17న జిల్లా స్థాయి చెస్ పోటీలు
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): శాప్ లీగ్స్ – 2026లో భాగంగా నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఈనెల 17న జిల్లా స్థాయి చెస్ పోటీలు, ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎం.పాండు రంగారావు తెలిపారు. నగరంలోని ఆ సంస్థ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నెల్లూరు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో అండర్ – 13, 15, 17, 19 విభాగాల్లో బాలబాలికలకు పోటీలు, ఎంపికలు నిర్వహిస్తున్నామన్నారు. ఆసక్తి గల చెస్ క్రీడాకారులు https://sports.ap.gov.in/#/home/ saapleague వెబ్‌సైట్‌లో లేదా క్రీడా యాప్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. జిల్లాకు చెందిన వారే అర్హులని, ఆధార్‌కార్డు లేదా ప్రభుత్వ గుర్తింపు కార్డును తీసుకురావాలన్నారు. ఇతర జిల్లాల విద్యార్థులు నెల్లూరు జిల్లాలో చదువుతుంటే ఆ విద్యాసంస్థ నుంచి ధ్రువీకరణ పత్రాన్ని తీసుకురావాలని తెలిపారు. ప్రతిభ చూపిన వారిని 21, 22 తేదీల్లో తిరుపతిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. ఈనెలలో చెస్, సైక్లింగ్, అథ్లెటిక్స్ పోటీలు, మార్చి నెలలో బ్యాడ్మింటన్, టెన్నీస్ పోలీసులు జరుగుతాయన్నారు. ఆసక్తి గలవారు 88862 28444, 95813 72472 ఫోన్ నంబర్లను సంప్రదించాలని కోరారు.


