హామీలు నెరవేర్చాలని డిమాండ్
● కలెక్టరేట్ ఎదుట ధర్నా
నెల్లూరు(దర్గామిట్ట): కూటమి నేతలు అధికారంలోకి వచ్చేందుకు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు హామీలిచ్చారని, వాటిని వెంటనే నెరవేర్చాలని నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం నెల్లూరులోని కలెక్టరేట్ ఎదుట ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, గౌరవాధ్యక్షులు ఎం.సుదర్శనం, కె.నరసింహ, జి.రాజమనోహర్ మాట్లాడుతూ హామీలపై తక్షణం చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామన్నారు. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అమలు చేయాలన్నారు. మధ్యంతర భృతిని ప్రకటించాలన్నారు. కార్యక్రమంలో నేతలు రమేష్‌బాబు, రాజు, రవి, రామారావు, మోజెస్, చిరంజీవి, హరిబాబు, సురేష్, సునీల్, వీరాస్వామి, కస్తూరయ్య, వెంకటేశ్వర్లు, వెంకటసుబ్బమ్మ, వెంకటరత్నం, కల్పనాదేవి పాల్గొన్నారు.


