విద్యుత్ భవన్ ఎదుట ధర్నా
నెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్ సంస్థను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ నేషనల్ కో ఆర్డినేట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ ఇంజినీర్స్ యూనియన్ ఇచ్చిన పిలుపుమేరకు గురువారం నెల్లూరులోని విద్యుత్ భవన్ ఎదుట ధర్నా జరిగింది. ధర్నాను యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు దుగ్గిరాల సూరిబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి జాకీర్ హుస్సేన్ ప్రారంభిచారు. వారు మాట్లాడుతూ సంస్థను ప్రైవేటీకరిస్తే కార్మికుల కంటే రైతులు, ప్రజలు ఎక్కువగా నష్టపోతారన్నారు. విద్యుత్ ఉద్యోగుల కు రావాల్సిన డీఏలను వెంటనే చెల్లించాలన్నారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. జేఎల్‌ఎం గ్రేడ్ – 2 సమస్యలను పరిష్క రించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలన్నారు. ఈనెల 18వ తేదీన జరిగే యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశంలో కార్మికుల సమస్యలపై తీర్మానం చేసి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. కార్యక్రమంలో నేతలు బొజ్జా సుమన్, నాగయ్య, హరినారాయణ, గిరిబాబు, దయాకర్, జనార్దన్, లక్ష్మీపతి, జ్యోతిబసు, నాగముని, రామయ్య, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


