నేడు తెలంగాణకు ఎన్డీఎస్‌ఏ బృందం | Sakshi
Sakshi News home page

నేడు తెలంగాణకు ఎన్డీఎస్‌ఏ బృందం

Published Wed, Mar 6 2024 10:10 AM

Ndsa Expert Panel Visit Kaleshwaram Project Updates - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాన్ని పరీక్షించేందుకు కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్‌ జె.చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలో నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) ఏర్పాటు చేసిన ఆరుగురు సభ్యుల కమిటీ బుధవారం రాష్ట్రానికి రానుంది.

బుధవారం మధ్యాహ్నం జలసౌధలో నీటి పారుదల శాఖ కార్య దర్శి రాహుల్‌ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్, ఈఎన్సీలతో సమావేశం కానుంది. ఈ నెల 7, 8వ తేదీల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సందర్శించి తనిఖీలు నిర్వహించనుంది.

మళ్లీ 9న హైదరాబాద్‌లో అధికారులు, నిర్మాణ సంస్థలతో సమావేశం కానుంది. అదేరోజు సాయంత్రం ఢిల్లీకి తిరిగి వెళ్లనుంది. మరోవైపు బ్యారేజీల డిజైన్లు మొదలు నిర్మాణం వరకు ఇందులో పాలుపంచుకున్న అధికారులు తమ వెంట ఉండేలా చూడాలని ప్రభుత్వాన్ని కమిటీ కోరింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన 19 రకాల సమాచారం అందించాలని లేఖ రాసింది.

ఇదీ చదవండి: వీడ్కోలు సమయాన విన్నపాలు

Advertisement
 
Advertisement