గొంతు నొక్కేస్తున్నారు.. | CM YS Jagan in Kadapa election meeting | Sakshi
Sakshi News home page

గొంతు నొక్కేస్తున్నారు..

Published Sat, May 11 2024 5:43 AM | Last Updated on Sat, May 11 2024 8:25 AM

CM YS Jagan in Kadapa election meeting

మంగళగిరి, పుత్తూరు, కడప ఎన్నికల సభల్లో సీఎం వైఎస్‌ జగన్‌  

5 ఏళ్లకు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని 57 నెలలకే అంతం చేసే కుట్రలు 

మీ జగన్‌ నొక్కిన బటన్లకు కోడ్‌ పేరుతో డబ్బులు ఆపేశారు 

మీరు నులిమేది నా అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, రైతన్నలు, విద్యార్థుల గొంతులనే  

ఇవేవో ఎన్నికల కోసం తెచ్చి న పథకాలు కావు.. 

ఎన్నికలకు 2, 3నెలల ముందు తెచ్చి నవి అంతకంటే కాదు

ఐదేళ్లుగా కొనసాగుతున్న స్కీమ్‌లనూ అడ్డుకున్నారు 

అవ్వాతాతలకు ఇంటికే పెన్షన్లనూ అడ్డుకున్నారు 

వీటి కోసం మీ బిడ్డ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి తెచ్చారు 

చంద్రబాబువి ఊసరవెల్లి రాజకీయాలు.. వెనుకబాటుతనం ఆధారంగానే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు 

మైనార్టీలకు మీ బిడ్డ జగన్‌ ఎప్పటికీ తోడుగా ఉంటాడు 

వైఎస్సార్‌ బాటలో మరో నాలుగడుగులు ముందుకేశాం 

ముస్లింలకు 7 అసెంబ్లీ సీట్లిచ్చి రాజకీయ రిజర్వేషన్లు కల్పించిన ఘనత మనదే 

ఒక ప్రభుత్వాన్ని ఐదేళ్ల కోసం ఎన్నుకుంటారు. కానీ వీళ్లందరూ 57 నెలలకే  మీ బిడ్డ ప్రభుత్వాన్ని గొంతు పట్టుకుని పిసికేయాలని ఆలోచన చేస్తున్నారు. వీళ్లు గొంతు పట్టుకుని పిసికేది మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాదు.. నా అక్కచెల్లెమ్మల గొంతులను, నా అవ్వాతాతల గొంతులను, నా రైతన్నల గొంతులను, నా పేద విద్యార్థుల గొంతులనే అని ప్రతి ఒక్కరూ గమనించమని కోరుతున్నా – మంగళగిరి సభలో సీఎం జగన్‌

నేను ప్రతి సందర్భంలోనూ నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు అని ఎందుకు అంటానో తెలుసా? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి బాహాటంగా ‘‘నా..’’ అని పిలుచుకుంటూ వారిపై ప్రేమ చూపించినప్పుడు ఆయా సామాజిక వర్గాలకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా గౌరవం, ఆత్మగౌరవం, ఆత్మస్థైర్యం పెరుగుతుంది. అది జరగాలనే తపనతోనే మీ బిడ్డ  ఒక యజ్ఞాన్ని చేస్తున్నాడు.– కడప సభలో సీఎం జగన్‌ 

సాక్షి ప్రతినిధి, గుంటూరు, సాక్షి, తిరుపతి, సాక్షి ప్రతినిధి, కడప: ‘మీరంతా ఐదేళ్ల కోసం అధికారం ఇస్తే  57 నెలలకే మీ బిడ్డ గొంతు నొక్కేస్తున్నారు! వీళ్ల  దుర్మార్గాలు, కుట్రలు ఏ స్థాయిలో ఉన్నాయంటే  జగన్‌కు ఎక్కడ ప్రజల్లో మంచి పేరు వస్తుందోననే ఆందోళనతో ఇంటికే వచ్చే పెన్షన్‌కు కూడా అడ్డుపడి రానివ్వకుండా చేస్తున్నారు. మీ బిడ్డ బటన్లు నొక్కి రెండు నెలలైంది. ఎన్నికల కోడ్‌ రాకముందే బటన్లు నొక్కినా ఎక్కడ అక్కచెల్లెమ్మలకు డబ్బులు వెళ్లిపోతాయో, ఎక్కడ జగన్‌ను వాళ్లంతా మంచివాడు అని అనుకుంటారేమోనని అది కూడా అడ్డుకుంటున్న దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నారు. 

నా అక్కచెల్లెమ్మలకు ఎట్టి పరిస్ధితుల్లోనూ పథకాల డబ్బులు అందాలని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మీ బిడ్డ కోర్టుకు వెళ్తున్నాడంటే ఈ వ్యవస్థ ఏ స్థాయిలో దిగజారిపోయిందో ఆలోచన చేయండి. బాగా ముదిరిపోయిన తొండ లాంటి చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారు. 

ఒకవైపు ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీతో జత కట్టి మరోవైపు మైనార్టీల ఓట్ల కోసం కపట ప్రేమ నటిస్తున్నారు’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం గుంటూరు జిల్లా మంగళగిరి, చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం పుత్తూరు, వైఎస్సార్‌ జిల్లా కడపలోని వన్‌టౌన్‌ సమీపాన మద్రాస్‌ రోడ్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ముఖ్యమంత్రి జగన్‌ ప్రసంగించారు. 

విశ్వసనీయతతో అడుగులు..
మరో మూడు రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోంది. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి కావు. వచ్చే ఐదేళ్లు మీ ఇంటింటి అభివృద్ధి, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలివి. జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. మళ్లీ ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్లీ మోసపోవడమే. సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోకు అర్థం ఇదే. చంద్రబాబుకు ఓటు వేయడం అంటే కొండ చిలువ నోట్లో తలపెట్టడమే. 

ఇది చరిత్ర చెబుతున్న సత్యం. మరోవైపు మీ బిడ్డది మనసున్న ప్రభుత్వం. మీ బిడ్డ పేదవాడిని పేదవాడిగానే చూశాడు. ఏ రోజూ కులమతాలు చూడలేదు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా గత 59 నెలల కాలంలో 130సార్లు బటన్లు నొక్కి వివిధ పథకాల ద్వారా రూ.2.70 లక్షల కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లో జమ చేశాడు. ఎక్కడా లంచాలు, వివక్ష లేదు. గతంలో రాష్ట్రంలో నాలుగు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఉంటే మీ బిడ్డ ఏకంగా మరో 2.31 లక్షల ఉద్యోగాలు కొత్తగా ఇచ్చాడు. 1.30 లక్షల మంది నా తమ్ముళ్లు, చెల్లెమ్మలే సచివాలయాల్లో కనిపిస్తున్నారు. 

ఎన్నికలు ముగిశాక మేనిఫెస్టోను చెత్తబుట్టలో పారేసే సంస్కృతికి తెర దించి ఏకంగా 99 శాతం హామీలను అమలు చేసి చిత్తశుద్ధి చాటుకున్నాం. విశ్వసనీయతకు అర్థం చెప్పాం మన మేనిఫెస్టోను గడపగడపకూ పంపించి మీరే టిక్‌ పెట్టాలని కోరుతూ అక్కచెల్లెమ్మల ఆశీర్వాదం తీసుకున్నాం. మేనిఫెస్టోకి విశ్వసనీయత తెచ్చిన ఇలాంటి కార్యక్రమం గతంలో ఎప్పుడైనా జరిగిందా ? 

మచ్చుకు కొన్ని గడగడా చెబుతా..
మన ప్రభుత్వం తెచ్చిన కొన్ని పథకాలు మచ్చుకు కొన్ని గడగడా చెబుతా.  ‘నాడు–నేడు’తో బాగుపడ్డ గవర్నమెంట్‌ బడులు, ఇంగ్లిష్‌ మీడియం, 6వ తరగతి నుంచే ఐఎఫ్‌పీలతో డిజిటల్‌ బోధన, 8వ తరగతికి రాగానే ట్యాబ్‌లు, 3వ తరగతి నుంచి  టోఫెల్‌ క్లాసులు, సబ్జెక్టు టీచర్లు, సీబీఎస్‌ఈ నుంచి ఏకంగా ఐబీ దాకా ప్రయాణం, బైలింగ్యువల్‌ టెక్ట్స్‌ బుక్స్, బడులు తెరవగానే విద్యాకానుక, రోజుకో రుచికరమైన మెనూతో గోరుముద్ద, పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ అమ్మఒడి, పూర్తి ఫీజులు చెల్లిస్తూ జగనన్న విద్యాదీవెన, ఖర్చుల కోసం వసతి దీవెన లాంటి వినూత్న పథకాలు, కార్యక్రమాలు గతంలో ఉన్నాయా? ఉన్నత విద్య అభ్యసిస్తున్న 93 శాతం మంది విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో లబ్ధి చేకూరుస్తున్నాం. 

తొలిసారిగా అంతర్జాతీయ వర్సిటీల నుంచి ఆన్‌లైన్‌ సర్టిఫైడ్‌ కోర్సులను మన డిగ్రీలలో భాగస్వామ్యం చేయడం, తప్పనిసరి ఇంటర్న్‌షిప్‌ లాంటివి మీ బిడ్డ తెచ్చిన విప్లవాలు కావా? ఈ రోజు ఒకటో తరగతి ఇంగ్లిష్‌ మీడియంలో చదువుతున్న పిల్లవాడు 2035లో ఐబీ సర్టిఫికెట్‌తో పదో తరగతి పాస్‌ అవుతాడు. ఆ తర్వాత ఏ హార్వర్డ్‌ నుంచో, ఎల్‌ఎస్సీ, స్టాన్‌పర్డ్‌ నుంచో, ఏంఐటీ నుంచో సర్టిఫికెట్‌ కోర్సులతో డిగ్రీ పట్టా తీసుకుంటాడు. ఆ పిల్లవాడు అనర్గళంగా ఇంగ్లిష్‌లో మాట్లాడుతూ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసు­కుంటే పరిస్థితి ఎలా ఉంటుందో మిమ్మల్ని ఆలో­చన చేయమని కోరుతున్నా. పేదల తలరా­తలు మార్చేందుకు మీ బిడ్డ వేస్తున్న అడుగులు ఎంత ముఖ్యమో, ఎంత అవసరమో ఆలోచన చేయండి. 

విప్లవాత్మక పథకాలు, సేవలు..
నా అక్కచెల్లెమ్మలు సొంత కాళ్లపై నిలబడి ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తంతోపాటు వారి పేరిటే ఏకంగా 31లక్షల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్‌ చేసి ఇచ్చాం. 22లక్షల గృహ నిర్మాణాలను సైతం చేప­ట్టాం. అక్కచెల్లెమ్మల బాగు కోసం ఇంతగా తపిం­చిన ప్రభుత్వాలు గతంలో ఉన్నాయా? అవ్వాతాతలకు ఇంటికే రూ.3 వేలు పెన్షన్, ఇంటి వద్దకే పౌరసేవలు, రేషన్, పథకాలు అందడం గతంలో ఎప్పుడైనా చూశారా? రైతన్నలకు పెట్టు­బడి సాయంగా రైతు భరోసా, ఉచితంగా పంటల బీమా, నష్టపోతే సీజన్‌ ముగిసేలోగా ఇన్‌పుట్‌ సబ్సిడీ, పగటిపూటే 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు, చేయిపట్టుకుని నడిపించే ఆర్బీకేలు లాంటి కార్యక్రమాలు గతంలో జరిగాయా?

స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ వాహనమిత్ర, నేతన్ననేస్తం, మత్స్యకార భరోసా, చిరువ్యాపా­రులకు తోడు, చేదోడు, లాయర్ల కోసం లా నేస్తం పథకాలను తెచ్చాం. ఏ పేదవాడు వైద్యం కోసం అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదని ఆరోగ్యశ్రీని విస్తరించి రూ.25 లక్షల వరకు ఉచితంగా ఆరోగ్య సేవలు అందిస్తున్నాం. విశ్రాంతి సమయంలో ఆరోగ్య ఆసరా కూడా ఇస్తున్నాం. గ్రామంలోనే విలేజ్‌ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, ప్రతి ఇంటినీ జల్లెడ పడుతూ ఆరోగ్య సురక్ష లాంటి కార్యక్రమాలతో ప్రజారోగ్యంపై ఇంతగా ధ్యాస పెట్టిన ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడైనా చూశారా?

 ఇవాళ ఏ గ్రామానికి వెళ్లినా 600 రకాల సేవలందిస్తున్న సచివాలయాలు కనిపిస్తున్నాయి. 60–70 ఇళ్లకు ఇంటికే వచ్చి సేవలందించే వలంటీర్లు, నాడు–నేడుతో బాగుపడ్డ ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లు, గ్రామంలోనే ఫైబర్‌ గ్రిడ్, నిర్మాణంలో ఉన్న డిజిటల్‌ లైబ్రరీలు, అక్కచెల్లెమ్మలకు భద్రతగా గ్రామంలోనే మహిళా పోలీసు, దిశ యాప్‌ లాంటివి తీసుకొచ్చాం. 14 ఏళ్ల పాటు పరిపాలన చేశానని చెప్పుకునే చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా? 

