బోపన్న జోడీ గెలుపు | Shanghai Masters: Bopanna-Dodig pair advances to second round | Sakshi
Sakshi News home page

బోపన్న జోడీ గెలుపు

Oct 5 2024 11:07 AM | Updated on Oct 5 2024 11:16 AM

Shanghai Masters: Bopanna-Dodig pair advances to second round

న్యూఢిల్లీ: షాంఘై ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌ ఏటీపీ–1000 టెన్నిస్‌ టోర్నలో రోహన్‌ బోపన్న (భారత్‌)–ఇవాన్‌ డోడిగ్‌ (క్రొయేషియా) జోడీ శుభారంభం చేసింది. చైనాలో శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో బోపన్న–డోడిగ్‌ ద్వయం 6–4, 6–3తో పాబ్లో కరెనో బుస్టా–పెడ్రో మారి్టనెజ్‌ (స్పెయిన్‌) జోడీపై విజయం సాధించింది. 63 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న ద్వయం ఐదు ఏస్‌లు సంధించడంతోపాటు మూడు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. తమ సరీ్వస్‌ను ఒకసారి కోల్పోయిన బోపన్న, డోడిగ్‌ ప్రత్యర్థి సరీ్వస్‌ను మూడుసార్లు బ్రేక్‌ చేసింది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement