
స్టాక్ ఎక్స్చేంజీ దిగ్గజం బీఎస్‌ఈ తాజాగా డివిడెండ్ లీడర్స్ 50 పేరుతో ఇండెక్స్‌ను ప్రారంభించింది. బీఎస్‌ఈ అనుబంధ సంస్థ ఆసియా ఇండెక్స్ ఈ కొత్త ఇండెక్స్‌ను ప్రవేశపెట్టింది. బీఎస్‌ఈ 500 ఇండెక్స్‌లో భాగమైన 50 కంపెనీలకు దీనిలో చోటు కల్పింంది. అయితే గత 10ఏళ్లలో నిరవధికంగా డివిడెండ్లు చెల్లించిన దిగ్గజాలను మాత్రమే ఇందుకు ఎంపిక చేస్తారు.
ప్రతీ ఏటా డిసెంబర్‌లో ఇండెక్స్‌ను సమీక్షించనున్నట్లు ఆసియా ఇండెక్స్ వెల్లడించిది. ఈ ఇండెక్స్‌ను ఈటీఎఫ్‌లు, ఇండెక్స్ ఫండ్స్‌తోపాటు.. దేశీయంగా విభిన్న రంగాల పనితీరును మదింపు చేయవచ్చని పేర్కొంది.అలాగే, పీఎంఎస్ వ్యూహాలు, మ్యూచువల్ ఫండ్ పథకాలు, ఫండ్ పోర్ట్ ఫోలియోల బెంచ్ మార్క్ కోసం దీన్ని ఉపయోగించవచ్చని తెలిపింది.
మరో స్టాక్ ఎక్స్చేంజీ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈ కూడా ఇటీవల నిఫ్టీ వేవ్స్ ఇండెక్స్‌ను ప్రవేశపెట్టింది. మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్, గేమింగ్ పరిశ్రమలకు ప్రాతినిధ్యం వహించే 43 లిస్టెడ్ కంపెనీలతో ఇండెక్స్‌ను రూపొందించింది. తద్వారా ఫిల్మ్, టీవీ, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్, మ్యూజిక్, గేమింగ్ తదితర వివిధ పరిశ్రమలకు చోటు కల్పించింది.