సిబ్బంది సంక్షేమమే ధ్యేయం : ఏఎస్పీ | - | Sakshi
Sakshi News home page

సిబ్బంది సంక్షేమమే ధ్యేయం : ఏఎస్పీ

Feb 14 2026 9:58 AM | Updated on Feb 14 2026 9:58 AM

సిబ్బంది సంక్షేమమే ధ్యేయం : ఏఎస్పీ

సిబ్బంది సంక్షేమమే ధ్యేయం : ఏఎస్పీ

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): పోలీసు శాఖలో పనిచేస్తున్న సిబ్బంది సంక్షేమమే ధ్యేయమని ఏఎస్పీ సౌజన్య తెలిపారు. శుక్రవారం నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ఫోన్‌ఇన్‌ కార్యక్రమంలో ఆమె పాల్గొని 13 మంది సిబ్బంది సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిబ్బంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చి పోలీస్‌ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా ఫోన్‌ ద్వారా సమస్యలను నేరుగా చెప్పొచ్చన్నారు. 13 మంది సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించామన్నారు. కార్యక్రమంలో పోలీసు కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement