చంద్రబాబు నియంతృత్వ చర్యలకు తలొగ్గేది లేదు | YS Jagan's Reaction On Tadepalli YSRCP Office Demolition | Sakshi
Sakshi News home page

చంద్రబాబు నియంతృత్వ చర్యలకు తలొగ్గేది లేదు

Published Sat, Jun 22 2024 9:15 AM | Last Updated on Sat, Jun 22 2024 10:53 AM

YS Jagan's Reaction On Tadepalli YSRCP Office Demolition

గుంటూరు, సాక్షి: తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం కూల్చివేత ఘటనపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు.. తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారని ఎక్స్‌ వేదికగా మండిపడ్డారు. 

‘‘చంద్రబాబు నాయుడు ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తి కావొచ్చిన కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు..  ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్లపాటు పాలన ఏవిధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు.

.. అయినా ఈ బెదిరింపులకు, ఈ కక్షసాధింపు చర్యలకు వైఎస్సార్‌సీపీ తలొగ్గేది లేదు.. వెన్నుచూపేది అంతకన్నా లేదు. ప్రజల తరఫున, ప్రజలకోసం, ప్రజలతోడుగా గట్టిపోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నాను’’ అని వైఎస్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement