోజే మరో సమాచారం వచ్చింది. జీఎస్టీ ఆదాయం వసూళ్లు దేశమంతటా పైపైకి వెళుతుంటే, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం నేల చూపులు చూస్తున్నట్లు ఆ కథనం చెప్పింది. జగన్ వ్యాఖ్యలకు, జీఎస్టీకి ఏమి సంబంధం? అంటే.. జగన్ ప్రభుత్వం ప్రజలకు వివిధ స్కీముల కింద ఆర్థిక సాయం చేసేది. లబ్దిదారుడికి నేరుగా నగదు అందేలా ఆ పథకాలుండేవి.ఆ డబ్బుతో ప్రజలు ముఖ్యంగా పేదలు, దిగువ మధ్య తరగతి వారు వస్తు, సేవల కొనుగోళ్లు చేసేవారు. ఫలితంగా వ్యాపార కార్యకలాపాలు సాగి ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో ఆదాయం సమకూరేది. అందువల్లే ఆ రోజుల్లో ఒకవైపు పేదరికం తగ్గినట్లు గణాంకాలు తెలిపాయి. ఇప్పుడు పరిస్థితి మారింది. వ్యాపారాలు సరిగా సాగడం లేదని వ్యాపారస్తులు వాపోతున్నారు. ఇల్లు గడవడమే కష్టమవుతోందని పేదలు గగ్గోలు పెడుతున్నారు. ఫలితంగా దేశం అంతటా 12 శాతం వరకు జీఎస్టీ వృద్దిరేటు ఉంటే, ఏపీలో మాత్రం ఏప్రిల్ లో మైనస్ 3.4 శాతంగా మాత్రమే ఉంది. అందువల్లే జగన్ ఈ వ్యాఖ్య చేశారు.పేదల తింటున్న కడును కూటమి పెద్దలు లాగేశారని ఆయన అన్నారు. నిజానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులు ఎన్నికల ప్రచారంలో ఆకాశమే హద్దుగా వాగ్దానాలు చేశారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నిటిని కొనసాగించడమే కాకుండా, సూపర్ సిక్స్ హామీలను కూడా ప్రజలకు అందిస్తామని పదే, పదే ప్రకటించారు. ఈ సూపర్ సిక్స్‌ను తొలుత మహానాడులో ప్రకటించినప్పుడు తమ్ముళ్లూ అదిరిందా? అంటూ చంద్రబాబు ప్రశ్నించే వారు. అందుకు వారంతా ఔను, ఔనని చప్పట్లు కొట్టారు. జనం కూడా ఆశపడ్డారు. తీరా అధికారం వచ్చాక టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు నాలుక మడత వేయడం ఆరంభించారు. అదిరిపోవడం జనం వంతైంది.ఇదేమి ఖర్మ.. పాలిచ్చే గేదెను వదలుకుని తన్నే దున్నపోతు ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామా అని ప్రజలు వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ తాను పలావు పెడుతుంటే, చంద్రబాబు బిర్యానీ పెడతానని ప్రచారం చేశారని, అది నమ్మి జనం ఓట్లు వేశాక, పలావు, బిర్యానీ రెండూ లేకుండా పోయాయని పలుమార్లు వ్యాఖ్యానించారు. చంద్రబాబు సీఎం కాకముందు ప్రతి ఇంటిలో నాలుగువేళ్లు ఆనందంగా నోట్లోకి వెళ్లేవని, కూటమి వచ్చి కంచం లాగేసిందని కొద్ది రోజుల క్రితం పార్టీ సమావవేశంలో ధ్వజమెత్తారు. ఇందులో చాలా వరకు వాస్తవం ఉంది.జగన్ అమ్మ ఒడి స్కీమ్ కింద రూ.15 వేలు ఇస్తే వారికి ఆర్ధిక వెసులుబాటు వచ్చేది. చేయూత, ఆసరా, విద్యా దీవెన, రైతు భరోసా, వాహన మిత్ర తదితర స్కీముల కింద వచ్చే డబ్బు వేడినీళ్లకు చన్నీళ్ల మాదిరి ఉపయోగపడేవి. ఇప్పుడు అవేవీ రాలేదు. చంద్రబాబు తాను ప్రతి బిడ్డకు రూ.15 వేలు చొప్పున ఎందరు పిల్లలు ఉంటే అందరికి తల్లికి వందనం పేరుతో ఇస్తానని నమ్మబలికారు. రైతులకు రూ.20 వేలు, నిరుద్యోగులకు నెలకు రూ.మూడు వేలు లారీ డ్రైవర్లకు రూ.15 వేలు.. ఇలా ఎడాపెడా వాగ్దానాలు చేశారు. కాని అధికారంలోకి వచ్చాక ఒక ఏడాది పూర్తిగా ఎగవేశారు. దాంతో జనం కూడా జగన్ చెప్పినట్లు చంద్రబాబు తమ నోటికాడ కూటిని తమ నోటికాడ కూటిని లాగేశారని అనుకుంటున్నారు.జగన్ కాని, వైసీపీ నేతలు కాని చేస్తున్న ఈ విమర్శలను కూటమి పెద్దలు ఎవరూ ఖండించలేకపోతున్నారు. కాకపోతే జగన్ పాలనలో రాష్ట్రం ఆర్థిక విధ్వంసం జరిగిందని ఏవో పడికట్టు పదాలతో పిచ్చి ఆరోపణలు చేసి ప్రజలను డైవర్ట్ చేయడానికి యత్నిస్తుంటారు. ఈ విషయంలో కూడా వారిలో ఒక స్పష్టత, కనిపించదు. జగన్ ప్రభుత్వం రూ. ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిందని ఒకసారి, రూ.పది లక్షల కోట్లు అని మరోసారి, రూ.13 లక్షల కోట్లు అని వేరొకసారి, అది రూ.14 లక్షల కోట్లు అని ఇంకోసారి చంద్రబాబు, పవన్ లు చెప్పిన వీడియోలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి.కూటమి ప్రభుత్వం వచ్చాక పెట్టిన బడ్జెట్లో మాత్రం అప్పు అంతా కలిపి రూ.ఆరు లక్షల కోట్టేనని తేలింది. అందులో సగం 2014 టర్మ్‌లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పు కూడా ఉంది. 2024లో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు అప్పులు చేయరు కాబోలు.. కొత్తగా సంపద సృష్టిస్తారేమోలే అనుకున్న వారందరికి మతిపోయేలా చేశారు. ఏకంగా రికార్డు స్థాయిలో అన్నీ కలిపి రూ.లక్షన్నర కోట్ల అప్పు చేశారు. స్కీములు అమలు చేయకుండా, పెద్దగా అభివృద్ది పనులు చేపట్టకుండా ఈ అప్పు ఏమి చేశారన్నది మిస్టరీ. దానిపై ప్రభుత్వం ఇంతవరకు వివరణ పత్రం ఇవ్వలేదు. దాంతో చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మోసం చేసిన సర్కార్‌గా గుర్తింపు పొందుతోంది.ఇంత అప్పు చేసి కూడా చంద్రబాబు తరచు తమకు అప్పులు పుట్టడం లేదని, సంపద సృష్టించడం ఎలాగో చెవిలో చెప్పండని కామెంట్లు చేస్తుంటే ప్రజలు నిశ్చేష్టులవుతున్నారు. తన పార్టీ సమావేశంలో జగన్ మాట్లాడుతూ ఎపిలో ప్రతి ఇంటిని బాబు మోసం చేశారని అన్నారు.అది కూడా నిజమే అనుకోవాలి. జగన్ టైమ్ లో ఏదో రకంగా 87 శాతం కుటుంబాలకు ఆర్థిక సాయం అందేది. ప్రస్తుతం పెరిగిన పెన్షన్ వెయ్యి రూపాయలు తప్ప మరేమీ అందడం లేదు. ప్రజలకు సూపర్ సిక్స్ అందకపోగా, రాక్షస రాజ్యం నడుపుతున్నారని, ప్రశ్నించేవారిపై కేసులు పెడుతున్నారని, తమకు బలం లేకపోయినా మున్సిపాల్టీ, మండల పరిషత్‌లను దౌర్జన్యంగా కైవసం చేసుకుంటున్నారని జగన్ అన్నారు. ఇందులో కూడా వాస్తవం ఉంది.సీఎం తన సొంత నియోజకవర్గం కుప్పం మున్సిపాల్టీలో టీడీపీకి బలం లేకపోయినా, భయపెట్టో, ప్రలోభపెట్టో తమ ఖాతాలో వేసుకున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి వెనుపోటే. కొన్నిచోట్ల మాత్రం వైసీపీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎంపీటీసీలు ధైర్యంగా అధికార కూటమి అరాచకాలను అడ్డుకున్నారు. అలాంటి వారితో జగన్ ప్రత్యేకంగా సమావేశమై వారిని అభినందించారు. జీఎస్టీ వసూళ్ల గురించి వచ్చిన డేటా విశ్లేషిస్తే, కూటమి సర్కార్ వచ్చిన ఈ పదినెలల్లో రెండు నెలలు తప్ప, మిగిలిన అన్ని నెలలు మైనస్ గ్రోత్ రేట్ నమోదైనట్లు స్పష్టమవుతోంది. ఇది ఏపీకి మంచి పరిణామం కాదు.గత ఏప్రిల్‌లో తమిళనాడులో 13 శాతం, తెలంగాణలో 12 శాతం, కర్ణాటకలో 11 శాతం, కేరళలో ఐదు శాతం, చివరికి ఒడిశాలో కూడా ఐదు శాతం వృద్ది రేటు చూపితే ఆంధ్ర ప్రదేశ్ మాత్రం మైనస్ 3.4 శాతంగానే ఉంది. అయినా దీన్ని కనిపించకుండా చేసేందుకు ఎల్లో మీడియా పాట్లు పడింది. కొద్ది రోజుల క్రితం జీఎస్డీపీలో నెంబర్ 2 వచ్చేశామంట ఒక అంకెను ప్రచారం చేశారు. ఆ తర్వాత కేంద్రం విడుదల చేసిన ఈ జీఎస్టీ లెక్కలతో ఏపీ ప్రభుత్వం చెప్పేవి బూటకపు లెక్కలని తేటతెల్లమవుతోంది! - కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

భారత్-పాక్ యుద్ధం.. మరోసారి స్పందించిన చైనా
భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి చైనా స్పందించింది. ఇరు దేశాలు సంయమనం పాటించాలని గట్టిగా కోరింది. పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నామని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించింది. ఈ సమస్యను ముగింపు పలికేందుకు అవసరమైతే నిర్మాణాత్మక పాత్ర పోషించేందుకు సిద్ధమేనని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఉద్రిక్తత పెరగడం పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.భారత్-పాకిస్థాన్‌ల మధ్య జరుగుతున్న సైనిక దళాల ఘర్షణపై చైనా.. నిన్న కూడా(శుక్రవారం) స్పందించిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది. చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి లిన్ జియాన్ మాట్లాడుతూ.. భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా కానీ చైనా వ్యతిరేకిస్తుందంటూ ఆయన స్పష్టం చేశారు.కాగా, భారత్–పాక్ సైనిక ఘర్షణలో జోక్యం చేసుకోవటం మా పని కాదు’ అని అగ్రరాజ్య ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ విస్పష్టమైన ప్రకటన చేశారు. అలాగే.. భారత్-పాకిస్తాన్ మధ్య ఘర్షణలు పూర్తిగా ఆగిపోవాలని కోరుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించిన సంగతి తెలిసిందే. ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరారు. కుక్కకాటుకు చెప్పుదెబ్బ అన్నట్టుగా భారత్–పాక్ మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయని వెల్లడించారు. మొదట ఉగ్రవాదులు దాడి చేశారు కాబట్టి తర్వాత భారత సైన్యం ప్రతిదాడి చేసిందని పరోక్షంగా అంగీకరించారు

డ్రగ్స్‌కు బానిసైన డాక్టర్ నమ్రత.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు
సాక్షి, శేరిలింగంపల్లి: ప్రజలకు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు చెప్పాల్సిన వైద్యురాలు తప్పుడు మార్గంలో వెళ్లింది. డ్రగ్స్‌కు బానిసగా మారిన సదరు వైద్యురాలు.. నిషేధిత కొకైన్ డ్రగ్స్ సేవిస్తూ పోలీసులకు చిక్కింది. దీంతో, ఆమెను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 53 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగరంలోని షేక్ పేటలో ఏపీఏహెచ్‌సీ కాలనీకి చెందిన డాక్టర్ చిగురుపాటి నమ్రత (34) సిటీలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్నారు. అయితే, కొన్నేళ్లుగా ఆమె డ్రగ్స్ తీసుకుంటూ.. మత్తు పదార్థాలకు బానిసగా మారిపోయారు. ఈ క్రమంలో ముంబైలో నివాసం ఉండే వాన్స్ టక్కర్‌ను వాట్సాప్ ద్వారా సంప్రదించి, రూ.5 లక్షల కొకైన్ డ్రగ్స్ ఆర్డర్ చేసింది. డబ్బును మొత్తం ఆన్ లైన్ ద్వారా పంపించింది.అనంతరం, టక్కర్ తన వద్ద డెలివరీ బాయ్‌గా పనిచేసే బాలకృష్ణ రాంప్యార్ రామ్(38)కు డ్రగ్స్ ఇచ్చి నగరానికి పంపించాడు. రాయదుర్గంలో నమ్రతను కలిసిన రాంప్యార్ రామ్ డ్రగ్స్ ను అందజేస్తుండగా, పక్కా సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. డ్రగ్స్ ఇస్తున్న సమయంలో వారిద్దరిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నిందితుల నుంచి 53 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన మహిళా డాక్టర్, ఒమేగా హాస్పిటల్ సీఈవో చిగురుపాటి నమ్రత ముంబైకి చెందిన వంశ్ టక్కర్ అనే స్మగ్లర్ నుంచి కొకైన్ కొనుగోలు చేస్తూ.. తన నివాసం షేక్‌పేట్‌లోని అపర్ణ వన్ అపార్ట్మెంట్లో దొరికిన చిగురుపాటి నమ్రతవంశ్ టక్కర్‌కు… pic.twitter.com/A03UqI0JvZ— Telugu Scribe (@TeluguScribe) May 10, 2025Credit: Telugu Scribe

ఏటీఎంల మూసివేత వదంతులు.. బ్యాంకుల స్పష్టత
భారత్–పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కారణంగా ఏటీఎంలను మూసివేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ప్రభుత్వ రంగ బ్యాంకులు ఖండించాయి. ఏటీఎంలన్నీ పూర్తి స్థాయిలో సజావుగానే పని చేస్తున్నాయని, వాటిలో తగినన్ని నగదు నిల్వలు ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశాయి. డిజిటల్ సేవలు కూడా సజావుగా సాగుతున్నాయని పేర్కొన్నాయి.‘మా ఏటీఎంలు, క్యాష్ డిపాజిట్ మెషీన్లు, డిజిటల్ సేవలు అన్నీ పూర్తి స్థాయిలో పని చేస్తున్నాయి. ప్రజలకు అందుబాటులోనే ఉన్నాయి‘ అని ఎస్బీఐ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ధ్రువీకరించుకోకుండా ఏ వార్తలను విశ్వసించొద్దంటూ కస్టమర్లకు సూచించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మొదలైనవి కూడా ఇదే తరహా మెసేజీలను పోస్ట్ చేశాయి.కాగా ఏటీఎంల మూసివేత అంటూ వచ్చిన వార్తా కథనాలను ప్రభుత్వ వార్తా సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం తనిఖీ చేసి అవి పూర్తిగా ఫేక్ అని తేల్చేసింది. భారత్-పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో ఇండియాలోని ఏటీఎంలపై రాన్సమ్వేర్ దాడి కారణంగా మూడు రోజులపాటు సర్వీసులు పని చేయవన్నట్లు సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు వచ్చాయి.

భారత సైన్యంపై విమర్శలు.. మహిళా ప్రొఫెసర్ సస్పెండ్
చెన్నై: భారత్, పాకిస్తాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. మరోవైపు.. ఆపరేషన్ సిందూర్ నిర్వహిస్తున్న భారత సైన్యాన్ని విమర్శిస్తూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో సదరు వ్యక్తులను అధికారులు సస్పెండ్ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే తమిళనాడులో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. చెంగల్పట్టు జిల్లా కాట్టాన్‌కొళత్తూర్ సమీపంలోని ఓ ప్రముఖ ప్రైవేటు విశ్వవిద్యాలయంలో లోరా అనే మహిళ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. తాజాగా ఆమె.. సోషల్ మీడియా వేదికగా.. పోస్టులు పెట్టారు. ఆపరేషన్ సిందూర్, భారత సైన్యాన్ని విమర్శిస్తూ వాట్సాప్ స్టేటస్‌లో పోస్టులు పెట్టారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆమెను సస్పెండ్ చేస్తూ వర్సిటీ నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.ఆమె పోస్టులో.. బుధవారం తెల్లవారుజామున జరిగిన దాడుల్లో భారత్.. పాకిస్తాన్లో ఒక పిల్లవాడిని చంపేసింది. ఇద్దరు వ్యక్తులను గాయపరిచింది. మీ స్వంత రక్తదాహం కోసం, ఎన్నికల విన్యాసాల కోసం అమాయక ప్రాణాలను చంపడం ధైర్యం కాదు.. అది న్యాయం కాదు. ఇది పిరికి చర్య! అని ఆమె తన స్టేటస్‌లో రాసుకొచ్చారు. లాక్డౌన్లు, ఆహార కొరత వంటి అనిశ్చితుల గురించి కూడా ఆమె హెచ్చరించారు. దీంతో, ఆమె వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. Meet Lora S., an Assistant Professor at SRM Institute of Science & Technology.⁰In the wake of Operation Sindoor, she repeatedly posted anti-Army content on her social media.Is this what passes for academic responsibility at @SRM_Univ?She has now been suspended. pic.twitter.com/1pufrM7kSj— Rakesh M (@Fitsanatani) May 8, 2025

ఇది మా దేశం.. మా బాధ్యత.. ఎవరూ ప్రశ్నించకండి: రష్మిక
ఆపరేషన్ సిందూర్‌పై పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్న రియాక్ట్ అయ్యారు. ఈమేరకు సోషల్‌మీడియాలో ఒక పోస్ట్ చేశారు. 'ఉగ్రవాదం నుంచి తనను తాను రక్షించుకునే హక్కును కూడా కొందరు తప్పుపడుతున్నారని, దానిని యుద్ధ దాహమంటూ తప్పుగా అర్థం చేసుకోకూడదని ఆమె అన్నారు. అన్యాయానికి బదులు తీర్చుకునే దేశాన్ని ఎవరూ ప్రశ్నించొద్దని రష్మిక (Rashmika) కోరారు."ఉగ్రవాదం నుంచి రక్షణ కోసం చేసే పోరాటం యుద్ధం కాదు. ఈ పోరాటానికి మద్ధతిచ్చే వారు యుద్ధోన్మాదులు కాదు. వారందరూ దేశ భద్రత, న్యాయం విలువైనవిగా భావించే పౌరులు. మేము శాంతిని కోరుకుంటాం.., అలా అని మాకు తలపెట్టిన హానిని అంగీకరించడానికి సిద్ధంగా ఎంతమాత్రం లేము. రెచ్చగొట్టే దురాక్రమణకు, ఆత్మ రక్షణకు మధ్య లోతైన నైతిక వ్యత్యాసం ఉంది. కుట్రలు పన్ని ఉద్దేశపూర్వకంగా జరిగిన ఉగ్రవాద చర్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు దానికి ప్రతీకారం తీర్చుకోవడం మా దేశ బాధ్యతే అవుతుంది. అది ఎంతమాత్రం అవకాశం కాదు. శాంతిని కోరుకోవడం అంటే మౌనంగా హానిని అంగీకరించడం కాదు. మాకు జరిగిన అన్యాయాన్ని బదులు తీర్చుకుంటున్న దేశాన్ని ఎవరూ ప్రశ్నించొద్దు.. మీకు చేతనైతే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారిని ప్రశ్నించండి. మా దేశ సరిహద్దుల మీదుగా ఉగ్రవాదులను పంపుతున్న దేశాన్ని ప్రశ్నించండి.' అని రష్మిక రాసుకొచ్చారు.

కరాచీ ఎయిర్‌పోర్టు లాక్డౌన్.. పెట్రోల్ బంక్‌లు బంద్!
ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. భారత్ దాడుల నేపథ్యంలో పాకిస్తాన్‌కు చుక్కలు కనిపిస్తున్నాయి. తాజాగా భారత్ దాడుల కారణంగా కరాచీ ఎయిర్‌పోర్టులో లాక్డౌన్ విధించారు. కరాచీ ఎయిర్‌పోర్టు నుంచి ప్రయాణీకుల తరలిస్తున్నట్టు సమాచారం. బ్లాక్ అవుట్ ప్రకటించారు. అలాగే, పాక్ ఎయిర్‌స్పేస్‌లో విమానాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. మరోవైపు.. భారత్ ముప్పెట దాడులు చేస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ గగనతలం మూసివేశారు. అలాగే, భారత్‌తో యుద్ధం కారణంగా పాకిస్తాన్లో కొరత మొదలైంది. తాజాగా ఇస్లామాబాద్‌లో 48 గంటలపాటు పెట్రోల్‌బంక్‌లు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో, ప్రజలు అల్లాడిపోతున్నారు.All PETROL PUMPS in Islamabad SHUTDOWN for 48 hrsPaaijaan tel khatam hogya 😭#IndiaPakistanWar pic.twitter.com/D9hkvnEuQM— Dev Madan Chronicles (@DMC_0001) May 10, 2025 🚨#BREAKING!!! Completely BLACKED OUT, this is the scene at Karachi Airport after Pakistani airspace cleared,RT pic.twitter.com/Vpt8evRQFG— G7 News (@G7NEWSX) May 10, 2025ఇదిలా ఉండగా.. సరిహద్దుల వెంట 26 ప్రదేశాలపై డ్రోన్లు, మిస్సైల్‌తో పాక్ దాడి చేయడంతో.. భారత్ తీవ్రంగా ప్రతిస్పందించింది. పాకిస్తాన్‌లోని మూడు ప్రధాన వైమానిక స్థావరాలపై విరుచుకుపడింది. పాక్ సైన్యం హెడ్‌క్వార్టర్ ఉన్న రావల్పిండి చక్లాలలోని నూర్ఖాన్, చక్వాల్లోని మురీద్, జాంగ్ జిల్లా షోర్కోట్లో ఉన్న రఫీకి వైమానిక స్థావరాల్లో పేలుళ్లు జరిగాయి. ఈ దాడుల విషయాన్ని ఆ దేశ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరిఫ్ చౌదురి ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో భారత్ దాడులకు సరైన రీతిలో ప్రతిస్పందిస్తామని ఆ దేశ సైన్యం పేర్కొంది.Pakistani airspace is reportedly closed again. A friend is stuck at Karachi Airport — complete blackout, no updates. Situation tense pic.twitter.com/tww6jVWSG2— Nasir (@khan_nasir19) May 9, 2025 So now it's in Karachi.. blasts are happening in air..Near old airport..#Pakistan #IndiaPakistanWar #PakistanZindabad pic.twitter.com/3gKbLY9lqn— Sarah Peracha (@sarahperacha) May 10, 2025 ఇక, రెండు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత మరోసారి భారత్‌పై పాకిస్తాన్ దుస్సాహసానికి ఒడిగట్టింది. బారాముల్లా నుంచి భుజ్ వరకు 26 ప్రాంతాలపైకి వరసగా డ్రోన్లు పంపింది. ముఖ్యంగా శ్రీనగర్ విమానాశ్రయాన్ని, అవంతీపొరా వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని పంపిన డ్రోన్లను భారత సైన్యం విజయవంతంగా నిర్వీర్యం చేసి సత్తా చాటుకుంది. ఇక తాజాగా శనివారం తెల్లవారుజాము నుంచి పాక్ తిరిగి దాడులు చేయడంతో భారత్ తిప్పికొట్టింది. Seems so drones are being hit towards Karachi airport. Hug blasts heard towards Karachi airport. pic.twitter.com/ikFvyMHpsg— Nazim Abbas (@NazimAbbas_1) May 10, 2025 Visuals Coming From Karachi.کراچی Malir airport سے مناظر۔ pic.twitter.com/PgGmfsGY5M— The Awazaar Sain (@adeelzsiddiqui) May 10, 2025
సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం
ప్రపంచంలోనే వేగవంతమైన పక్షులు
'ఆపరేషన్ సిందూర్'పై బుద్దిలేని వ్యాఖ్యలు.. నటిపై భగ్గుమన్న నెటిజన్లు
భారత్‌లో WTC ఫైనల్-2027!.. ఐసీసీ నిర్ణయం?
జవాన్ వీర మరణంపై వైఎస్సార్సీపీ సంతాపం
శ్రీవిష్ణు ‘సింగిల్’కి రికార్డు ఓపెనింగ్స్... తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?
ఎండినా... నిమ్మ అమ్మే!
డ్రగ్స్‌కు బానిసైన డాక్టర్ నమ్రత.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు
మండే ఎండల్లో..పచ్చదనం..చల్లదనం కూడా!
ఆంధ్రప్రదేశ్‌లో తిరోగమన ప్రభుత్వం!
బిడ్డకు జన్మనిచ్చి మరణించిన స్టార్ హీరోయిన్.. అతనే 'హిట్-3' విలన్
ఐదు విమానాలు కూల్చేశాం: పాక్ ప్రధాని షరీఫ్
138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్‌తో
ఆపరేషన్ సిందూర్
ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు
Operation Sindoor: పాక్ క్రికెట్ బోర్డుకు దెబ్బ మీద దెబ్బ!
జమ్మూకశ్మీర్‌లో మళ్ళీ పాకిస్తాన్ డ్రోన్ దాడులు
ఆపరేషన్ సిందూర్‌తో పాక్ ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి
మరో జెట్ విమానాన్ని కోల్పోయిన అమెరికా
చల్లని కబురు
ఈ రాశి వారికి ఆస్తి లాభం.. ఉద్యోగులకు కొత్త హోదాలు
ఈ రాశి వారికి సోదరుల నుంచి ధనలాభం.. వ్యాపారాలలో ముందడుగు
మాపై దాడి చేస్తే ప్రపంచంలో ఎవరు మిగలరు- పాక్ రక్షణ మంత్రి ఖవాజా
ఈ ముక్క ఏదో పహల్గాం దాడికి ముందు చెప్పాల్సిందేమో సార్..!
అరుణాచల దర్శనం చేసుకున్న నటుడు ప్రభాకర్ ఫ్యామిలీ (ఫొటోలు)
ఐపీఎల్ వాయిదా?
దాయాది దుస్సాహసం.. దీటుగా బదులిచ్చిన భారత్
Operation Sindoor: ఈ ఒక్క ఫొటో చాలు: సానియా మీర్జా పోస్ట్ వైరల్
నీ శరీరం.. నీ ఇష్టం అన్నాడు : దీపికా పదుకొణె
కష్టార్జితం చెదల పాలు... లారెన్స్ పెద్ద సాయం
సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం
ప్రపంచంలోనే వేగవంతమైన పక్షులు
'ఆపరేషన్ సిందూర్'పై బుద్దిలేని వ్యాఖ్యలు.. నటిపై భగ్గుమన్న నెటిజన్లు
భారత్‌లో WTC ఫైనల్-2027!.. ఐసీసీ నిర్ణయం?
జవాన్ వీర మరణంపై వైఎస్సార్సీపీ సంతాపం
శ్రీవిష్ణు ‘సింగిల్’కి రికార్డు ఓపెనింగ్స్... తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?
ఎండినా... నిమ్మ అమ్మే!
డ్రగ్స్‌కు బానిసైన డాక్టర్ నమ్రత.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు
మండే ఎండల్లో..పచ్చదనం..చల్లదనం కూడా!
ఆంధ్రప్రదేశ్‌లో తిరోగమన ప్రభుత్వం!
బిడ్డకు జన్మనిచ్చి మరణించిన స్టార్ హీరోయిన్.. అతనే 'హిట్-3' విలన్
138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్‌తో
ఐదు విమానాలు కూల్చేశాం: పాక్ ప్రధాని షరీఫ్
ఆపరేషన్ సిందూర్
ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు
Operation Sindoor: పాక్ క్రికెట్ బోర్డుకు దెబ్బ మీద దెబ్బ!
మరో జెట్ విమానాన్ని కోల్పోయిన అమెరికా
జమ్మూకశ్మీర్‌లో మళ్ళీ పాకిస్తాన్ డ్రోన్ దాడులు
ఆపరేషన్ సిందూర్‌తో పాక్ ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి
ఈ రాశి వారికి ఆస్తి లాభం.. ఉద్యోగులకు కొత్త హోదాలు
చల్లని కబురు
ఈ రాశి వారికి సోదరుల నుంచి ధనలాభం.. వ్యాపారాలలో ముందడుగు
మాపై దాడి చేస్తే ప్రపంచంలో ఎవరు మిగలరు- పాక్ రక్షణ మంత్రి ఖవాజా
ఈ ముక్క ఏదో పహల్గాం దాడికి ముందు చెప్పాల్సిందేమో సార్..!
ఐపీఎల్ వాయిదా?
దాయాది దుస్సాహసం.. దీటుగా బదులిచ్చిన భారత్
Operation Sindoor: ఈ ఒక్క ఫొటో చాలు: సానియా మీర్జా పోస్ట్ వైరల్
నీ శరీరం.. నీ ఇష్టం అన్నాడు : దీపికా పదుకొణె
కష్టార్జితం చెదల పాలు... లారెన్స్ పెద్ద సాయం
పాక్ ప్రధాని ఇంటి సమీపంలో భారీ పేలుళ్లు.. నివాసం నుంచి షరీఫ్ తరలింపు
సినిమా

ఇది మా దేశం.. మా బాధ్యత.. ఎవరూ ప్రశ్నించకండి: రష్మిక
ఆపరేషన్ సిందూర్‌పై పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్న రియాక్ట్ అయ్యారు. ఈమేరకు సోషల్‌మీడియాలో ఒక పోస్ట్ చేశారు. 'ఉగ్రవాదం నుంచి తనను తాను రక్షించుకునే హక్కును కూడా కొందరు తప్పుపడుతున్నారని, దానిని యుద్ధ దాహమంటూ తప్పుగా అర్థం చేసుకోకూడదని ఆమె అన్నారు. అన్యాయానికి బదులు తీర్చుకునే దేశాన్ని ఎవరూ ప్రశ్నించొద్దని రష్మిక (Rashmika) కోరారు."ఉగ్రవాదం నుంచి రక్షణ కోసం చేసే పోరాటం యుద్ధం కాదు. ఈ పోరాటానికి మద్ధతిచ్చే వారు యుద్ధోన్మాదులు కాదు. వారందరూ దేశ భద్రత, న్యాయం విలువైనవిగా భావించే పౌరులు. మేము శాంతిని కోరుకుంటాం.., అలా అని మాకు తలపెట్టిన హానిని అంగీకరించడానికి సిద్ధంగా ఎంతమాత్రం లేము. రెచ్చగొట్టే దురాక్రమణకు, ఆత్మ రక్షణకు మధ్య లోతైన నైతిక వ్యత్యాసం ఉంది. కుట్రలు పన్ని ఉద్దేశపూర్వకంగా జరిగిన ఉగ్రవాద చర్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు దానికి ప్రతీకారం తీర్చుకోవడం మా దేశ బాధ్యతే అవుతుంది. అది ఎంతమాత్రం అవకాశం కాదు. శాంతిని కోరుకోవడం అంటే మౌనంగా హానిని అంగీకరించడం కాదు. మాకు జరిగిన అన్యాయాన్ని బదులు తీర్చుకుంటున్న దేశాన్ని ఎవరూ ప్రశ్నించొద్దు.. మీకు చేతనైతే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారిని ప్రశ్నించండి. మా దేశ సరిహద్దుల మీదుగా ఉగ్రవాదులను పంపుతున్న దేశాన్ని ప్రశ్నించండి.' అని రష్మిక రాసుకొచ్చారు.

డ్రాగన్ బ్యూటీకి అదృష్టం.. బిగ్ ఛాన్సులతో బిజీ
చిత్రపరిశ్రమలో ఎవరికి ఎప్పుడు అదృష్టం వరిస్తుందో తెలియదు. అలా ఒక్క సక్సెస్ వచ్చిందంటే ఆ తరువాత అవకాశాలు వరుసకడతాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే స్టార్డమ్ వచ్చేస్తుంది. నటి కయదు లోహర్ పరిస్థితి అంతే. గత ఏడేళ్ల క్రితం మాతృభాషలో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ ఈమె. అప్పటి నుంచి మంచి అవకాశాల కోసం పోరాడుతునే ఉంది. కాగా ఏడాది క్రితం తన పోరాటానికి ఫలితం దక్కింది. తమిళంలో ప్రదీప్ రంగనాథన్‌తో డ్రాగన్ చిత్రంలో నటించే లక్కీచాన్స్ వరించింది. ఈ ఏడాది ప్రథమార్థంలో తెరపై వచ్చిన డ్రాగన్ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. ఈ చిత్రం అంత పెద్ద హిట్టు అవుతుందని, తనకు క్రేజ్ తెచ్చిపెడుతుందని బహుశా కయదు లోహర్ కూడా ఊహించి ఉండదు. అంతే ఇప్పుడు కోలీవుడ్‌లోనే కాదు దక్షిణాది చిత్ర పరిశ్రమ అంతా ఈమెను గుర్తించింది. అవకాశాలను అందిస్తోంది. నాని సినిమా "ది ప్యారడైజ్"లో కయదు లోహర్ హీరోయిన్గా నటిస్తోంది. అధికారికంగా ప్రకటన రావడమే ఇక మిగిలి ఉంది. ఈ సినిమాను శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఆపై కోలీవుడ్‌లో నటుడు అధర్వకు జంటగా హృదయం మురళి చిత్రంలో నటిస్తోంది. తాజాగా శింబు సరసన ఆయన 49వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతోంది. అంతేకాదు సంగీత దర్శకుడు, జీవీ ప్రకాష్‌కుమార్‌తో జతకట్టే లక్కీచాన్స్ వరించింది. ఈ చిత్రాన్ని మారియప్పన్ చిన్నా దర్శకత్వం వహించనున్నారు. అరుణ్‌కుమార్ ధనశేఖరన్ నిర్మించనున్న ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ సంగీతాన్ని అందించనున్నారు. కాగా జీవి ఇంతకుముందు తన 25 చిత్రం కింగ్స్టన్ చిత్రంతో తెరపైకి వచ్చారు. తాజాగా ప్రస్తుతం ఇడిముళక్కం, 13, బ్లాక్మెయిల్ చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిని పూర్తి చేసిన తరువాత కయాడులోహర్తో జతకట్టే ప్రయత్నం చేస్తారో, వాటితో పాటు ఈ చిత్రాన్ని చేస్తారో తెలియాల్సి ఉంది.

పుట్టినరోజు ప్రత్యేకం
హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు (మే 9) సందర్భంగా ఆయన ఫ్యాన్స్‌కు డబుల్ అప్డేట్స్ ఇచ్చారు మేకర్స్. విజయ్ నటించనున్న ‘వీడీ 14’, ‘ఎస్వీసీ 59’ సినిమాల కొత్తపోస్టర్స్ రిలీజ్ చేశారు. విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించనున్న చిత్రం ‘వీడీ 14’ (వర్కింగ్ టైటిల్). ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్ నిర్మించనున్నారు. ఈ సినిమాకి సంబంధించి ధ్యానముద్రలో ఉన్న విజయ్ దేవరకొండపోస్టర్ని రిలీజ్ చేశారు.‘‘బ్రిటిష్ కాలం నేపథ్యంతో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందనున్న చిత్రం ‘వీడీ 14’. 1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక ఘటనల ఆధారంగాపాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ఈ సినిమా ఉంటుంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని మేకర్స్ తెలిపారు. ఇదిలా ఉంటే... విజయ్ దేవరకొండ హీరోగా రవికిరణ్ కోలా దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ ఓ సినిమా నిర్మించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై రూపొందనున్న 59వ చిత్రం ఇది. అందుకే ‘ఎస్వీసీ 59’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. విజయ్ దేవరకొండ బర్త్‌డే సందర్భంగా ఓపోస్టర్ రిలీజ్ చేశారు. ‘‘రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో ఈపాన్ ఇండియా సినిమాని రూపొందించనున్నాం. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని యూనిట్ తెలిపింది.రౌడీ వేర్ లాభాల్లో సైన్యానికి విరాళం విజయ్ దేవరకొండకి క్లాత్ బ్రాండ్ ‘రౌడీ వేర్’ ఉన్న విషయం తెలిసిందే. ‘మేడ్ ఇన్ ఇండియా మాత్రమే కాదు మేడ్ ఫర్ ఇండియా’ అంటూ రాబోయే కొన్ని వారాలపాటు ఈ రౌడీ వేర్ అమ్మకాల ద్వారా వచ్చే లాభాల్లో కొంత భారత సైన్యానికి విరాళంగా ఇవ్వనున్నట్లు విజయ్ దేవరకొండ తెలిపారు.

ఇది వేడుకలకు సమయం కాదు: కమల్‌హాసన్
కమల్‌హాసన్ హీరోగా నటించిన ‘థగ్ లైఫ్’ సినిమా ఆడియో విడుదల వేడుక వాయిదా పడింది. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శింబు, త్రిష, అశోక్ సెల్వన్, ఐశ్వర్యా లక్ష్మి, జోజు జార్జ్ తదితరులు ఇతర ప్రధానపాత్రలు పోషించారు. కమల్‌హాసన్, మణిరత్నం, ఆర్. మహేంద్రన్, శివ అనంత్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 5నపాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ రిలీజ్ చేస్తోంది. ఈ నెల 16న ‘థగ్ లైఫ్’ ఆడియో విడుదల వేడుకని ఘనంగా నిర్వహించాలని చిత్రయూనిట్ ప్లాన్ చేసింది. అయితే ప్రస్తుతం భారత్–పాకిస్తాన్ సరిహద్దుల్లో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో ఈ వేడుక వాయిదా వేసినట్లు చిత్రబృందం తెలియజేసింది. ఈ మేరకు ‘ఆర్ట్ కెన్ వెయిట్–ఇండియా కమ్స్ ఫస్ట్’ అంటూ కమల్‌హాసన్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘మన దేశ సరిహద్దుల్లో చోటు చేసుకున్న పరిణామాలు, ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 16న నిర్వహించాల్సిన ‘థగ్ లైఫ్’ ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నాం.మన దేశాన్ని రక్షించడంలో మన సైనికులు అప్రతిహత ధైర్యంతో ముందుండిపోరాడుతున్న వేళ వేడుకలకు సమయం కాదని భావిస్తున్నాం. ఇది సంఘీభావానికి సమయం అని నమ్ముతున్నాను. ఈ సమయంలో మన దేశాన్ని కాపాడుతూ అప్రమత్తంగా ఉన్న మన సైనికుల గురించి మనం ఆలోచించాలి. పౌరులుగా మనం సంయమనంతో, సంఘీభావంతో స్పందించాలి. ఆడియో రిలీజ్ కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తాం’’ అని కమల్‌హాసన్ పేర్కొన్నారు.
న్యూస్ పాడ్‌కాస్ట్

రెండో రోజు కూడా రెచ్చిపోయిన పాకిస్తాన్... 20 నగరాలు సహా 26 ప్రాంతాలపై గురి... పాక్ దాడులను దీటుగా తిప్పికొట్టిన భారత సైన్యం

భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం ప్రారంభం... సరిహద్దుల్లో దాడులతో కవ్వించిన పాక్ సైన్యం.. దీటుగా తిప్పికొడుతున్న భారత సేనలు... మూడు పాక్ ఫైటర్ జెట్ల కూల్చివేత, ఇద్దరు పైలట్ల పట్టివేత

పాకిస్తాన్ ఉగ్రవాద తండాలపై 'రక్త సిందూరం' 100 మందికి పైగా ముష్కరులు హతం..

పాక్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి..

దుష్ట పాకిస్తాన్ భరతం పట్టడానికి ముహూర్తం ఖరారు... ఈ వారాంతంలోపే భారీ ఆపరేషన్ జరిగే అవకాశం... బుధవారం రాష్ట్రాల్లో మాక్‌డ్రిల్స్

యాక్సిస్ ఎనర్జీ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో చంద్రబాబు సర్కారు అడ్డగోలు ఒప్పందం... అత్యధిక ధరకు 400 మెగావాట్ల విద్యుత్ కొనడానికి అంగీకారం

అన్నం పెట్టే రైతన్నలకు సున్నం పెడతారా?... కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు

వణుకుతున్న పాకిస్తాన్. భారత్‌ను నిలువరించాలని అరబ్ దేశాలను వేడుకుంటున్న పాకిస్తాన్. తమకు ఉగ్రచరిత్ర ఉందని అంగీకరించిన బిలావల్ భుట్టో

ప్రతి ఇంటినీ చంద్రబాబు మోసం చేశారు: వైఎస్ జగన్ ఆగ్రహం

దేశవ్యాప్తంగా జనగణనతో పాటే కులగణన: కేంద్రం కీలక నిర్ణయం
క్రీడలు

మూడు పతకాలకు విజయం దూరంలో
షాంఘై: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–2 టోర్నమెంట్లో భారత ఆర్చర్లు మూడు విజయాలు సాధిస్తే మూడు పతకాలను ఖరారు చేసుకుంటారు. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో అభిషేక్ వర్మ (ఢిల్లీ)–మధుర (మహారాష్ట్ర) జోడీ కాంస్య పతకం కోసం పోటీపడనుండగా... మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో దీపిక కుమారి... పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో పార్థ్ సాలుంఖే సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. సెమీఫైనల్లో గెలిస్తే దీపిక, పార్థ్ స్వర్ణ, రజత పతకాల కోసం రేసులో నిలుస్తారు. సెమీఫైనల్లో ఓడిపోతే కాంస్య పతకం కోసం పోటీపడతారు. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ సెమీఫైనల్లో అభిషేక్–మధుర ద్వయం 156–158తో ఎల్లా గిబ్సన్–అజయ్ స్కాట్ (బ్రిటన్) జంట చేతిలో ఓడిపోయింది. నేడు జరిగే కాంస్య పతక మ్యాచ్‌లో ఫాటిన్ నూర్‌ఫతే–మొహమ్మద్ జువైదీ (అమెరికా)లతో అభిషేక్, మధుర తలపడతారు. పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో ఒలింపియన్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ ధీరజ్ బొమ్మదేవర, తరుణ్‌దీప్ రాయ్ తొలి రౌండ్లో, అతాను దాస్ క్వార్టర్ ఫైనల్లో ని్రష్కమించారు. ధీరజ్ 5–6తో అబ్దుల్లా (టర్కీ) చేతిలో, తరుణ్‌దీప్ 5–6తో తెత్సుయ (జపాన్) చేతిలో, అతాను దాస్ 2–6తో కిమ్ వూజిన్ (కొరియా) చేతిలో ఓడిపోయారు. పార్థ్ సాలుంఖే తొలి రౌండ్లో 6–5తో 2020 టోక్యో ఒలింపిక్స్ స్వర్ణపతక విజేత మెటీ గాజోజ్ (టర్కీ)పై, రెండో రౌండ్లో 6–5తో తెత్సుయ (జపాన్)పై, మూడో రౌండ్లో 6–2తో రియాన్ ట్యాక్ (ఆస్ట్రేలియా)పై, క్వార్టర్ ఫైనల్లో 6–2తో కిమ్ జె డియోక్ (కొరియా)పై గెలుపొందాడు. మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో ‘ట్రిపుల్ ఒలింపియన్’ దీపిక కుమారి తొలి రౌండ్లో 6–4తో లూసియా (స్పెయిన్)పై, రెండో రౌండ్లో 6–0తో డయానా (కజకిస్తాన్)పై, మూడో రౌండ్లో 6–4తో విక్టోరియా (ఫ్రాన్స్)పై, క్వార్టర్ ఫైనల్లో 6–2తో లీ జియామన్ (చైనా)పై విజయం సాధించింది. భారత్‌కే చెందిన అంకిత మూడో రౌండ్లో 3–7తో లిమ్ సిహైన్ (కొరియా) చేతిలో, అన్షిక తొలి రౌండ్లో 5–6తో ఎలీసా టార్ట్లెర్ (జర్మనీ) చేతిలో, సిమ్రన్‌జిత్ తొలి రౌండ్లో 3–7తో యుహెరా రుకా (జపాన్) చేతిలో ఓటమి చవిచూశారు.

IPL 2025: ధనాధన్‌గా దూసుకొచ్చారు
14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్లో కోట్లు కొల్లగొట్టిన బిహార్ బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ... బరిలోకి దిగిన మూడో మ్యాచ్‌లోనే రికార్డు సెంచరీతో తన పేరు మారుమోగేలా చేసుకున్నాడు! ప్రదాన ఆటగాళ్లంతా విఫలమవుతున్న చోట... నేనున్నానంటూ బాధ్యతలు భూజానికెత్తుకున్న 17 ఏళ్ల ఆయుశ్ మాత్రే ఆడింది తక్కవ మ్యాచ్‌లే అయినా... చెన్నై భవిష్యత్తు ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు!పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్ ధాటిగా ఆడుతూ ప్రత్యర్థి బౌలర్లకు గుబులు పుట్టిస్తుంటే... ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ అభిషేక్ పొరెల్ తన నిలకడతో ఆకట్టుకున్నాడు. తాజా ఐపీఎల్ సీజన్లో మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్న అన్క్యాప్డ్ ఓపెనర్లపై కథనం... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ వారం రోజులపాటు వాయిదా పడింది. ఇప్పటి వరకు 58 మ్యాచ్‌లు జరిగాయి. మరో 12 లీగ్ మ్యాచ్‌లు... ఆ తర్వాత 4 ప్లే ఆఫ్ మ్యాచ్‌లు జరగాల్సి ఉన్నాయి. వారం రోజుల తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి ఐపీఎల్ టోర్నీ ఎప్పుడు నిర్వహించాలనే విషయంపై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌ల్లో స్టార్ ఆటగాళ్లకంటే ఏమాత్రం అంచనాలు లేని యువ ఆటగాళ్లు ఆకట్టుకున్నారు. హేమాహేమీలతో పోటీపడుతూ... తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఏడాది ముఖ్యంగా యువ ఓపెనర్ల జోరు ఎక్కువ కనిపిస్తోంది. వైభవ్ సూర్యవంశీ (రాజస్తాన్ రాయల్స్), ఆయుశ్ మాత్రే (చెన్నై సూపర్ కింగ్స్), అభిషేక్ పొరెల్ (ఢిల్లీ క్యాపిటల్స్)... ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ సింగ్ (పంజాబ్ కింగ్స్) ఈ కోవలోకే వస్తారు. టీమిండియా గడప తొక్కాలంటే... ఐపీఎల్లో రాణించడం తప్పనిసరిలా మారిపోయిన ప్రస్తుతం తరుణంలో ఈ సీజన్లో ఈ ఐదుగురు ఆటగాళ్లు తమదైన ముద్ర వేస్తున్నారు. ఇందులో ఒక్కొక్కరి శైలి ఒక్కో రకం కాగా... అందరి లక్ష్యం భారీగా పరుగులు సాధించడమే. తాజా సీజన్లో అన్క్యాప్డ్ (జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించని ఆటగాళ్లు) ప్లేయర్లుగా బరిలోకి దిగి పేసర్లు, స్పిన్నర్లు అనే తేడా లేకుండా విరుచుకుపడుతున్న ఈ యువతరం... భారత క్రికెట్ భవిష్యత్తుపై మరింత భరోసా పెంచుతోంది. ఆహా... ఆయుశ్ ముంబైకి చెందిన 17 ఏళ్ల ఆయుశ్ మాత్రేకు అనూహ్యంగా ఐపీఎల్లో ఆడే అవకాశం దక్కింది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో ఈ యువ ఓపెనర్‌ను రూ. 30 లక్షలు ఇచ్చి జట్టులోకి తీసుకుంది. ఐపీఎల్ తొలి మ్యాచ్‌లోనే 15 బంతుల్లో 32 పరుగులు చేసిన ఈ కుడిచేతి వాటం ఓపెనర్... బెంగళూరుతో మ్యాచ్‌లో 48 బంతుల్లో 94 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. బౌలర్ ఎవరైనా లెక్కచేయకపోవడం... బంతి తన పరిధిలో ఉంటే చాలు విరుచుకుపడటం ఆయుశ్ ప్రధాన అ్రస్తాలు. ఈ సీజన్లో చెన్నై జట్టు పేలవ ప్రదర్శన కనబర్చడంతో ఆయుశ్ మెరుపులు పెద్దగా వెలుగులోకి రాలేదు. అయితే సాధారణ ఆటగాళ్లను సైతం మ్యాచ్ విన్నర్లుగా తీర్చిదిద్దగల ధోని సారథ్యంలో మాత్రే భవిష్యత్తులో మరింత రాటుదేలడం ఖాయమే. మ్యాచ్‌లు పరుగులు అత్యధిక స్కోరు స్ట్రయిక్ రేట్ 5 163 94 181.11అభిషేక్ అదుర్స్ఈ ఏడాది అంచనాలకు మించి రాణిస్తున్న ఆటగాళ్లలో అభిషేక్ పొరెల్ ఒకడు. గతేడాది ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం అతడిపై నమ్మకం ఉంచగా... దాన్ని పొరెల్ నిలబెట్టుకుంటున్నాడు. తాజా సీజన్లో సహచర ఓపెనర్లు నిలకడ కనబర్చలేకపోయినా... పొరెల్ మాత్రం ప్రభావం చూపాడు. 22 ఏళ్ల ఈ ఎడం చేతి వికెట్ కీపర్... కేఎల్ రాహుల్ తర్వాత ప్రస్తుతం ఢిల్లీ జట్టులో రెండో అత్యధిక స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. పేస్‌తో పాటు స్పిన్‌ను కూడా సమర్థవంతంగా ఎదుర్కోగల పొరెల్ నైపుణ్యం అతడిని క్లాస్ ప్లేయర్ల జాబితాలో చేర్చుతుంది. బంతిపై మరీ పగబడినట్లు కాకుండా... సుతారాంగా అతడు కొట్టే షాట్లు క్రీడాభిమానులను ఎంతగానో అలరిస్తున్నాయి. బ్యాటింగ్‌లో భళా అనిపించుకుంటున్న పొరెల్... స్ట్రయిక్ రొటేషన్ ప్రాధానత్యను అర్థం చేసుకుంటూ ఇన్నింగ్స్‌ను నడిపిస్తున్న తీరు ముచ్చటేస్తోంది. మ్యాచ్‌లు పరుగులు అత్యధిక స్కోరు స్ట్రయిక్ రేట్ 12 265 51 149.71వైభవ్ జ్వాలఐపీఎల్లో ఎదుర్కొన్న తొలి బంతికే సిక్స్ బాది... తన ఆగమనాన్ని ఘనంగా చాటుకున్న 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ మూడో మ్యాచ్‌లోనే రికార్డు సెంచరీ తన పేరిట లిఖించుకున్నాడు. చిన్నప్పటి నుంచి క్రికెటే శ్వాసగా పెరిగిన ఈ బిహార్ ఎడంచేతి వాటం ఓపెనర్... గుజరాత్ టైటాన్స్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. జైపూర్ వేదికగా జరిగిన పోరులో 7 ఫోర్లు, 11 సిక్స్‌లతో చెలరేగిపోయాడు. రెండొందల పైచిలుకు లక్ష్యం కళ్ల ముందు కనిపిస్తున్నా ఏమాత్రం వెరవకుండా విరుచుకుపడి టి20ల్లో సెంచరీ చేసిన పిన్న వయస్కుడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. 94 పరుగుల వద్ద ఉండి కూడా ధైర్యంగా సిక్స్ కొట్టి మూడంకెల స్కోరు అందుకున్న ఈ కుర్రాడు. ఆ తర్వాత పెద్ద ఇన్నింగ్స్ ఆడకపోయినా... అతడిలో ప్రతిభకు కొదవలేదని మాత్రం నిరూపితమైంది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మాదిరిగా వైభవ్క కూడా చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంచనాల ఒత్తిడి దరి చేరనివ్వకుండా... నిలకడ కొనసాగిస్తే వీరిలో కొందరు ఆటగాళ్లు టీమిండియా తరఫున ప్రాతినిధ్యం వహించడం పెద్ద కష్టం కాకపోవచ్చు.మ్యాచ్‌లు పరుగులు అత్యధిక స్కోరు స్ట్రయిక్ రేట్ 5 155 101 209.45ఫటాఫట్.. ప్రభ్సిమ్రన్ఈ ఏడాది పంజాబ్ కింగ్స్ మంచి ప్రదర్శన చేస్తోంది అంటే... దాని ప్రధాన కారణాల్లో ఓపెనింగ్ జోడీ ప్రదర్శన ముఖ్యమైంది. ఒక ఎండ్‌లో ఆర్య అదరగొడుతుంటే... మరో ఎండ్ నుంచి ‘పిట్ట కొంచం కూత ఘనం’లాగా ప్రభ్‌సిమ్రన్ చెలరేగిపోతున్నాడు. ఫలితంగానే చాన్నాళ్ల తర్వాత పంజాబ్ జట్టు ప్లే ఆఫ్స్ దిశగా సజావుగా సాగుతోంది. హెడ్ కోచ్ రికీ పాంటింగ్ శిక్షణ, శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో భయం లేకుండా ఆడుతున్న 24 ఏళ్ల ప్రభ్‌సిమ్రన్ సింగ్... జట్టు నమ్మదగ్గ ఆటగాళ్లలో ఒకడిగా మారిపోయాడు. లక్నోపై 48 బంతుల్లోనే 91 పరుగులు చేసిన ప్రభ్‌సిమ్రన్... స్లో పిచ్‌పై కోల్‌కతా స్పిన్నర్లను ఎదుర్కొని 83 పరుగులు చేశాడు. పవర్‌ప్లేను పూర్తిగా వినియోగించుకుంటూ భారీగా పరుగులు రాబడుతున్న ఈ కుడి చేతి వాటం బ్యాటర్... భవిష్యత్తుపై భరోసా పెంచుతున్నాడు.మ్యాచ్‌లు పరుగులు అత్యధిక స్కోరు స్ట్రయిక్ రేట్ 12 487 91 170.87ప్రియాన్ష్ ‘స్పెషల్ టాలెంట్’ఆ్రస్టేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌తో ‘స్పెషల్ టాలెంట్’ అని ప్రశంసలు అందుకున్న 23 ఏళ్ళ ప్రియాన్ష్ ఆర్య... చెన్నైపై సెంచరీ బాది ప్రకంపనలు సృష్టించాడు. బంతిని నిశితంగా గమనించడంతో పాటు దాని వేగాని ప్రియాన్ష్ ఆర్య..కి అనుగుణంగా షాట్లను ఎంపిక చేసుకొని అప్పటికప్పుడు వాటిని అమలు చేయడంలో ప్రియాన్ష్ దిట్ట. ముల్లాన్‌పూర్ వేదికగా చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ప్రియాన్ష్... ఇన్నింగ్స్‌ను పరిశీలిస్తే ఇది అవగతమవుతుంది.బ్యాటింగ్‌కు అంతగా అనుకూలంగా లేని పిచ్‌పై ఆర్య అదరగొట్టి ఐపీఎల్లో ఐదో వేగవంతమైన శతకం (39 బంతుల్లో) చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. ఢిల్లీకి చెందిన ఈ ఎడం చేతివాటం బ్యాటర్... ఫోర్ల కంటే ఎక్కువ సిక్స్‌లు కొట్టడంలో సిద్ధహస్తుడు. అభిమానులు ముద్దుగా ‘లెఫ్ట్ హ్యాండ్ సెహ్వాగ్ ’ అని పిలుచుకుంటున్న ఆర్య... ఈ సీజన్లో పంజాబ్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్‌తో కలిసి జట్టుకు మెరుగైన ఆరంభాలు అందించడం... పవర్ ప్లేలో వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబడుతుండటంతో... మిడిలార్డర్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలుగుతోంది.మ్యాచ్‌లు పరుగులు అత్యధిక స్కోరు స్ట్రయిక్ రేట్ 12 417 103 194.85

వారం రోజుల విరామం
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)–2025 మ్యాచ్‌లకు బ్రేక్ పడింది. భారత్, పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో లీగ్‌ను వెంటనే నిలిపివేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించింది. లీగ్‌ను ‘వారం రోజుల పాటు’ ఆపేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. గురువారం ధర్మశాలలో ఢిల్లీ, పంజాబ్ మధ్య మ్యాచ్‌ను అకస్మాత్తుగా ఆపేసినప్పుడే లీగ్ కొనసాగడంపై సందేహాలు వచ్చాయి.శుక్రవారం దీనిని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఒకవైపు యుద్ధం సాగుతుండగా, మరోవైపు ఐపీఎల్ రూపంలో వినోదం కొనసాగడం సరైంది కాదని బోర్డు భావించింది. ఫ్రాంచైజీలు, ప్రసారకర్తలు, స్పాన్సర్లతో పాటు లీగ్‌తో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉన్నవారందరితో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు వెల్లడించింది. ‘ఐపీఎల్ భాగస్వాములందరితో మాట్లాడిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చాం.ప్రస్తుత స్థితిలో మేం దేశం వెంట ఉన్నాం. ప్రభుత్వానికి, సైన్యానికి మా సంఘీభావం తెలియజేస్తున్నాం. ఆపరేషన్ సిందూర్ ద్వారా దేశాన్ని రక్షిస్తున్న ఆర్మీ ధైర్యసాహసాలకు మేం సెల్యూట్ చేస్తున్నాం. మన దేశంలో క్రికెట్ పట్ల అపరిమిత ప్రేమ ఉందనేది వాస్తవం. అయితే దేశంకంటే, దేశం సార్వభౌమత్వం, భద్రతకంటే ఏదీ ఎక్కువ కాదు. జాతి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే బీసీసీఐ ఏ నిర్ణయమైనా తీసుకుంటుంది. మాకు మద్దతుగా నిలిచిన ఐపీఎల్ భాగస్వాములందరికీ కృతజ్ఞతలు’ అని బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. లీగ్ కొనసాగించడం, కొత్త తేదీలు, వేదికలపై అన్ని వర్గాలతో చర్చించిన తర్వాత పరిస్థితులను బట్టి త్వరలో నిర్ణయం తీసుకుంటామని కూడా బోర్డు స్పష్టం చేసింది. క్రికెటర్లు స్వస్థలాలకు... ఐపీఎల్ వాయిదాపై ప్రకటన వచ్చిన వెంటనే అన్ని జట్లలోని క్రికెటర్లు తమ సొంత నగరాలకు బయలుదేరేలా ఆయా ఫ్రాంచైజీలు ఏర్పాట్లు చేశాయి. స్వదేశానికి వెళ్లిపోవాలనుకునే విదేశీ క్రికెటర్లకు ఏర్పాట్లపరంగా ‘ప్లేయర్స్ అసోసియేషన్’ సహకరిస్తోంది. గురువారం ధర్మశాలలో మ్యాచ్ రద్దయ్యాక ఢిల్లీ, పంజాబ్ క్రికెటర్లు, సహాయక సిబ్బందిని ముందుగా బస్సు ద్వారా జలంధర్‌కు తరలించారు. అక్కడి నుంచి వారంతా ప్రత్యేక వందేభారత్ రైలులో ఢిల్లీకి పయనమయ్యారు. విమర్శల బారిన పడరాదనే... ఐపీఎల్ సీజన్ లీగ్ దశలో 58 మ్యాచ్‌లు ముగియగా... మరో 12 మ్యాచ్‌లు మాత్రమే మిగిలాయి. వీటిలో అహ్మదాబాద్‌లో మూడు... లక్నో, బెంగళూరులలో రెండు చొప్పున...హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, ముంబై, జైపూర్లలో ఒక్కో మ్యాచ్ జరగాల్సి ఉంది. ఇవి కాకుండా 4 ప్లే ఆఫ్స్‌లలో రెండేసి మ్యాచ్‌లకు హైదరాబాద్, కోల్‌కతా వేదికగా నిర్వహించాల్సి ఉంది. వాస్తవికంగా చూస్తే సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం ఉన్నా... ఉత్తరాదిలోని కొన్ని నగరాలు మినహా ఈశాన్యం, దక్షిణం వైపు సాధారణ పరిస్థితులే ఉన్నాయి. బీసీసీఐ స్థాయి, దానికి ఉన్న సాధన సంపత్తిని దృష్టిలో పెట్టుకొని చూస్తే కేవలం వేదికలు మార్చి చకచకా ఈ 16 మ్యాచ్‌లు నిర్వహించడం ఏమాత్రం సమస్య కాదు. అయితే ఒకవైపు యుద్ధం సాగుతుంటే, మన సైనికులు పోరాడుతుంటే మీకు ఆటలు కావాలా అని సగటు భారతీయుడు ఆగ్రహిస్తున్నాడు. ఇంత సంకట స్థితిలో ఎన్నో విషయాల్లో ప్రభుత్వం నుంచి ఆంక్షలు, హెచ్చరికలు వస్తుండగా ఐపీఎల్ మాత్రం కొనసాగడం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. దాంతో బీసీసీఐ కూడా పునరాలోచనలో పడింది. అయితే పూర్తిగా సీజన్‌ను రద్దు చేయకుండా, లేక సుదీర్ఘ సమయం వాయిదా వేయకుండా ‘ఒక వారం వాయిదా’ అంటూ సన్నాయి నొక్కులు చూపిస్తోంది. బహుశా వచ్చే వారం రోజుల్లో పరిస్థితులు మెరుగుపడవచ్చని, అప్పుడు మళ్లీ ఆడించవచ్చనే ఆలోచన కనిపిస్తోంది!ప్రత్యామ్నాయ తేదీలు ఏవి?బీసీసీఐ ‘వారం’ విరామం ప్రకటనను బట్టి చూస్తే వెంటనే కొనసాగించాలని భావిస్తున్నట్లుగా ఉంది. షెడ్యూల్ ప్రకారం మే 25న ఐపీఎల్ ముగియాలి. ఇప్పుడు మరో వారం దీనికి జోడిస్తే జూన్ 1న ముగిసేలా కొత్త షెడ్యూల్ ఇవ్వవచ్చు. సరిగ్గా చెప్పాలంటే టోర్నీని ముగించేందుకు బోర్డుకు 10 రోజులు చాలు. ‘డబుల్ హెడర్’లుగా రోజుకు రెండు లీగ్ మ్యాచ్‌ల చొప్పున 6 రోజులు... ప్లే ఆఫ్స్‌కు మరో 4 రోజులు సరిపోతాయి. జూన్ మొదటి వారంలో భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు బయలుదేరాల్సి ఉంది కాబట్టి కష్టమనే చర్చ ఉన్నా... తొలి టెస్టు జూన్ 20న మొదలవుతుంది. ఐపీఎల్లో ఆడుతున్న టెస్టు జట్టు సభ్యులు జూన్ 10 వరకు చేరుకున్నా సమస్య లేదు. ఇప్పటికిప్పుడు మ్యాచ్‌లు నిర్వహించకుండా ఆగిపోతే ఇంగ్లండ్ సిరీస్ తర్వాత ఆగస్టు, సెపె్టంబర్ వరకు లీగ్ వెళుతుంది. అయితే ఆగస్టులో భారత జట్టు బంగ్లాదేశ్‌తో వన్డే, టి20 సిరీస్‌లను ఆడనుంది. దీనిని వాయిదా వేసినా ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా మధ్య సిరీస్, ఇంగ్లండ్ బోర్డు నిర్వహించే ‘హండ్రెడ్’ టోర్నీలు ఉన్నాయి. ‘హండ్రెడ్’లో సగం జట్లను ఐపీఎల్ యజమానులే కొన్నారు కాబట్టి ఇది అసాధ్యం. సెప్టెంబర్‌లో 19 రోజులు ‘ఆసియా కప్’ టోర్నీకి కేటాయించారు. దీనికి భారత్ ఆతిథ్యం ఇస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ ఇక్కడ ఆడకపోవడమే కాదు... భారత్, పాక్ మధ్య మ్యాచ్‌లు జరగడం కూడా అసాధ్యమే! కాబట్టి ఈ ఒక్క టోర్నీని రద్దు చేస్తే ఐపీఎల్‌కు కావాల్సిన సమయం లభిస్తుంది.

మేమంతా మీ వెంటే...
న్యూఢిల్లీ: పాకిస్తాన్ సైన్యం దుశ్చర్యలను తమ ప్రాణాలు పణంగా పెట్టి ఎదుర్కొంటున్న భారత త్రివిధ దళాలకు క్రీడా దిగ్గజాలు మద్దతు పలికారు. క్రికెట్ స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి సహా చాంపియన్ అథ్లెట్ నీరజ్ చోప్రా, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధులు దేశ ప్రజల సంరక్షణ కోసం పగలనక... రాత్రనక శ్రమిస్తున్న సాయుధ బలగాల ధైర్యానికి సెల్యూట్ చేశారు. ప్రాణాలొడ్డి పోరాడుతున్న భారత సేనల ధైర్య సాహసాల్ని స్టార్లంతా కొనియాడారు. సోషల్ మీడియా వేదికగా తామంతా సైన్యం వెంటే అని స్థయిర్యం పెంచారు. దేశ రక్షణే లక్ష్యంగా శ్రమిస్తోన్న భారత ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లను చూసి గర్వపడుతున్నా. త్రివిధ దళాలు తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నా. ఈ పోరాటయోధుల వల్లే భారత్ తలెత్తుకొని నిలబడుతోంది. దేశం కోసం అహరి్నశలు శ్రమించే మీ వెంటే జాతి మొత్తం నడుస్తుంది. ఇలాంటి సందర్భంలో ప్రతి భారతీయుడు బాధ్యతగా మెలగాలి. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాన్ని ఎక్కడికక్కడ కట్టడి చేయాలని విజ్ఞప్తి. –భారత కెప్టెన్ రోహిత్ శర్మసాయుధ బలగాలకు నా సలామ్. ఎలాంటి విపత్కర పరిస్థితులకైనా ఎదురునిలిచి దేశాన్ని కాపాడే మన వీరుల ధైర్యసాహసాలకు జేజేలు పలుకుతున్నాం. భారత్ కోసం మీరు, మీ కుటుంబసభ్యులు చేసే త్యాగాలకు మేమంతా రుణపడే ఉంటాం. –విరాట్ కోహ్లి ఉగ్రవాదులను హతమార్చితే మౌనంగా ఉండాల్సిన చోట పాక్ యుద్ధాన్ని ఎంచుకొని తమ వక్రబుద్ధిని మరోమారు చూపింది. దీనికి తగిన గుణపాఠం మా సైన్యం మీకు నేర్పుతుంది. ఆ పాఠమెలా ఉంటుందంటే జీవితంలో మీరెప్పుడు మర్చిపోరు. –వీరేంద్ర సెహ్వాగ్ టెర్రరిజంపై పోరాటం... దేశ రక్షణకోసం మీరు కనబరిచే సాహసాలు మాకెంతో గర్వకారణం. సరిహద్దుల్లో మీరున్నారనే ధైర్యమే దేశాన్ని ధీమాగా నడిపిస్తోంది.–నీరజ్ చోప్రాభారత దళాలు చూపే ధైర్యం, క్రమశిక్షణ, త్యాగాలే దేశానికి బలం. ఆపరేషన్ సిందూర్‌ను విజయవంతంగా నిర్వహించి మన పతకాన్ని రెపరెపలాడించిన మీ నిస్వార్థసేవల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. జై హింద్. –పీవీ సింధు
బిజినెస్

స్టాక్ మార్కెట్లో మరో కొత్త ఇండెక్స్
స్టాక్ ఎక్స్చేంజీ దిగ్గజం బీఎస్ఈ తాజాగా డివిడెండ్ లీడర్స్ 50 పేరుతో ఇండెక్స్‌ను ప్రారంభించింది. బీఎస్ఈ అనుబంధ సంస్థ ఆసియా ఇండెక్స్ ఈ కొత్త ఇండెక్స్‌ను ప్రవేశపెట్టింది. బీఎస్ఈ 500 ఇండెక్స్‌లో భాగమైన 50 కంపెనీలకు దీనిలో చోటు కల్పింంది. అయితే గత 10ఏళ్లలో నిరవధికంగా డివిడెండ్లు చెల్లించిన దిగ్గజాలను మాత్రమే ఇందుకు ఎంపిక చేస్తారు.ప్రతీ ఏటా డిసెంబర్లో ఇండెక్స్‌ను సమీక్షించనున్నట్లు ఆసియా ఇండెక్స్ వెల్లడించిది. ఈ ఇండెక్స్‌ను ఈటీఎఫ్‌లు, ఇండెక్స్ ఫండ్స్‌తోపాటు.. దేశీయంగా విభిన్న రంగాల పనితీరును మదింపు చేయవచ్చని పేర్కొంది.అలాగే, పీఎంఎస్ వ్యూహాలు, మ్యూచువల్ ఫండ్ పథకాలు, ఫండ్ పోర్ట్ ఫోలియోల బెంచ్ మార్క్ కోసం దీన్ని ఉపయోగించవచ్చని తెలిపింది.మరో స్టాక్ ఎక్స్చేంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ కూడా ఇటీవల నిఫ్టీ వేవ్స్ ఇండెక్స్‌ను ప్రవేశపెట్టింది. మీడియా, ఎంటర్టైన్మెంట్, గేమింగ్ పరిశ్రమలకు ప్రాతినిధ్యం వహించే 43 లిస్టెడ్ కంపెనీలతో ఇండెక్స్‌ను రూపొందించింది. తద్వారా ఫిల్మ్, టీవీ, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్, మ్యూజిక్, గేమింగ్ తదితర వివిధ పరిశ్రమలకు చోటు కల్పించింది.

ఐపీఎల్ నిలిపివేత.. కంపెనీలకు నష్టం ఎంతంటే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)–2025 మ్యాచ్‌లను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. భారత్-పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ఐపీఎల్‌ను వెంటనే నిలిపేస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టం చేసింది. ప్రస్తుతానికి వారం రోజులపాటు లీగ్‌ను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. తదుపరి మ్యాచ్‌లకు సంబంధించి తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. ఐపీఎల్ 2025ను నిలిపివేయడం ప్రకటనదారులు, బ్రాడ్కాస్టర్లలో ఆందోళనలకు కారణమవుతుంది. ప్రకటనల ఆదాయంలో 35% తగ్గవచ్చని నిపుణులు భావిస్తున్నారు. లీగ్ వాయిదా పడడం వల్ల మార్కెటింగ్ ప్రణాళికలకు అంతరాయం కలిగినట్లు తెలియజేస్తున్నారు.బ్రాడ్కాస్టర్లు, బ్రాండింగ్ కంపెనీల ఆందోళనభారతదేశంలో అత్యంత లాభదాయకమైన క్రీడా ఈవెంట్లలో ఐపీఎల్ ఒకటి. ఇది మిలియన్ల మంది వీక్షకులను ఆకర్షిస్తోంది. భారీ ప్రకటనల ఆదాయాన్ని సృష్టిస్తోంది. మార్కెటింగ్ కీలకంగా మారిన ఈ లీగ్ పునఃప్రారంభించకపోతే జియోహాట్‌స్టార్ వంటి బ్రాడ్కాస్టర్లు రూ.2,000 కోట్ల ఆదాయ లోటును ఎదుర్కోవాల్సి ఉంటుందని కొందరు అంచనా వేస్తున్నారు. చాలా బ్రాండ్లు ఐపీఎల్ వాణిజ్య ప్రకటనల కోసం గణనీయంగా బడ్జెట్ కేటాయించాయి. అధిక వ్యూయర్షిప్ ద్వారా రాబడిని పెంచాలని నిర్ణయించాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వారు తీవ్రమైన ఆర్థిక పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. దీన్ని నివారించడానికి కొత్త వ్యూహాలతో ముందుకుసాగాలని కంపెనీలు భావిస్తున్నట్లు తెలియజేస్తున్నారు.జట్లు, ఫ్రాంచైజీలపై ప్రభావంప్రకటనదారులు, బ్రాడ్కాస్టర్లకు మించి ఈ వాయిదా నిర్ణయం నేరుగా ఐపీఎల్ ఫ్రాంచైజీలపై ప్రభావం చూపుతుంది. సెంట్రల్ రెవెన్యూ పూల్‌పై ఆధారపడే జట్లు తమ సంపాదనలో 20% క్షీణతను చూడవచ్చని కొందరు అంటున్నారు. భారత్-పాక్ యుద్ధ సమయంలో అనిశ్చితి కారణంగా అనేక ఫ్రాంచైజీలు స్పాన్సర్షిప్లను, టిక్కెట్ల అమ్మకాల ద్వారా సమకూరే ఆదాయాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు.ఇదీ చదవండి: ఇండియా-యూఎస్ వయా యూరప్భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో లీగ్ నిలిపివేతకు జాతీయ ప్రయోజనాలే కారణమని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పేర్కొంది. తొలుత వారం రోజుల విరామం ప్రకటించినప్పటికీ, అప్పటివరకు యుద్ధం సమసిపోనట్లయితే ఇది మరింతకాలం పోడిగించే అవకాశం ఉంది. ఇంకా ఆలస్యం అయితే లీగ్‌ను రద్దు చేసుకోవచ్చని కూడా కొందరు అంచనా వేస్తున్నారు.

ఏటీఎంల మూసివేత వదంతులు.. బ్యాంకుల స్పష్టత
భారత్–పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కారణంగా ఏటీఎంలను మూసివేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ప్రభుత్వ రంగ బ్యాంకులు ఖండించాయి. ఏటీఎంలన్నీ పూర్తి స్థాయిలో సజావుగానే పని చేస్తున్నాయని, వాటిలో తగినన్ని నగదు నిల్వలు ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశాయి. డిజిటల్ సేవలు కూడా సజావుగా సాగుతున్నాయని పేర్కొన్నాయి.‘మా ఏటీఎంలు, క్యాష్ డిపాజిట్ మెషీన్లు, డిజిటల్ సేవలు అన్నీ పూర్తి స్థాయిలో పని చేస్తున్నాయి. ప్రజలకు అందుబాటులోనే ఉన్నాయి‘ అని ఎస్బీఐ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ధ్రువీకరించుకోకుండా ఏ వార్తలను విశ్వసించొద్దంటూ కస్టమర్లకు సూచించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మొదలైనవి కూడా ఇదే తరహా మెసేజీలను పోస్ట్ చేశాయి.కాగా ఏటీఎంల మూసివేత అంటూ వచ్చిన వార్తా కథనాలను ప్రభుత్వ వార్తా సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం తనిఖీ చేసి అవి పూర్తిగా ఫేక్ అని తేల్చేసింది. భారత్-పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో ఇండియాలోని ఏటీఎంలపై రాన్సమ్వేర్ దాడి కారణంగా మూడు రోజులపాటు సర్వీసులు పని చేయవన్నట్లు సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు వచ్చాయి.

ఎల్ఐసీ కొత్త సర్వీసు.. వాట్సాప్ నుంచే..
ప్రభుత్వ రంగ భారతీయ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ ప్రీమియం చెల్లింపులు మరింత సులభతరంగా మారాయి. పాలసీల ప్రీమియంను వాట్సాప్ నుంచే సులభంగా చెల్లించే సదుపాయాన్ని ఎల్ఐసీ ప్రారంభింంది. ఎల్ఐసీ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్న పాలసీదారులు.. 8976862090 వాట్సాప్ నంబర్ ద్వారా తమ పాలసీలకు సంబంధిం చెల్లించాల్సిన ప్రీమియం వివరాలు తెలుసుకోవచ్చు.అక్కడి నుంచే నేరుగా యూపీఐ/నెట్‌బ్యాంకింగ్/కార్డు ద్వారా ప్రీమియం చెల్లింపులు చేయొచ్చని ఎల్ఐసీ ప్రకటించింది. రశీదును సైతం పొందొచ్చని పేర్కొంది. కొత్త సదుపాయం ద్వారా పాలసీదారులు ఉన్న చోట నుంచే చెల్లింపులు చేసుకోవడానికి వీలు కల్పిస్తుందని ఎల్ఐసీ ఎండీ, సీఈవో సిద్ధార్థ మహంతి తెలిపారు. ఎల్ఐసీ పోర్టల్‌పై ఇప్పటి వరకు 2.2 కోట్ల మంది పాలసీదారులు రిజిస్టర్ చేసుకుని ఉండగా, వీరందరికీ నూతన సేవ సౌకర్యాన్ని ఇవ్వనుంది.
ఫ్యామిలీ

138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్‌తో
ప్రస్తుత కాలంలో అందర్నీ భయపెడుతున్న సమస్య అధిక బరువు. జీవన శైలి, ఆహార అలవాట్లు, తగినంత శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువు పెరిగిపోతున్నారు. చిన్న వయసులోనే అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అందుకే ఈ బాధలనుంచి విముక్తి పొందేందుకు, స్లిమ్‌గా కనిపించేందుకు భారీ కసరత్తులే చేస్తున్నారు. అంతేకాదు బరువు తగ్గడంతో తాము సాధించిన విజయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. 14 నెలల్లో 63 కిలోలు తగ్గిన మహిళ వెయిట్ లాస్ జర్నీ నెట్టింట వైరల్‌గా మారింది. ఈమె కథ చాలా హైలైట్‌గా నిలిచింది. కొన్ని టిప్స్‌ను కూడా ఇన్‌స్టాలో షేర్ చేసింది. అవేంటో తెలుసుకుందాం ఈ కథనంలో.ఫిట్నెస్ మోడల్ నెస్సీ చుంగత్ వెయిట్ లాస్ జర్నీ చాలా స్ఫూర్తి దాయకంగా నిలుస్తోంది. 138 కిలలో బరువున్న ఆమె కష్టపడి 75 కిలోలకు చేరింది. 2023లో నవంబరులో మొదలు పెట్టి, 2025 జనవరి నాటికి అంటే 14 నెలల్లో ఏకంగా 63 కిలోల బరువు తగ్గించుకుంది. "138 కిలోల నుండి బరువు తగ్గే ప్రయాణం అంత సులభం కాదు" అని నెస్సీ తన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోను 40 లక్షలమంది వీక్షించారు. బరువు తగ్గాలనే స్థిర చిత్తం, వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం, బలమైన సంకల్ప శక్తి ద్వారా 63 కిలోల బరువును తగ్గించుకుంది. "ఇది ఒక మైండ్ గేమ్" అని చెబుతుంది నెస్సీ.‘‘ఇక నేను చేయలేను .. ఆపేస్తా..’’అని చాలాసార్లు అనిపించినా .. ఆమె దివంగత తల్లి ఊబకాయం సంబంధిత ఆరోగ్య సమస్యల కారణంగా బాధపడిన తీరు గుర్తొచ్చి, తన ప్రయత్నాన్ని కొనసాగించింది. తన సొంత అనుభవంతో రూపొందించుకున్న నిబంధనలు, సూత్రాల ద్వారా నెస్సీ తన ఫ్యాట్‌ను తగ్గించుకునే ప్లాన్‌కు కట్టుబడి ఉంది. చివరికి అనుకున్నది సాధించింది.ఇదీ చదవండి: రెండేళ్ల వయసులో అనాథలా ఆశ్రమానికి : కట్ చేస్తే..!మూడంటే..మూడు టిప్స్షుగర్కు చెక్: ముఖ్యంగా మూడే మూడు డైట్ చిట్కాలు పాటించినట్టు నెస్సీ చెప్పుకొచ్చింది. చక్కెరను తగ్గించండి, కానీ ఆనందాన్ని , సంతోషాన్ని కాదు సుమా. రోజువారీ ఆహారం నుంచి చక్కెను పూర్తిగా తొలగించాలి. కానీ వారానికి ఒక కేక్ ముక్క లేదా చిన్న చాక్లెట్ ముక్క తినవచ్చు.ఉదయాన్నే వేడి నీళ్లు : ఉదయం గోరువెచ్చని నీటితో ప్రారంభించాలి. ఇది ఒక చిన్న అడుగే, కానీ జీర్ణక్రియకు మద్దతు ఇస్తుంది. ఇది వెయిట్లాస్కు బాగా ఉపయోగపడుతుంది.చదవండి: వెయిటర్ టు కరోడ్‌పతి: కె.ఆర్. భాస్కర్ ఇన్స్పైరింగ్ జర్నీట్రస్ట్ది ప్రాసెస్: మీరు పాటిస్తున్న పద్ధతిపై విశ్వాసాన్ని కోల్పోకండి. అద్దాన్ని కాదు.. నమ్మేది.. ట్రస్ట్‌ది ప్రాసెస్ మొదలు పెట్టిన తొలినెలలో మార్పు కనిపించకపోతే.. భయపడకండి అంటుంది ఆమె. ఆ నమ్మకమే తనకు బాగా ఉపయోగపడిందని నెస్సీ వెల్లడించింది. తక్షణం వచ్చే ఫలితంపై కాకుండా, నిరాశపడకుండా, దీర్ఘకాలిక లక్ష్యంపై గురి పెట్టి తన శరీర బరువును తగ్గించుకున్న నెస్సీ స్టోరీ నెటిజనులను బాగా ఆకర్షిస్తోంది.నోట్ : బరువు పెరగడం, తగ్గడం అనేది శరీరతత్వం, మన జీవన శైలిపై ఆధారపడి ఉంటుంది. ప్రతి శరీరం భిన్నంగా ఉంటుందనే గమనించాలి. ఆరోగ్య మార్పులు, వ్యాయామం, విశ్వాసం ప్రధాన పోషిస్తాయి. ఏదైనా కొత్త ఆహారం లేదా ఫిట్నెస్ దినచర్యను ప్రారంభించే ముందు వైద్యులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Nessy chungath ❇️🧸🌸 (@call_me_nessykutty)

సౌందర్య చికిత్సలు ఇంత డేంజరా..? పాపం ఆ మహిళ..
ఇటీవల కాలంలో అందంగా, నాజుగ్గా ఉండేందుకే అధిక ప్రాముఖ్యత ఇస్తున్నారు అతివలు. అందుకోసం ఎలాంటి కాస్మెటిక్ సర్జరీలు చేయించుకునేందుకైనా వెనకాడటం లేదు. అలాంటి సౌందర్య చికిత్స చేయించుకునే ఓ మహిళ వేళ్లను కోల్పోయింది. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందన్నట్లుగా.. పాపం ఆ మహిళకు తీవ్ర బాధనే మిగిల్చింది ఆ కాస్మెటిక్ సర్జరీ.అసలేం జరిగిందంటే..తిరువనంతపురం జిల్లా, కజకూట్టం సమీపంలోని తంపురాన్ముక్కులోని కాస్మెటిక్ హాస్పిటల్లో ఈ ఉదంతం చోటుచేసుకుంది. తిరువనంతపురంకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎంఎస్ నీతు రెండు నెలల క్రితం ఫిబ్రవరి 22న క్లినిక్‌లో కాస్మెటిక్ సర్జరీ చేయించుకుంది. ప్రసవం తర్వాత సాధారణంగా పొట్ట ఒదులుగా బెల్లీ పొట్టలా మారుతుంది కొదరికి. ఇక్కడ నీతుకి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవ్వడంతో.. ఉదర కొవ్వు తీయించుకునే కాస్మెటిక్ సర్జరీ లైపోసక్షన్ని చేయించుకుంది. సర్జరీ జరిగిన మరుసటి రోజే నీతూని డిశ్చార్జ్ చేసి పంపించేశారు వైద్యులు. ఆ తర్వాత నుంచి ఆమెకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. ఒకటే తలతిప్పడం..తీవ్ర బలహీనత, నీరసం వంటి సమస్యలు ఉత్ఫన్నమయ్యాయి. వైద్యులను సంప్రదిస్తే..జావా, ఓట్మీల్ వంటివి తీసుకోవాలని సూచించారు. అయితే ఆమె పరిస్థితి మెరుగవ్వక పోగా, అంతకంతకు విషమించడం మొదలైంది. దీంతో హుటాహుటినా సదరు కాస్మెటిక్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆమె పరిస్థితి చూసి..పది యూనిట్ల రక్తం కూడా ఎక్కించారు. అయినా ఆమె పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో..మరొక ఆస్పత్రికి రిఫర్ చేశారు వైద్యులు. అక్కడ వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు వైద్యులు. అక్కడ సుమారు 22 రోజుల అనంతరం కోలుకుంది. నీతు చేయించుకున్న లైపోసక్షన్ తీవ్ర ఇన్ఫెక్షన్ సమస్యలు కలిగించి..పరిస్థితి దిగజారిపోయేలా చేసిందని చెప్పారు వైద్యులు. అంతేగాదు ఆమెకు త్వరితగతిన నయం అయ్యేలా ఎడమ పాదం ఐదు వేళ్లు, ఎడమ చేతి నాలుగు వేళ్లను తొలగించినట్లు తెలిపారు వైద్యులు. దీంతో కుటుంబ సభ్యులు సదరు కాస్మెటిక్సర్జరీ నిర్లక్ష్యం కారణంగానే నీతుకి ఈ పరిస్థితి ఎదురైందంటూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అలాగే ఆమెకు సర్జరీ చేసిన డాక్టర్ షెనాల్ శశాంకన్ను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడం జరిగింది. ఇక విచారణలో సదరు కాస్మెటిక్ ఆస్పత్రి చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండానే ఈ క్లినిక్ నిర్వహిస్తుందని తేలింది. దీంతో ఆ క్లినిక్‌ని మూసివేసేలా నోటీసులు జారీ చేశారు. కాగా, గతంలో కొందరు ఇలాంటి సౌందర్య చికిత్సలు చేయించుకుని ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు చాలానే వెలుగు చూశాయి. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివరాల కోసం వ్యక్తిగత వైద్యులను లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: యుద్ధ చర్య కాదు..! ఆపరేషన్ సిందూర్‌పై పాక్ వ్యక్తి ప్రశంసల జల్లు)

ఐదేళ్ల క్రితమే కల్నల్ సోఫియా ఘనత!
పాకిస్థాన్‌లోని ఉగ్రవాదుల అణచివేతకు భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరు దేశంలో ఎంతగా ప్రాచుర్యంలోకి వచ్చిందో.. ఆ ఆపరేషన్ వివరాలను మీడియాకు వెల్లడిస్తున్న మహిళా సైనికాధికారులు సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్ పేర్లు కూడా అంతగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ముఖ్యంగా కల్నల్ సోఫియా ఖురేషీ గొప్పతనం గురించి ఐదేళ్ల క్రితమే దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రస్తావించింది. సైన్యంలో మహిళా అధికారుల శాశ్వత నియామకానికి (పర్మనెంట్ కమిషన్) సంబంధించిన కేసులో ఈమె ట్రాక్ రికార్డును న్యాయస్థానం ఉదాహరణగా చూపటం విశేషం.ఆడవాళ్లన్న కారణంతో సైన్యంలో పర్మనెంట్ కమిషన్ (పీసీ)కు అనర్హులుగా నిర్ధారించటం చట్టవ్యతిరేకమని 2020 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు (Supreme Court) కీలక తీర్పు ఇచ్చింది. ఆ కేసులో మహిళల పీసీకి వ్యతిరేకంగా సైన్యం, కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లపై నాడు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఎక్సర్సైజ్ ఫోర్స్ 18 పేరుతో భారతదేశం నిర్వహించిన అతిపెద్ద అంతర్జాతీయ మిలిటరీ ఎక్సర్సైజ్లో భారత కంటింజెంట్‌కు న్యాయకత్వం వహించిన మొదటి మహిళ లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషీ (Colonel Sofiya Qureshi).2006లోనే ఆమె కాంగోలో ఐక్యరాజ్యసమితి (United Nations) శాంతి పరిరక్షక దళంలో సేవలందించారు. ఆ సమయంలో కాల్పుల విరమణకు అక్కడి దేశాలను ఒప్పించటంతోపాటు మానవతా సాయంలో కూడా ఆమె కీలకపాత్ర పోషించారు. తన శక్తియుక్తులతో అక్కడ శాంతి సాధనకు కృషిచేశారు. సైన్యంలో పురుషులతోపాటు భుజంభుజం కలిపి పనిచేస్తున్న మహిళలకు.. వారి శరీర నిర్మాణాన్ని సాకుగా చూపి పీసీకి అనర్హులుగా ప్రకటించటం సరికాదు’ అని సుప్రీంకోర్టు నాటి తీర్పులో పేర్కొంది.చదవండి: అది ఇల్లు కాదు.. చిన్నపాటి సైనిక శిబిరం!

భారత్ చేసింది న్యాయం..! పాక్ వ్యక్తి ప్రశంసల జల్లు
పహల్గాం ఘటనకు ప్రతిగా భారత్ బుధవారం ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసిన సంగతి తెలిసింది. దీనిపై యావత్ దేశం హర్షం వ్యక్తం చేసింది. అయితే ఈ నేపథ్యంలో భారత్-పాక్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పూర్తిస్థాయిలో ఇరు దేశాలు యుద్ధం దిశగా కదులుతున్నాయి. ఈ తరుణంలో నెట్టింట ఒక పాక్ వ్యక్తి భారత్ చేసింది న్యాయమే అంటూ పోస్ట్ చేసిన వైరల్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అందులోనూ ఇలాంటి సమయంలో శత్రు దేశానికి చెందిన వ్యక్తే ఇలా మాట్లాడటం నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. ఆ వీడియోలో దుబాయ్‌కి చెందిన ఫారెక్స్ వ్యాపారి అభయ్ భారత్ సిందూర్ ఆపరేషన్‌తో పాక్‌పై చేసిన దాడిని సరైదని, అది న్యాయం అని మాట్లాడారు. అంతేగాదు భారత ప్రభుత్వం చర్యను, భారత సాయుధ దళాల ప్రతిస్పందనను మెచ్చకున్నాడు. ఇప్పుడు పాక్ వరకు వచ్చేటప్పటికీ తామూ బాధితులమే అని డ్రామా ప్లే చేస్తోందని ఆరోపించాడు. పహల్గాం పర్యటనకు వచ్చిన 26 మంది అమాయకులను పొట్టనపెట్టుకున్నప్పుడూ ఏమైంది ఇదంతా అని నిలదీశాడు. ఇప్పుడు అకస్మాత్తుగా శాంతి, మానవహక్కులు అంటూ నీతి కబర్లు చెప్పడమే గాక పాక్ కూడా ఉగ్రవాద బాధిత దేశమే అని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది అని తిట్టిపోశాడు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా స్పందించే హక్కు భారత్‌కి పూర్తిగా ఉందన్నారు. అలాగే భారత్ చేసింది న్యాయమే అని ప్రశంసించాడు. అసలు ఉగ్రవాదాన్ని పెంచి పోషించినప్పుడూ తెలియలేదా పాక్‌కి ఇది ఎప్పటికైనా నష్టమే అని అంటూ ఫైర్ అయ్యాడు. ప్రజలు మరణించగానే శాంతి అనడం కాదు..భారత్ మొదటి నుంచి సంయమనం పాటిస్తూ..శాంతికి పీటవేస్తూ వచ్చిందనేది గుర్తులేదా అని మండిపడ్డారు. అంతేగాదు భారత్ చేసింది యుద్ధ చర్య కాదు..కేవలం అది న్యాయం.. అనినొక్కి చెప్పాడు అభయ్ వీడియోలో. పైగా ఆ వీడియోకి ఒక పాకిస్తానీ హిందువుగా నా అభిప్రాయం అనే క్యాప్షన్ కూడా ఇచ్చాడు. దీనిపై నెటిజన్లు సదరు పాక్ వ్యక్తిని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Abhay (@abhayy_s)source: Live Mint english website ఆధారంగా..(చదవండి: '54 ఏళ్ల నాటి యుద్ధ ప్రసంగం'..! ఇప్పటికీ హృదయాన్ని తాకేలా..)
ఫొటోలు


పాకిస్తాన్‌తో పోరులో దేశ సేవకు అమరుడైన మురళీ నాయక్ (ఫొటోలు)


‘#సింగిల్’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)


అత్యంత వైభవంగా తిరుపతి గంగమ్మ తల్లి జాతర (ఫొటోలు)


హైదరాబాద్ : మిస్ వరల్డ్ పోటీలకు అంతా సిద్ధం (ఫొటోలు)


HIT3 సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)


భారత సైన్యానికి మద్దతుగా.. (ఫొటోలు)


ట్రెడిషనల్ + వెస్ట్రన్... లాపతా లేడీ సరికొత్త స్లైల్ (ఫొటోలు)


ఫ్రెండ్ పెళ్లిలో ఒకప్పటి హీరోయిన్ మీనా సందడి (ఫొటోలు)


హీరోయిన్ సోనమ్ కపూర్ పెళ్లి రోజు.. భర్తతో ఇలా (ఫొటోలు)


తమిళ సినీ నిర్మాత కూతురి పెళ్లిలో ప్రముఖులు (ఫోటోలు)
అంతర్జాతీయం

మన రక్షణ వ్యవస్థను భారత్ తునాతునకలు చేసింది: పాక్ రక్షణమంత్రి
లాహోర్, కరాచీ, రావల్పిండితో సహా పలు ప్రాంతాలకు భారతదేశం పంపిన 25 డ్రోన్లను పాకిస్తాన్ అడ్డుకట్టవేయలేకపోయిందన్నారు రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్. తమ దళాలు అడ్డగించి కూల్చివేసాయని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించిన ఒక రోజు తర్వాత.. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఆసిఫ్ పార్లమెంటులో ప్రసంగిస్తూ.. భారత డ్రోన్లను పాక్ అడ్డుకోలేకపోయిందంటూ క్లారిటీ ఇచ్చారు. ‘మన ఎయిర్ డిఫన్స్ వ్యవస్థ విఫలమైంది. పాక్ రక్షణ వ్యవస్థను భారత్ తునాతునకలు చేసింది. మన రక్షణ విభాగం పూర్తిగా విఫలమైంది. ఇంతకు మించి ఇంకేమీ చెప్పలేను. గోప్యత పాటించాల్సిన కారణంగా ఇంకా వివరణ ఇవ్వలేను’ అని పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేశారు. దీనిపై పాక్ ప్రతిపక్ష ఎంపీలు(పీటీఐ పార్టీకి చెందిన వారు) ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుత పాకిస్తాన్ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం అంటూ ధ్వజమెత్తారు. ఇదిలా ఉంచితే, ప్రస్తుతం పాకిస్తాన్ అన్ని రకాలుగా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఒక్క పక్క భారత ఆర్మీదాడులతో పాక్ బెంబేలెత్తిపోతుండగా.. మరో పక్క బీఎల్ఏ దాడులతో ఊపిరి తీసుకోలేని పరిస్థితికి చేరుకుంది. తెహ్రిక్‌ఇ-తాలిబన్ దాడుల్లో 20 మంది పాక్ సైనికులు హతమయ్యారు.పాక్ ప్రధానిని ఆ దేశ ఎంపీలు టార్గెట్ చేశారు. పాక్ పార్లమెంట్ సాక్షిగా ప్రధాని షెహబాజ్‌పై విమర్శలు గుప్పించారు. షెహబాజ్ పిరికిపంద అంటూ పాక్ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.భారత సైన్యం దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తాన్లో సామాన్యులతో పాటు చట్టసభల సభ్యులు కూడా బెంబేలెత్తిపోతున్నారు. సైనిక రిటైర్డ్ మేజర్, సీనియర్ ఎంపీ అయిన తాహిర్ ఇక్బాల్ ఆ దేశ పార్లమెంటులోనే ఏకంగా ఏడ్చేశారు. అధికార పార్టీ ఎంపీ అయిన ఇక్బాల్.. పార్లమెంటులో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, ఇస్లామాబాద్‌లోని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ ఇంటి సమీపంలో భారత్ దాడులకు దిగింది. దీంతో తన నివాసం నుంచి పాక్ ప్రధాని పరారైనట్లు సమాచారం.“We didn’t intercept Indian drones as it would have given away our defence positions”This isn’t parody, this is scene from Pakistani parliamentPakistani parliament is funnier than parody 😹 pic.twitter.com/7zWbzXzyKA— BALA (@erbmjha) May 9, 2025 “We didn’t intercept Indian drones as it would have given away our defence positions”This isn’t parody, this is scene from Pakistani parliamentPakistani parliament is funnier than parody 😹 pic.twitter.com/7zWbzXzyKA— BALA (@erbmjha) May 9, 2025

భారత్-పాక్ యుద్ధంపై చైనా రియాక్షన్
భారత్-పాక్ యుద్ధంపై చైనా స్పందించింది. ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్థాన్‌ల మధ్య జరుగుతున్న సైనిక దళాల ఘర్షణపై చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి లిన్ జియాన్ మాట్లాడుతూ.. భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా కానీ చైనా వ్యతిరేకిస్తుందంటూ ఆయన స్పష్టం చేశారు.పొరుగు దేశాలైన భారత్-పాక్ అంతర్జాతీయ చట్టాలను పాటిస్తూ.. శాంతి, స్థిరత్వం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే చర్యలకు పాల్పడకుండా సంయమనం పాటించాలని కోరారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి.. అంతర్జాతీయ సమాజంతో కలిసి.. నిర్మాణాత్మక పాత్ర పోషించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు.కాగా, భారత్–పాకిస్తాన్ మధ్య ఘర్షణలు పూర్తిగా ఆగిపోవాలని కోరుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించిన సంగతి తెలిసిందే. ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరారు. కుక్కకాటుకు చెప్పుదెబ్బ అన్నట్టుగా భారత్–పాక్ మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయని వెల్లడించారు. మొదట ఉగ్రవాదులు దాడి చేశారు కాబట్టి తర్వాత భారత సైన్యం ప్రతిదాడి చేసిందని పరోక్షంగా అంగీకరించారు.ఇప్పటిదాకా జరిగింది చాలు, ఇకనైనా ఘర్షణలకు తెరదించాలని భారత్, పాక్‌లకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో తన వంతు సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నానని సూచించారు. భారత్, పాక్ మధ్య శాంతి కోసం తాను చేయగలిగినదంతా చేస్తానని ప్రకటించారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం వైట్‌హౌస్ ఓవల్ ఆఫీసులో ట్రంప్ ఓ కార్యక్రమంలో మాట్లాడారు. తన విజ్ఞప్తిని మన్నించి దాడులకు తెరదించాలని భారత్, పాక్‌లకు సూచించారు.

పాకిస్థాన్‌కు ఆర్థిక సంకెళ్లు?
ఢిల్లీ: పాకిస్తాన్ బెయిల్ ఔట్ ప్యాకేజీపై అంతర్జాతీయ ద్రవ్య నిధి బోర్డు (IMF) ఆలోచనలో పడింది.. 1.3 బిలియన్ డాలర్ల అప్పు ఇవ్వాలా ? వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకోనుంది. కాసేపట్లో ఐఎంఎఫ్ సమావేశం కానుంది. పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ అప్పు ఇవొద్దని భారత్ కోరుతోంది. పాకిస్థాన్‌కు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ అవుట్ ప్యాకేజ్ నిధులు విడుదల చేయవద్దని భారత డిమాండ్ చేస్తోంది.పాకిస్థాన్‌కు నిధులు విడుదల చేస్తే అవి ఉగ్రవాదులకు చేరుతాయని భారత్ స్పష్టం చేసింది. ఉగ్ర స్థావరాలను ఏర్పాటు చేసి భారత్‌పైకి ఎగదోస్తున్న పాకిస్థాన్‌ను అంతర్జాతీయంగా ఏకాకి చేయడమనే లక్ష్యంగా ఇండియా పావులు కదుపుతోంది. మరో వైపు, పాకిస్థాన్ ఐఎంఎఫ్ నుంచి తీసుకున్న నిధులను దారి మళ్లిస్తున్నట్టు తగిన ఆధారాలను కూడా భారత్ సమర్పించిన సంగతి తెలిసిందే.కాగా, ఆపరేషన్ సిందూర్ దాడిలో హతమైన ఉగ్రవాదులకు పాకిస్థాన్ సైన్యం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించటంపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇలాంటి పనులు ఆ దేశానికి అలవాటుగా మారాయని మండిపడింది. ఆపరేషన్ సిందూర్‌పై గురువారం ఢిల్లీలో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ.. పాక్‌లో లష్కరే తోయిబా ఉగ్రవాది నాయకత్వంలో ఆ దేశ సైన్యం, పోలీసులు ఉగ్రవాదుల మృతదేహాలకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్న ఫొటోలను ప్రదర్శించారు.ఇలాంటి చర్యలతో పాకిస్తాన్ ఏం సందేశం ఇవ్వాలనుకుంటోందని ప్రశ్నించారు. భారత్ దాడుల్లో సాధారణ పౌరులు మరణించారన్న పాకిస్తాన్ ప్రకటనను ఖండించారు. ‘దాడుల్లో నిజంగా సామాన్య పౌరులే మరణిస్తే.. మరి ఈ ఫొటోలో ఉన్నదేమిటి? సామాన్యుల మృతదేహాలను శవపేటికల్లో పెట్టి.. వాటిపై పాకిస్తాన్ జాతీయ జెండాలు కప్పి, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారా?’అని ఆశ్చర్యం వ్యక్తంచేశారు.తమ దాడుల్లో చనిపోయినవాళ్లంతా ఉగ్రవాదులేనని స్పష్టంచేశారు. ‘ఉగ్రవాదంతో మలినమైన చేతులను కడుక్కొనేందుకు పాకిస్తాన్ ప్రయతి్నస్తోంది. పాకిస్తాన్లో ఉగ్రవాదులే లేరని ఆ దేశ సమాచార శాఖ మంత్రి ఓ టీవీ చర్చలో ప్రకటించారు. కానీ, ఆ చర్చలోనే ఆయన తన ప్రకటనకు గట్టి సవాలు ఎదుర్కొన్నారు. ఉగ్రవాదానికి పాకిస్తానే కేంద్ర స్థానమని అనేక సందర్భాల్లో నిరూపణ అయ్యింది. ఇందుకు సంబంధించిన ఆధారాలు భారత్‌తోపాటు అనేక దేశాల వద్ద ఉన్నాయి’అని మిస్రీ పేర్కొన్నారు.

పాకిస్తాన్ పుట్టినప్పటి నుంచీ అబద్ధాలే..
న్యూఢిల్లీ: పాకిస్తాన్లో ఉగ్రవాదుల శిబిరా లు, వారి మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయాలన్న ఏకైక లక్ష్యంతోనే ఆపరేషన్ సిందూర్ చేపట్టినట్లు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రీ తేల్చిచెప్పారు. భారత్‌కు వ్యతిరేకంగా ముష్కర మూకలకు పాకిస్తాన్ నిస్సిగ్గుగా మద్దతిస్తోందని, ఈ విషయం ప్రపంచం మొత్తానికి తెలుసని చెప్పారు.పాకిస్తాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లో టెర్రరిస్టు క్యాంపులపై జరిగిన దాడికి మతం రంగు పులుముతోందని పాక్ ప్రభుత్వంపై మండిపడ్డారు. పుట్టినప్పటి నుంచి పాకిస్తాన్ అబద్ధాలే చెబుతోందని విమర్శించారు. 1947 నుంచి పాకిస్తాన్ అబద్ధాలు వినడం అందరికీ అలవాటైపోయిందని అన్నారు. విక్రం మిస్రీ గురువారం ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడా రు. పాకిస్తాన్ తీరుపై విరుచుకుపడ్డారు.‘‘1947లో పాకిస్తాన్ సైన్యం జమ్మూకశ్మీర్‌పై దాడికి దిగింది. కానీ, ఆ దాడితో సంబంధం లేదంటూ ఐక్యరాజ్యసమితికి అబద్ధాలు చెప్పింది. కేవలం గిజరినులే జమ్మూకశ్మీర్‌లోకి చొరబడ్డారని నమ్మబలికింది. భారత సైన్యం, ఐరాస బృందం అక్కడికి చేరుకుంటే అసలు సంగతి తెలిసింది. చివరకు చేసేది లేక తమ సైన్యమే జమ్మూకశ్మీర్‌పై దాడి చేసినట్లు పాకిస్తాన్ అంగీకరించింది.పాకిస్తాన్ అబద్ధాల ప్రయాణం 75 ఏళ్ల క్రితమే మొదలైంది కాబట్టి ఇది మాకు ఆశ్చర్యం కలిగించడం లేదు. పహల్గాంపై పాక్ అలాంటి అబద్ధాలే చెబుతోంది. తప్పుడు ప్రచారంతో నమ్మించాలని చూస్తోంది. ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న భారత యుద్ధ విమానాలను కూల్చేశామంటూ అబద్ధాలు ప్రచారం చేస్తోంది. పుట్టుక నుంచే అబద్ధాలు మొదలు పెట్టిన పాకిస్తాన్‌ను నమ్మాల్సిన అవసరం లేదు. మసీదులపై భారత్ సైన్యం దాడి చేయలేదు భారత్‌కు చెందిన 15 సైనిక స్థావరాలపై దాడిచేసేందుకు పాక్ ప్రయత్నించగా భారత సైన్యం సమర్థంగా అడ్డుకుంది. భారత్‌ను ఎదుర్కొనే సత్తా లేని పాకిస్తాన్ మత ఉద్రిక్తతలు సృష్టించడానికి కుట్రలు పన్నుతోంది. ప్రజలను రెచ్చగొట్టడానికి మతంకార్డు వాడుతోంది. జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌లో సిక్కు మతస్తులే లక్ష్యంగా పాక్ సైన్యం దాడులు చేసింది. గురుద్వారాతోపాటు సిక్కు ఇళ్లపై దాడికి దిగింది. ఈ దాడుల్లో 16 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు.మసీదులపై భారత సైన్యం దాడి చేసిందంటూ పాక్ చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. ఉగ్రవాదుల క్యాంపులే ఇండియన్ ఆర్మీ లక్ష్యం. నిజానికి ఉగ్రవాదులకు మసీదుల్లో ఆశ్రయం కల్పించింది పాకిస్తానే. మసీదులను రక్షణగా వాడుకోవడం నిజం కాదా? ఆపరేషన్ సిందూర్‌లో మరణించిన ఉగ్రవాదులకు పాక్ ప్రభుత్వం అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించడం దారుణం. పహల్గాంలో పర్యాటకుల మతం అడిగి మరీ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.భారత్‌లో పాక్ ఆటలు సాగవు. ఇక్కడ మతం పేరిట రెచ్చగొట్టాలని చూస్తే ఎవరూ రెచ్చిపోరు. పహల్గాంలో ఉగ్రదాడిని మతాలకు అతీతంగా భారతీయులంతా ఖండించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని నీలం–జీలం ప్రాజెక్టును ఇండియా టార్గెట్ చేసిందంటూ పాకిస్తాన్ చేసిన ఆరోపణలను ఖండిస్తున్నాం. ఈ సాకుతో ఇండియాలోని మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తే జరగబోయే పరిణామాలకు పాకిస్తానే బాధ్యత వహించాలి’’అని విక్రం మిస్రీ స్పష్టంచేశారు. ఉగ్రవాదులకు అధికారిక అంత్యక్రియలా? ఆపరేషన్ సిందూర్ దాడిలో హతమైన ఉగ్రవాదులకు పాకిస్తాన్ సైన్యం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించటంపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇలాంటి పనులు ఆ దేశానికి అలవాటుగా మారాయని మండిపడింది. ఆపరేషన్ సిందూర్‌పై గురువారం ఢిల్లీలో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ.. పాక్‌లో లష్కరే తోయిబా ఉగ్రవాది నాయకత్వంలో ఆ దేశ సైన్యం, పోలీసులు ఉగ్రవాదుల మృతదేహాలకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్న ఫొటోలను ప్రదర్శించారు.ఇలాంటి చర్యలతో పాకిస్తాన్ ఏం సందేశం ఇవ్వాలనుకుంటోందని ప్రశ్నించారు. భారత్ దాడుల్లో సాధారణ పౌరులు మరణించారన్న పాకిస్తాన్ ప్రకటనను ఖండించారు. ‘దాడుల్లో నిజంగా సామాన్య పౌరులే మరణిస్తే.. మరి ఈ ఫొటోలో ఉన్నదేమిటి? సామాన్యుల మృతదేహాలను శవపేటికల్లో పెట్టి.. వాటిపై పాకిస్తాన్ జాతీయ జెండాలు కప్పి, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారా?’అని ఆశ్చర్యం వ్యక్తంచేశారు. తమ దాడుల్లో చనిపోయినవాళ్లంతా ఉగ్రవాదులేనని స్పష్టంచేశారు.‘ఉగ్రవాదంతో మలినమైన చేతులను కడుక్కొనేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్లో ఉగ్రవాదులే లేరని ఆ దేశ సమాచార శాఖ మంత్రి ఓ టీవీ చర్చలో ప్రకటించారు. కానీ, ఆ చర్చలోనే ఆయన తన ప్రకటనకు గట్టి సవాలు ఎదుర్కొన్నారు. ఉగ్రవాదానికి పాకిస్తానే కేంద్ర స్థానమని అనేక సందర్భాల్లో నిరూపణ అయ్యింది. ఇందుకు సంబంధించిన ఆధారాలు భారత్‌తోపాటు అనేక దేశాల వద్ద ఉన్నాయి’అని మిస్రీ పేర్కొన్నారు.
జాతీయం

మహిళా సైనికాధికారుల సేవలను ఉపయోగించుకోవాలి
న్యూఢిల్లీ: షార్ట్ సర్విసు కమిషన్(ఎస్ఎస్సీ)కు సంబంధించిన మహిళా సైనికాధికారులను విధుల నుంచి తప్పించకూడదని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం పాకిస్తాన్‌తో ఘర్షణ నెలకొన్న నేపథ్యంలో వారికి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరించకూడదని సూచించింది. ఇలాంటి సమయంలో వారి సేవలు ఉపయోగించుకోవాలని, వారికి అండగా నిలవాలని స్పష్టంచేసింది. తమకు శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ 69 మంది మహిళా సైనికాధికారులకు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శాశ్వత కమిషన్ ఏర్పాటు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు క్రమశిక్షణా చర్యల కింద పిటిషనర్లను విధుల నుంచి రిలీవ్ చేసేందుకు కేంద్రం సన్నద్ధమైంది. ఈ తరుణంలో ఈ పిటిషన్లపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. శక్తిసామర్థ్యలు కలిగిన మహిళల సేవలను చక్కగా వాడుకోవాలని కేంద్రానికి సూచించింది.

జనాభా ఆధారిత పునర్విభజనతో దక్షిణాదికి అన్యాయమే
న్యూఢిల్లీ: జనాభా గణాంకాల ఆధారంగా పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న వాదనను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి.నాగరత్న పరోక్షంగా సమరి్థంచారు. ఈ విషయంలో దక్షిణ భారత ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నట్లు గుర్తుచేశారు. సరోగసీ(క్రమబదీ్ధకరణ) చట్టానికి సంబంధించిన దాఖలైన పిటిషన్లపై న్యాయమూర్తులు జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ సతీష్‌చంద్ర శర్మతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. సరోగసీ ద్వారా రెండో సంతానం పొందడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఓ జంట ఈ పిటిషన్లు దాఖలు చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ బి.వి.నాగరత్న స్పందిస్తూ... ‘‘దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గిపోతోంది. కుటుంబాలు కుదించుకుపోతున్నాయి. జననాల సంఖ్య నానాటికీ పడిపోతోంది. దక్షిణాదికి భిన్నంగా ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరిగిపోతోంది. పిల్లలను కంటూనే ఉన్నారు. జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేస్తే తమకు అన్యాయం జరుగుతుందని దక్షిణాది ప్రజలకు భావిస్తున్నారు. పార్లమెంట్లో ఉత్తరాది ప్రాధాన్యం మరింత పెరుగుతుందని, దక్షిణాది వాటా తగ్గిపోతుందని ఆందోళన చెందుతున్నారు’’అని వివరించారు. ఇప్పటికే ఒక బిడ్డ ఉండగా, మరో బిడ్డ కోసం ఎందుకు ప్రయతి్నస్తున్నారని పిటిషనర్లను ప్రశ్నించారు. జనాభా తగ్గుదల వల్ల చైనాలో ఎన్నో ప్రతికూల పరిణామాలు సంభవిస్తున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది చెప్పారు. అలాంటి పరిస్థితి మన దేశంలో రాదని జస్టిస్ నాగరత్న స్పష్టంచేశారు. ఉత్తరాదిలో జనాభా విపరీతంగా పెరుగుతోందని వెల్లడించారు. దేశ ప్రయోజనాల కోసం ఒక్క బిడ్డతో సరిపెట్టుకోవచ్చు కదా! అని పిటిషనర్లకు సూచించారు. విచారణను వాయిదా వేశారు.

పిటిషన్ల డ్రాఫ్టింగ్ సూటిగా ఉండాలి
న్యూఢిల్లీ: న్యాయ విచారణలో ప్రక్రియలో సంక్షిప్తంగా, సూటిగా ఉండే పిటిషన్ల అవసరం ఎంతో ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నొక్కిచెప్పారు. డ్రాఫ్టింగ్ కళపై పట్టు సాధించేందుకు ఎంతో కృషి చేయాల్సి ఉంటుందని తెలిపారు. పిటిషన్లు స్పష్టంగా సంక్షిప్తంగా ఉండటం లాయర్లేకాదు, జడ్జీలకు కూడా ప్రయోజనకరమని చెప్పారు. ఈ నెల 13వ తేదీన పదవీ విరమణ చేయనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా శుక్రవారం తనకు సుప్రీంకోర్టు అడ్వొకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్(ఎస్సీఏవోఆర్ఏ) ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో మాట్లాడారు. 14వ తేదీన సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ బీఆర్ గవాయ్ కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. సీజేఐ జస్టిస్ ఖన్నా తన పదవీ కాలంలో పారదర్శకతను, సమ్మిళితత్వాన్ని తీసుకువచ్చారని ప్రశంసించారు. సుప్రీంకోర్టులో ఆడ్వొకేట్స్ ఆన్ రికార్డు ఎంతో కీలకమైన వారని, అత్యున్నత న్యాయస్థానానికే కాదు, దేశంలోని పౌరులందరికీ ప్రతినిధులంటూ జస్టిస్ సంజీవ్ ఖన్నా కొనియాడారు. అయితే, తక్కువ మాటల్లో ఎక్కువ విషయాన్ని చెప్పగలిగే డ్రాఫ్టింగ్ కళపై పట్టు సాధించలేకపోవడం ఇంకా తనకు లోటుగానే అనిపిస్తోందని చెప్పారు. క్లుప్లంగా ఉండే ఫైళ్లను చదవడం కూడా చాలా తేలికని చెప్పారు. ఫైల్ చదివిన తర్వాత ఆకేసుపై సగం వరకు పట్టు దొరుకుతుందని జస్టిస్ ఖన్నా అన్నారు. సీనియర్లపై ఆధారపడకుండా కోర్టుల్లో కేసులను వాదించాలని న్యాయవాదులకు సూచించారు. ‘కక్షి దారులతో మాట్లాడేది మీరు. కక్షిదారులు మాట్లాడేది కూడా మీతోనే. నోట్స్ తయారు చేసేదీ మీరే. ఆ సారాంశాన్ని సీనియర్లకు వివరిస్తారు. కోర్టులో మీరే ఎందుకు వాదించరు?’అని జస్టిస్ ఖన్నా తెలిపారు. సంబంధిత విషయ పరిజ్ఞానం కలిగి ఉండటం లాయర్లకు ఎంతో ముఖ్యమైన విషయమని చెప్పారు. సుప్రీంకోర్టు కాకున్నా, మిగతా కోర్టుల్లో కేసుల పరిష్కారంలో మధ్యవర్తిత్వం ప్రస్తుతం ముఖ్యమైన విధానంగా మారిందని ఆయన పేర్కొన్నారు. ఆన్లైన్ మీడియేషన్ ట్రెయినింగ్ కోర్సుకు ఎంతో ఆదరణ లభిస్తోందని వివరించారు. దీని వల్ల అమూల్యమైన సమయం ఆదా అవుతుందని తెలిపారు. రిటైరయ్యాక సాయం కావాల్సిన వారు మొహమాటం లేకుండా తన వద్దకు రావచ్చని, సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని పిలుపునిచ్చారు.

ఉద్రిక్తతల వల్ల పాకిస్తాన్‌కే నష్టం
జమ్మూ: సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలు కొనసాగడం పాకిస్తాన్నే దెబ్బతీస్తుందని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఉద్రిక్తతలు తగ్గించడంపై దృష్టి పెట్టాలని పాక్‌కు సూచించారు. లేదంటే వారికి ఎక్కువ నష్టమని హెచ్చరించారు. గురువారం రాత్రి పాకిస్తాన్ చేసిన దాడుల్లో ఒక్క డ్రోన్ కూడా లక్ష్యాన్ని చేరుకోకుండా వేగంగా స్పందించిన సాయుధ దళాలను ఒమర్ ప్రశంసించారు. జమ్మూ, సాంబా జిల్లాల్లోని సహాయ శిబిరాలను, సరిహద్దు రేఖ వెంబడి పాక్ షెల్లింగ్‌లో గాయపడిన వారున్న ఆసుపత్రులను సందర్శించిన సీఎం.. విజయ్‌పూర్‌లో మీడియాతో మాట్లాడారు. ‘‘1971 యుద్ధం పాక్ చేసిన అత్యంత తీవ్రమైన దాడులివే.. జమ్మూలోని పలు ప్రాంతాలు, అనంత్‌నాగ్‌లోని మందుగుండు సామగ్రి డిపోను లక్ష్యంగా చేసుకున్నారు. కానీ వారి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలు కొనసాగడం పాక్‌ను దెబ్బతీస్తుంది. దీనివల్ల పాకిస్తాన్‌కు ఒరిగేదేమీ లేదు. ఆ దేశం విజయం సాధించలేదు. కాబట్టి వారు తుపాకులను పక్కన పెట్టి సాధారణ స్థితిని తీసుకురావడానికి సహకరిస్తే మంచిది. గురువారం రాత్రి తరువాత జరిగిన సంఘటనలు ఉద్రిక్తతను పెంచే ప్రయత్నాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. దీనివల్ల వారే ఎక్కువగా బాధపడతారు’’అని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. పూంచ్‌లో పరిస్థితి క్లిష్టంగా ఉంది పాక్ షెల్లింగ్ వల్ల పూంచ్ నగరానికి భారీ నష్టం వాటిల్లిందని, పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మృతులు, క్షతగాత్రుల్లో ఎక్కువ మంది అక్కడి వారేనన్నారు. తాను జమ్మూలోని ఆస్పత్రిని సందర్శించానని, గాయాలతో అక్కడ అడ్మిడ్ అయిన వారంతా పూంచ్‌కు చెందిన వారేనని చెప్పారు. తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తిని శస్త్రచికిత్స కోసం పీజీఐ చండీగఢ్‌కు తరలించామన్నారు. జమ్మూ జిల్లాలోని మిష్రివాలా, నాగ్బానీ, కోట్ భల్వాల్, సాంబాలోని విజయపూర్ పునరావాస శిబిరాలను సందర్శించిన ఆయన నిర్వాసిత కుటుంబాలతో మాట్లాడి, వారికి ప్రభుత్వ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. శిబిరాల్లో అసౌకర్యాన్ని తగ్గించడానికి కృషి చేస్తానని చెప్పారు. ఆట సామగ్రి కావాలని అడిగిన పిల్లలకు.. తన సొంత వాహనంలో తెచ్చి అప్పగించిన మంత్రికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. జమ్మూలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉన్న క్షతగాత్రులను కూడా పరామర్శించారు.
ఎన్ఆర్ఐ

వైట్‌హౌస్‌లో కోనసీమ వాసికి కీలక బాధ్యత
ఐ.పోలవరం: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ కేంద్రంగా పనిచేసే సైబర్ సెక్యూరిటీ, మౌలిక సదుపాయాల భద్రతా సంస్థకు డిప్యూటీ డైరెక్టర్ (డీడీ)గా తెలుగు వ్యక్తి డాక్టర్ గొట్టుముక్కల మధు (Gottumukkala Madhu) నియమితులయ్యారు. మధు తల్లిదండ్రులు గొట్టుముక్కల వెంకట సూర్య సత్యనారాయణరాజు (కొండరాజు), సత్యవాణి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం కేశనకుర్రు (Kesanakurru) గ్రామానికి చెందినవారు. మధు కాకినాడలో ఇంటర్ చదువుకొని ఏలూరులో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అమెరికాలోని టెక్సాస్‌లో ఎంఎస్, ఎంబీఏ చేశారు. మోటోరోలా, శాంసంగ్ కంపెనీల్లో పనిచేశారు. ప్రస్తుతం అమెరికన్ సైబర్ సెక్యూరిటీ విభాగం (CISA)లో డిప్యూటీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.చదవండి: అమరావతి ఐకానిక్.. అమాంతం పెరిగిన ఐదు ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయం

సలహా కమిటీ అడుగులు ముందుకు..
మోర్తాడ్ (బాల్కొండ): తెలంగాణ ప్రవాసీ విధానం (ఎన్ఆర్ఐ పాలసీ) రూపకల్పన, గల్ఫ్ బోర్డు ఏర్పాటు కోసం నిర్దేశించిన గల్ఫ్ సలహా కమిటీ అడుగులు ముందుకు పడ్డాయి. సలహా కమిటీ బాధ్యతలను స్వీకరించిన వారం రోజులలోనే యూఏఈలో ఒక దుర్ఘటన చోటు చేసుకోవడం, ఈ అంశంలో కమిటీ సభ్యులు వేగంగా స్పందించి మృతదేహాలను స్వదేశానికి తెప్పించడంతో బాధిత కుటుంబాలకు ఊరట లభించింది.యూఏఈలోని ఆల్‌కూజ్ ప్రాంతంలోని బేకరీలో పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి చేతిలో నిర్మల్ జిల్లా సోన్‌కు చెందిన ప్రేమ్‌సాగర్, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమన్నపేట్‌కు చెందిన స్వర్గం శ్రీనివాస్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈనెల 11న వీరు హత్యకు గురి కాగా వారం రోజుల వ్యవధిలోనే మృతదేహాలను స్వదేశానికి తెప్పించారు. ఇందులో సలహా కమిటీ కీలకపాత్ర పోషించింది. గల్ఫ్ సలహా కమిటీ చైర్మన్ వినోద్‌కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, ఇతర సభ్యులు ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారులతో యూఏఈ ఘటనపై చర్చించారు. సీఎంవో నుంచి కేంద్ర ప్రభుత్వానికి, విదేశాంగ శాఖకు సమాచారం అందించడంతో వారం రోజులలోనే మృతదేహాలను స్వదేశానికి తీసుకురాగలిగారు. గతంలో గల్ఫ్‌లో ఎవరైనా మరణిస్తే మృతదేహం ఇంటికి రావడానికి నెల రోజుల వరకు సమయం పట్టేది. బాధిత కుటుంబాలకు భరోసా యూఏఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. సలహా కమిటీ విజ్ఞప్తి మేరకు బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. హత్యకు గురైన వ్యక్తుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ విధానంలో ఏదైనా ప్రభుత్వ శాఖలో ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. గల్ఫ్ భరోసా కింద రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.అంత్యక్రియలకు ప్రభుత్వ సాయం స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు జగిత్యాల జిల్లా కలెక్టర్ రూ.15 వేల ఆర్థికసాయం మంజూరుచేశారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా మరణిస్తే వారి అంతిమ సంస్కారాలకు మాత్రమే ప్రభుత్వ సాయం అందుతుంది. గల్ఫ్‌లో హత్యకు గురైన ఘటనను మానవతా దృక్పథంతో పరిగణనలోకి తీసుకున్న జగిత్యాల జిల్లా (Jagtial District) కలెక్టర్ సత్యప్రసాద్ తన విచక్షణాధికారాలను ఉపయోగించుకుని స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించారు.చదవండి: స్మిత సబర్వాల్ ధిక్కార స్వరం!శనివారం జరిగిన శ్రీనివాస్ అంతిమ యాత్రలో ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పాల్గొని పాడె మోశారు. ఆయన కూడా సొంతంగా రూ.10 వేల సాయం అందించారు. ఇద్దరు మృతుల ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రకటించారు. సలహా కమిటీ ఏర్పడిన వెంటనే గల్ఫ్ ప్రవాసులకు ప్రయోజనం కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంపై గల్ఫ్ కార్మిక కుటుంబాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాయి.

టంపాలో నాట్స్ సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లు
ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అమెరికాలో అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల నిర్వహణ కోసం కసరత్తు ముమ్మరంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లను టంపాలో నాట్స్ నిర్వహించింది. మొత్తం 12 వాలీబాల్ జట్లు, 5 మహిళా త్రోబాల్ జట్లు, 350 మందికిప గా తెలుగు క్రీడాకారులు ఈ టోర్నమెంట్లతో తమ ప్రతిభను చాటేందుకు పోటీ పడ్డారు. క్రీడాకారులను ప్రోత్సాహించేందుకు వారి కుటుంబ సభ్యులు కూడా రావడంతో క్రీడా ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. మహిళల త్రోబాల్ టోర్నమెంట్లో మొదటి బహుమతిని సన్‌షైనర్స్ జట్టు కైవసం చేసుకుంది. పురుషుల వాలీబాల్ టోర్నమెంట్ ఛాంపియన్లుగా డైనమిక్ రచ్చ జట్టుగా నిలిచింది. టోర్నమెంట్ విజేతలకు బహుమతులు జూలై 4 నుండి 6 వరకు జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో బహుమతులు పంపిణి చేయనున్నారు. నాట్స్ కమ్యూనిటీ సేవల బృందం నుండి రంజిత్ పాలెంపాటి అవిశ్రాంత కృషి ఈ టోర్నమెంట్లు దిగ్విజయంగా జరగడంలో కీలక పాత్ర పోషించింది.నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కోసం జరుగుతున్న ఏర్పాట్లను నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది తెలిపారు. క్రీడాకారులు టోర్నమెంట్లో చూపిన క్రీడాస్ఫూర్తిని మల్లాది ప్రశంసించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, మాధవి యార్లగడ్డ, అపర్ణ కొడాలి, కార్తీక్ తుమ్మటి, శ్రీకాంత్ పాత్ర, శ్యామల, విజయ్ చిన్నం తదితరులు ఈ టోర్నమెంట్ల నిర్వహణకు తమ మద్దతును, సహకారాన్ని అందించారు. జూలైలో జరిగే అమెరికా తెలుగు సంబరాలకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చేలా ఇదే క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించేందుకు వివిధ రకాల క్రీడా పోటీలను నాట్స్ టంపాలో నిర్వహించనుంది. నాట్స్ సంబరాల కమిటి, నాట్స్ క్రీడా కమిటీలు ఈ పోటీల నిర్వహణకు తగిన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగనుంది. నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి లు విజేతలకు శుభాకాంక్షలు తెలియచేసారు. అందరూ టంపా తెలుగు సంబరాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

NATS శాండియాగో లో నాట్స్ చాప్టర్ ప్రారంభం
శాండియాగో : ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన విభాగాలను ప్రారంభిస్తూ తెలుగు వారికి మరింత చేరువ అవుతోంది. ఈ క్రమంలోనే శాండియాగోలో నాట్స్ విభాగాన్ని ప్రారంభించింది. నాట్స్ శాండియాగో చాప్టర్ సమన్వయకర్తగా ప్రశాంతి ఊడిమూడి, మహిళా సాధికార సలహా మండలి సమన్వయకర్తగా హైమ గొల్లమూడికి బాధ్యతలు అప్పగించారు. శాండియాగో నాట్స్ సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్తగా కామ్య శిష్ట్లా, సోషల్ మీడియా సమన్వయ కర్త గా తేజస్వి కలశిపూడి, సేవా కార్యక్రమాల సమన్వయకర్త గా రామచంద్ర రాజు ఊడిమూడి, క్రీడా స్ఫూర్తి సమన్వయ కర్తగా సత్య హరిరామ్, ఆది మోపిదేవి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. శ్రీరామనవమి నాడు శాండియాగో లో నాట్స్ విభాగం ప్రారంభం కావడం ఆనందంగా ఉందని శాండియాగో నాట్స్ సమన్వయకర్త ప్రశాంతి ఊడిమూడి అన్నారు. శాండియాగో లో నాట్స్ తెలుగు వారికి శ్రీరామరక్షలా మారేలా తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. చాప్టర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. తనుష్ భగవత్ ,వీణ-ఋత్వ ఊడిమూడి గానామృతం, వయోలిన్‌తో ధ్రువ గౌరిశెట్టి ,పియానోతో విహాన్ మండపాక అందరిని అలరించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి,నాట్స్ సెక్రటరీ మధు బోడపాటి, జోనల్ వైస్ ప్రెసిడెంట్ మనోహర్ మద్దినేని పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా లాస్ ఏంజెలెస్ చాప్టర్ నుండి నాట్స్ ప్రోగ్రామ్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిలుకూరి,జాతీయ మహిళా సాధికారత సమన్వయ కర్త రాజ్యలక్ష్మి చిలుకూరి,లాస్ ఏంజెలెస్ చాప్టర్ సమన్వయ కర్త మురళి ముద్దన, హెల్ప్ లైన్ సమన్వయ కర్త శంకర్ సింగం శెట్టి పాల్గొన్నారు. నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి ఆధ్వర్యంలో నూతన చాప్టర్ సభ్యులను మనోహర్ మద్దినేని సభకు పరిచయం చేశారు. నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, ప్రెసిడెంట్ (ఎలెక్ట్) శ్రీహరి మందాడి తమ అభినందనలు సందేశం ద్వారా పంపారు. భవిష్యత్తులో శాండియాగో నాట్స్ విభాగం చేపట్టే ప్రతి కార్యక్రమానికి జాతీయ నాయకత్వం మద్దతు ఉంటుందని నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి భరోసా ఇచ్చారు. అమెరికాలో తెలుగు సమాజ అభివృద్ధి దిశగా నాట్స్ జాతీయ వ్యాప్తంగా ఎంతో కృషి చేస్తుందన్నారు. అమెరికాతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న సేవ కార్యక్రమాల గురించి మదన్ పాములపాటి వివరించారు. శాండియాగో చాప్టర్ ఏర్పాటులో నాట్స్ జాతీయ మీడియా కో ఆర్డినేటర్ కిషోర్ నారే కీలక పాత్ర పోషించడం అభినందనీయమని అన్నారు. శాండియాగోలో ఇక నుంచి తెలుగువారికి నాట్స్ అండగా ఉందనే భరోసాను కల్పించే దిశగా శాండియాగో నాట్స్ సభ్యులు కృషి చేయాలని కోరారు.
క్రైమ్

రూ.50 లక్షల ఆభరణాలు : చెల్లని చెక్కు ఇచ్చి చెక్కేసిన కిలాడీ
గచ్చిబౌలి: సినీ ప్రముఖులు, రాజకీయ పెద్దలు తెలుసని బిల్డప్ ఇస్తూ విలువైన నగలను ఆర్డర్ చేసి ఉడాయించిన ఓ కిలేడీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మాయమాటలు చెప్పి రూ.50 లక్షల విలువ చేసే నగలను తీసుకుని బిల్లులు చెల్లించకుండా తిరుగుతున్న మహిళ కోసం రాయదుర్గం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. కొద్ది రోజుల క్రితం అబిడ్స్‌లోని ఓ నగలు షాపు యజమానికి రమాదేవి అనే మహిళ వాట్సాప్ వీడియో కాల్ చేసి వివిధ డిజైన్ల నగలను ఎంపిక చేసుకుంది. దాదాపు రూ.50 లక్షల విలువైన నలను రాయదుర్గం పీఎస్ పరిధిలోని తాను నివాసం ఉండే ఓ గేటెడ్ కమ్యూనిటీకి తెప్పించుకుంది. చెక్ ఇచ్చి కొంత డబ్బు తక్కువగా ఉందని రెండు రోజుల తర్వాత బ్యాంకులో వేసుకోవాలని సూచించింది. అయితే ఆమె ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో డబ్బులు ఇవ్వకుండా మొఖం చాటేసింది. బాధితులు రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలు రమాదేవి కోసం గాలిస్తున్నారు. ఇది ఇలా ఉండా గతంలో ఇదే తరహాలో నగలు కాజేసిన ఆమెపై నార్సింగి పీఎస్ పరిధిలో ఒకటి, రాయదుర్గం పీఎస్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. అయినా తన తీరుమార్చుకోని సదరు మహిళ సినీ ప్రముఖులు, రాజకీయనాయకులతో దిగిన ఫొటోలు చూపిస్తూ, తాను ధనవంతురాలినని బిల్డప్ ఇస్తూ జ్యువెల్లర్ షాపుల యజమానులతో పరిచయం చేసుకుంటుంది. కొన్ని సందర్భాల్లో నమ్మకంగా ఉన్నట్లు నమ్మిస్తుంది. ఆ తర్వాత పెద్ద మొత్తంలో విలువైన నగలు తీసుకుని మోసాలకు పాల్పడుతోంది. గతంలో నమోదైన కేసుల్లో నోటీసులు ఇచ్చినన పోలీసులు ఈ సారి ఆమెను అరెస్ట్ చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: 138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్తోగొంతు కోసి..మృతదేహాన్ని తగులబెట్టి..చాంద్రాయణగుట్ట: ఓ మహిళను గొంతుకోసి దారుణంగా హత్య చేయడమేగాక మృతదేహాన్ని తగలబెట్టిన సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పాతబస్తీ కేశవగిరి హిల్స్ ప్రాంతంలో కేతావత్ బుజ్జి (55), రూప్ దంపతులు నివాసం ఉంటున్నారు. భర్త, కుమారుడు మరో ప్రాంతంలో ఉండటంతో ఒంటరిగా ఉంటున్న బుజ్జి కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తోంది. బుధవారం కూలీ పనులకు వెళ్లి రాత్రి ఇంటికి తిరిగి వచ్చింది. అర్ధరాత్రి ఆమె ఇంట్లో నుంచి మంటలు రావడాన్ని గుర్తించిన స్థానికులు డయల్ 100కు ఫోన్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న బండ్లగూడ ఇన్స్పెక్టర్ గురునాథ్ తలుపులు బద్దలు కొట్టి లోనికి వెళ్లి చూడగా ఓ మహిళ మృతదేహం తగలబడుతున్నట్లు గుర్తించి మంటలను ఆర్పారు. అప్పటికే ఆమె మృతదేహం సగం కాలిపోయింది. సమాచారం అందుకున్న సైబర్ క్రైమ్ డీసీపీ కవిత ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా బుజ్జిని గొంతుకోసి హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. చదవండి: వెయిటర్ టు కరోడ్‌పతి: కె.ఆర్. భాస్కర్ ఇన్స్పైరింగ్ జర్నీ

నకిలీకి ‘అసలు సీఐ’ తోడు
పీఎం పాలెం (విశాఖపట్నం): మధురవాడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో నకిలీ ఏసీబీ సీఐ ఉదంతం కొత్త మలుపు తిరిగింది. నకిలీ ఏసీబీ సీఐ అవతారం ఎత్తిన బలగ సుధాకర్.. ‘సీఐ’గా పనిచేస్తున్న స్వర్ణలతను ‘ఏసీబీ ఎస్పీ’గా పేర్కొంటూ సబ్ రిజిస్ట్రార్ (sub registrar) చక్రపాణిని మభ్యపెట్టాడు. ‘ఏసీబీ దాడుల నుంచి ముప్పు లేకుండా ఉండాలంటే సుధాకర్ కోరినట్లుగా రూ. 5 లక్షలు ఇచ్చేయండి’ అంటూ ఆమె కూడా చక్రపాణికి ఫోన్లో తెలిపారు.పోలీసులు స్వాధీనం చేసుకున్న సుధాకర్ ఫోన్ నంబరు ఆధారంగా చేసిన దర్యాప్తులో తాజా అంశం బట్టబయలైంది. దీంతో గతంలో వైజాగ్‌లో పనిచేసి ప్రస్తుతం బాపట్ల (Bapatla) రిజర్వ్ పోలీస్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న స్వర్ణలత ప్రమేయం ఈ కేసులో ఉందని పోలీసులు తేల్చారు. ఆమెను గురువారం అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే అరెస్టయిన సుధాకర్‌తోపాటు, సీఐ స్వర్ణలతను రిమాండ్ నిమిత్తం భీమిలి కోర్టుకు తరలించామని స్థానిక సీఐ బాలకృష్ణ తెలిపారు.అసలేం జరిగింది? బుధవారం ఉదయం 11 గంటల సమయంలో విశాఖపట్నం (Visakhapatnam) మధురవాడలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి బలగ సుధాకర్ వచ్చాడు. నేరుగా సబ్ రిజిస్ట్రార్ చక్రపాణిని కలిసి, తనను ఏసీబీ సీఐగా పరిచయం చేసుకున్నాడు. త్వరలో మీ ఆఫీసులో రైడ్ జరగబోతోందని, తనకు 5 లక్షల రూపాయలు ఇస్తే దాడుల ముప్పు నుంచి మిమ్మల్ని కాపాడతానని నమ్మబలికాడు. అతడి వ్యవహారశైలిపై అనుమానం రావడంతో పీఎం పాలెం పోలీసులకు చక్రపాణి సమాచారం ఇచ్చారు. సుధాకర్‌ను అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటపడింది. చదవండి: అంతుచూసిన అనుమానం.. భర్త చేతిలో భార్య దారుణ హత్య

ఉద్యోగం కోసం వచ్చి ఐఫోన్లు మాయం చేశాడు
సనత్‌నగర్: ఉద్యోగం కోసం వచ్చినన ఓ వ్యక్తి రూ.1.40 లక్షల విలువైన రెండు ఐఫోన్లను చోరీ చేసిన ఘటన బేగంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. బేగంపేట డీఐ జి.శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం..బేగంపేటలోని ఎఫ్డీఆర్ ఆర్డీ టవర్స్‌లో గల జెప్టో కార్యాలయానికి స్టోర్ ప్యాకర్‌గా పనిచేసేందుకు బాలానగర్‌లోని జింకలవాడకు చెందిన గౌతమ్ అంకిత్‌పాత్ర (24) ఈ నెల 3వ తేదీన వచ్చాడు. ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత స్టోర్‌లో పనిచేసేందుకు అంగీకరించాడు. స్టోర్‌ను ఒకసారి చూసి వస్తానని చెప్పి స్టోర్‌లో కనిపించిన రెండు విలువైన ఐఫోన్లను తీసి దాచుకున్నాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తిరిగి కార్యాలయానికి రాలేదు. ఆ తర్వాత స్టోర్ ఆడిట్ చేసిన నిర్వాహకులు రెండు ఐఫోన్లు కనిపించడం లేదని గుర్తించారు. సీసీ కెమెరాల ద్వారా గౌతమ్ అంకిత్‌పాత్ర సెల్ఫోన్లను చోరీ చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు స్టోర్ ఉద్యగి తిలక్‌కుమార్ బుధవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివాహిత అదృశ్యం సికింద్రాబాద్: భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచి్చన వివాహిత అదృశ్యమైన ఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు.. ఒడిశా రాష్ట్రం పలపాతి గ్రామానికి చెందిన జడునాథ్ ముర్ము, మల్హో మణి ముర్ము(26) దంపతులు. ఈ నెల 6న సాయంత్రం 8 గంటల సమయంలో భార్యభర్తలు భువనేశ్వర్ రైల్వే స్టేషన్లో జనరల్ టికెట్ తీసుకొని విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలెక్కారు. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగి ప్లాట్ ఫాం నంబర్ 1లోని గేట్ నంబర్ 5 వద్ద కూర్చున్నారు. టూత్‌పేస్ట్ తీసుకొచ్చేందుకు భర్త జడునాథ్ బయటకు వెళ్లి వచ్చేసరికి భార్య కనిపించకుండా పోయింది. దీంతో పరిసర ప్రాంతాల్లో ఎంత వెతికినా భార్య మల్హో మణి ఆచూకీ లభించకపోవడంతో జీఆర్పీ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మెట్రో స్టేషన్లో యువకుడి ఆత్మహత్య చిక్కడపల్లి: పురుగు మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మెట్రో స్టేషన్లో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ రాజు నాయక్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గురువారం చిక్కడపల్లి మెట్రోస్టేషన్‌కు వచి్చన గుర్తుతెలియని యువకుడు అక్కడే వాంతులు చేసుకుని అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీనిని గుర్తించిన మెట్రో సిబ్బంది 108కు, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతను పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

నారాయణరెడ్డి హత్య కేసులో.. 11 మందికి జీవిత ఖైదు
కర్నూలు (సెంట్రల్)/వెల్దుర్తి: కర్నూలు జిల్లా పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి భర్త లక్ష్మీనారాయణరెడ్డి, ఆయన అనుచరుడు బోయ సాంబశివుడు హత్య కేసులో 11 మంది నిందితులపై నేరం రుజువైంది. వీరందరికీ జీవిత ఖైదు విధిస్తూ కర్నూలు ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు జడ్జి జి. కబర్థి గురువారం తీర్పు చెప్పారు. మరో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటించారు. 2017 మే 21న చెరుకులపాడు నారాయణరెడ్డి అనుచరులతో కలిసి కృష్ణగిరి మండలం రామకృష్ణాపురంలో పెళ్లికి రెండు వాహనాల్లో బయల్దేరారు. నిందితులు రెండు ట్రాక్టర్లలో వచ్చి నారాయణరెడ్డి కారును ఢీకొట్టి నారాయణరెడ్డిపై దాడిచేసి హత్యచేశారు. అడ్డుకోబోయిన సాంబశివుడునూ అంతమొందించారు. కృష్ణగిరి పోలీసులు కేసు నమోదుచేసి 19 మందిపై చార్జిషీటు దాఖలు చేశారు. నిందితులుగా ఉన్న ప్రస్తుత పత్తికొండ టీడీపీ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, ప్రస్తుత వాల్మీకి ఫెడరేషన్ చైర్మన్ కప్పట్రాళ్ల బొజ్జమ్మలు హైకోర్టును ఆశ్రయించగా వీరి పేర్లు కేసు నుంచి తొలగించారు. ఏ4గా ఉన్న కోతుల రామాంజనేయులు చనిపోవడంతో మొత్తం 16 మందిపై తుది విచారణ సాగింది. ఇందులో 11 మందికి జీవిత ఖైదు పడగా, ఐదుగురిపై నేరం రుజువు కాలేదు. జీవిత ఖైదు పడిన నిందితులు వీరే.. కురువ రామాంజనేయులు, రామయ్యనాయుడు, కురువ రామకృష్ణ, కోతుల బాలు, కోతుల చిన్న ఎల్లప్ప, కోతుల పెద్ద ఎల్లప్ప, గంటల వెంకటరాముడు, గంటల శీను, బీసన్నగారి రామాంజనేయులు(40), బీసన్నగారి రామాంజనేయులు(42), బీసన్నగారి పెద్ద బీసన్నలకు జీవితఖైదు పడింది. చాకలి నారాయణ, కర్రి గిడ్డయ్య, చెరుకులపాడు గోపాల్, చిన్న వెంకటలను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. బీసన్నగారి పెద్ద బీసన్న వయస్సు ప్రస్తుతం 83 ఏళ్లు. నిందితుడు ఆత్మహత్యా యత్నం.. నిందితుల్లో ఒకరైన రామాంజనేయులును వాహనంలో కడపకు తీసుకెళ్తుండగా తలను వాహనం కిటికీకి కొట్టుకుని ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో కిటికీ అద్దాలు పగిలిపోయాయి. పోలీసులు అప్రమత్తమై అతడిని అడ్డుకున్నారు. కేఈ కుటుంబాన్ని నమ్ముకుంటే జైలుకే.. నారాయణరెడ్డి, బోయ సాంబశివుడు హత్యకేసులో తమకే ఎందుకు జీవితఖైదు పడిందని, కేఈ శ్యాంబాబుకు ఎందుకు శిక్ష పడలేదని నిందితులు కురువ రామాంజనేయులు, బీసన్నగారి రామాంజనేయులు ప్రశ్నించారు. కేఈ కుటుంబాన్ని నమ్ముకుంటే జైలుకు పోవాల్సిందేనని, ఆ కుటుంబాన్ని ఎవరూ నమ్మొద్దని.. వారెలాంటి సాయం చేయరని, తమకు తగిన శాస్తి జరిగిందని కన్నీళ్లు పెట్టుకున్నారు.చట్టం, కోర్టులపై నమ్మకం పెరిగింది.. నారాయణరెడ్డి సతీమణి,మాజీఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అనంతరం.. కర్నూలులోని తన స్వగృహంలో నారాయణరెడ్డి సతీమణి, కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఈ అంశంపై స్పందించారు. కోర్టు తీర్పుతో, పోలీసులు కేసులో చూపిన తెగువతో తమకు, ప్రజలకు చట్టంపై, కోర్టులపై నమ్మకం పెరుగుతోందన్నారు. తన భర్త నారాయణరెడ్డి బతికుంటే ఎమ్మెల్యే కాలేమన్న భయంతోనే కేఈ శ్యాంబాబు కుట్ర పన్ని హత్య చేయించారని ఆమె ఆరోపించారు. నారాయణరెడ్డి హత్య కేసు తీర్పును చూసి ప్రజలు కక్షపూరిత రాజకీయాలకు దూరంగా ఉండాలని శ్రీదేవి విజ్ఞప్తి చేశారు. నారాయణరెడ్డి సోదరుడు వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్‌రెడ్డి మాట్లాడుతూ.. కేఈ కుటుంబం అధికారంలో ఉన్నప్పుడే తన తండ్రిని, తన సోదరుడిని పోగొట్టుకున్నామన్నారు.
వీడియోలు


మెగాస్టార్ తో హీరోయిన్ దీపికా పడుకోణె మూవీ..!


పాక్ కు చావు దెబ్బ.. టాప్ మిస్సైల్స్ కూల్చేసిన భారత్


ఇప్పటికైనా పాక్ బుద్ది తెచ్చుకోక పోతే మ్యాప్ లో నుండి తుడిచేయడం పక్కా


నో పెట్రోల్, నో డిజిల్.. భారత్ దెబ్బకు పాకిస్తాన్ లో సీన్ రివర్స్


వీర జవాన్ మురళీ నాయక్ కు YSRCP నివాళులు


ఆపరేషన్ సిందూర్ పై విదేశాంగ, రక్షణశాఖ కీలక ప్రెస్ మీట్


ఢిల్లీపై పాక్ టార్గెట్.. భయాందోళనలో విద్యార్థులు


బరితెగించిన పాక్.. సీనియర్ అధికారి మృతి


India Pakistan War: బోర్డర్ నుంచి లైవ్ అప్డేట్స్


మోదీ సిగ్నల్ ఇస్తే..? పాక్ ని 5 రోజుల్లో లేపేస్తాం: మాజీ జర్నల్