తల్లికి వందనం.. మోసం | - | Sakshi
Sakshi News home page

తల్లికి వందనం.. మోసం

Feb 15 2026 6:50 AM | Updated on Feb 15 2026 6:50 AM

తల్లికి వందనం.. మోసం

తల్లికి వందనం.. మోసం

తల్లికి వందనం కింద కుటుంబంలో 12వ తరగతి లోపు ఎంత మంది చదువుకుంటుంటే అంత మందికి రూ.15 వేలు చొప్పున తల్లికి వందనం వేస్తామని చెప్పిన ప్రభుత్వం తల్లులను మోసం చేసింది. గత సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం కింద రూ 13 వేల కోట్లు కేటాయించాల్సి ఉండగా రూ 9,407 కోట్లు విడుదల చేసింది. అనేక మందికి రూ.7 వేలు, రూ.9 వేలు వేసి మిగతా మొత్తాన్ని ఎగనామం పెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనైనా బడ్జెట్‌లో ఆ మేరకు నిధులు పెంచుతారా అంటే.. తూతూ మంత్రంగా కేవలం రూ.261 కోట్లను మాత్రమే బడ్జెట్‌లో పెంచింది. సరిపడా ఈ సంవత్సరం కూడా నిధులు ఇవ్వలేదు. అంటే ఈ సంవత్సరం కూడా తల్లులను ప్రభుత్వం మోసం చేయబోతోందని అర్థమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement