మళ్లీ ఓడిన భారత మహిళలు | Indian women lost again | Sakshi
Sakshi News home page

మళ్లీ ఓడిన భారత మహిళలు

Dec 3 2023 12:27 AM | Updated on Dec 3 2023 12:27 AM

Indian women lost again - Sakshi

మహిళల జూనియర్‌ హాకీ వరల్డ్‌ కప్‌లో భారత జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. శనివారం జరిగిన పూల్‌ ‘సి’ మ్యాచ్‌లో బెల్జియం 3–2 గోల్స్‌ తేడాతో భారత్‌ను ఓడించింది. భారత్‌ తరఫున అన్ను 47వ, 51వ నిమిషాల్లో గోల్స్‌ సాధించింది. బెల్జియం తరఫున నోవా ష్రూయెర్స్‌ (5వ నిమిషం), ఫ్రాన్స్‌ డి మాట్‌ (42వ ని.), అస్‌ట్రిడ్‌ బొనామి (52వ ని.) గోల్స్‌ నమోదు చేశారు. తొలి, మూడో క్వార్టర్‌లో ఒక్కో గోల్‌ సాధించి ముందుగా బెల్జియం 2–0తో ఆధిక్యంలో నిలిచింది.

అయితే నాలుగు నిమిషాల వ్యవధిలో అన్ను రెండు గోల్స్‌ సాధించి స్కోరును సమం చేసింది. అయితే చివర్లో లభించిన పెనాల్టీ స్ట్రోక్‌ను సమర్థంగా ఉపయోగించుకున్న బెల్జియం మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరో వైపు మంగళవారం మలేసియాలోని కౌలాలంపూర్‌లో జూనియర్‌ పురుషుల హాకీ ప్రపంచ కప్‌ ప్రారంభం కానుంది. అదే రోజు జరిగే  తొలి మ్యాచ్‌లో కొరియాతో భారత్‌ తలపడుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement