గారడీ లెక్కలు.. అప్పుల ప్రణాళికలే
రాష్ట్ర బడ్జెట్‌లో పేదలకు ప్రాధాన్యత లేకుండా పోయింది. గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సీబీఎస్‌ఈ కోర్సులను కూడా చేపట్టలేక రద్దు చేయడం చూస్తుంటే పేద పిల్లలకు సీబీఎస్‌ఈ చదువులు అక్కరలేదన్నట్లు ఉంది. బడ్జెట్ మొత్తం అప్పులు కుప్ప తప్ప.. సంక్షేమం, అభివృద్ధి ఏ కోశానా కనిపించలేదు. కేంద్రం వద్ద అప్పులు చేసేందుకే ద్రవ్య లోటు భారీగా చూపించారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీని, అన్నదాతలకు సాయం లేకుండా చేశారు. మహిళలకు రూ.1500 సాయం ఊసే లేదు.
– మేరిగ మురళీధర్, ఎమ్మెల్సీ


