రాజస్తాన్‌ పేసర్‌కు భారీ షాక్‌ | IPL 2026: Rajasthan Royals Pacer Handed Big Punishment By BCCI | Sakshi
Sakshi News home page

రాజస్తాన్‌ పేసర్‌కు భారీ షాక్‌

Apr 23 2026 12:49 PM | Updated on Apr 23 2026 12:56 PM

IPL 2026: Rajasthan Royals Pacer Handed Big Punishment By BCCI

రాజస్తాన్‌ రాయల్స్‌ బౌలర్‌ నండ్రీ బర్గర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. అతడి మ్యాచ్‌ ఫీజులో కోత పడింది. ఐపీఎల్‌ పాలక మండలి ఈ విషయాన్ని తాజాగా ధ్రువీకరించింది. ఐపీఎల్‌-2026లో భాగంగా రాజస్తాన్‌ బుధవారం లక్నో సూపర్‌ జెయింట్స్‌తో తలపడిన సంగతి తెలిసిందే.

40 పరుగుల తేడాతో
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 159 పరుగులే చేసింది. అయితే, బౌలర్ల విజృంభణ కారణంగా లక్నోను 119 పరుగులకే ఆలౌట్‌ చేసి.. 40 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. రాజస్తాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ మూడు వికెట్లు తీయగా.. నండ్రీ బర్గర్‌, బ్రిజేశ్‌ శర్మ తలా రెండు.. రవీంద్ర జడేజా, రవి బిష్ణోయి చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

అయితే, లక్నోతో మ్యాచ్‌ సందర్భంగా నండ్రీ బర్గర్‌ ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కారణంగా శిక్ష పడింది.  అతడు ఆర్టికల్‌ 2.5లోని లెవల్‌ 1 తప్పిదానికి పాల్పడ్డాడు. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను రెచ్చగొట్టే విధంగా కవ్వింపు చర్యలకు పాల్పడటం.. దురుసుగా ప్రవర్తిస్తే ఈ నిబంధన కింద చర్యలు తీసుకుంటారు.

మ్యాచ్‌ ఫీజులో పది శాతం కోత
ఈ నేపథ్యంలో తప్పును అంగీకరించిన నండ్రీ బర్గర్‌కు మ్యాచ్‌ ఫీజులో పది శాతం కోత విధించడంతో పాటు.. అతడి ఖాతాలో డీమెరిట్‌ పాయింట్‌ చేర్చింది ఐపీఎల్‌ పాలక మండలి. 

ఇదిలా ఉంటే.. లక్నోతో మ్యాచ్‌లో నండ్రీ బర్గర్‌ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 27 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు కూల్చాడు. లక్నో కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ను డకౌట్‌ చేసిన ఈ లెఫ్టార్మ్‌ పేసర్‌.. ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్‌ (55) రూపంలో మరో కీలక వికెట్‌ దక్కించుకున్నాడు.

చదవండి: టీమిండియాలోకి సంచలన ఫాస్ట్‌ బౌలర్‌

Advertisement
 
Advertisement
Advertisement