ముస్లింలకు మీ జగన్‌ ఇస్తున్న మాట...
బాగా ముదిరిపోయిన తొండ లాంటి చంద్ర­బాబు ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారు. ఒకపక్క 4 శాతం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని శపథం చేసిన బీజేపీతో జత కట్టి ఎన్డీఏలో కొనసాగుతూ మరోపక్క మైనారిటీల ఓట్ల కోసం దొంగ ప్రేమ నటిస్తున్నాడు. ఇంత మోసాలు, ఇలాంటి దగుల్బాజీ రాజకీయాలు చేసే వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవరైనా ఉంటారా? ఆరు నూరైనా సరే ముస్లిం మైనా­రి­టీలకు 4శాతం రిజర్వేషన్లు ఉండి తీరా­ల్సిందే. ఇది మీ జగన్, మీ వైఎస్సార్‌ బిడ్డ ఇస్తున్న మాట. మరి చంద్రబాబుకు ప్రధాని మోదీ సమక్షంలో ఇదే మాట చెప్పే దైర్యముందా?

వారు మైనారిటీ రిజర్వేషన్లకు వ్యతిరేకం అని చెప్పినా కూడా చంద్రబాబు ఎందుకు ఎన్డీఏలో కొనసాగుతున్నాడు? మైనారిటీ రిజర్వేషన్లు అంటే చాలు రాజకీయాలు చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందరికీ అర్థం కావటానికి మీ అందరి సమక్షంలో ఒక విషయం చెబుతున్నా.  ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు మతం ప్రాతిపదికగా ఇచ్చినవి కాదు. ముస్లింలలో కూడా ఉన్నత వర్గాలకు రిజర్వేషన్లు వర్తింపచేయటం లేదు. పఠాన్లు, సయ్యద్‌లు, మొఘల్‌లకు వర్తించడం లేదు. ఇవి కేవలం వెనకబాటుతనం ప్రాతిపదికగా ఇస్తున్న రిజర్వేషన్లు. అన్ని మతాల్లోనూ బీసీలు, ఓసీలు ఉంటారు. 

మరి అలాంట­ప్పుడు మైనారిటీలను వేరుగా చూడటం ధర్మమేనా? రాజకీయాల కోసం వారి జీవితాలతో చెలగాటం ఆడటం న్యాయ­మే­నా? ఎట్టి పరిస్థితిలోనూ ఈ 4శాతం రిజర్వేషన్లు కచ్చితంగా కొనసా­గుతాయి. ఇవే కాదు.. ఎన్‌ఆర్‌సీ, సీఏఏతో సహా ఏ విషయంలోనైనా  మైనారిటీల మనోభావాలు, వారి ఇజ్జత్‌ ఔర్‌ ఇమాన్‌కు అండగా ఉంటాం. డీబీటీ స్కీమ్‌లే కాకుండా ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం, షాదీ తోఫా, ఉర్దూను రెండో అధికార భాషగా ప్రకటించడం, నలుగురు మైనారిటీలను ఎమ్మెల్సీలుగా, నలుగురు మైనార్టీలను ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం, నా మైనారిటీ సోదరుడికి ఉప ముఖ్యమంత్రి పదవి, నా మైనారిటీ సోదరికి శాసన మండలి ఉపాధ్యక్షురాలి పదవులు ఇచ్చి గౌరవించాం. 

మైనారిటీ సబ్‌ ప్లాన్‌ బిల్లు తేవడం మొదలు ప్రతి సందర్భంలోనూ సముచిత స్థానం కల్పించాం. ఆ దివంగత నేత, నాన్నగారు వైఎస్‌ రాజశేఖరరెడ్డి మైనారిటీలకు 4శాతం రిజర్వేషన్లు ఇచ్చి రెండు అడుగులు ముందుకు వేస్తే.. ఆయన బిడ్డ మీ జగన్‌ మరో నాలుగు అడుగులు ముందుకేసి 7 ఎమ్మెల్యే స్థానాలు మైనార్టీలకు ఇవ్వడం ద్వారా 4శాతం రాజకీ­య రిజర్వేషన్లు కూడా ఇచ్చినట్లయ్యింది. 

మన అభ్యర్థులను దీవించండి
మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.లావణ్య, గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారు రోశయ్య, నగరి ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్కే రోజా, చిత్తూరు ఎంపీ అభ్యర్థి రెడ్డప్ప, కడప ఎమ్మెల్యే అభ్యర్థి అంజాద్‌ బాష, కడప ఎంపీగా పోటీ చేస్తున్న నా తమ్ముడు వైఎస్‌ అవినాష్‌రెడ్డిని మీరంతా ఆశీర్వదించి గొప్ప మెజార్టీలతో గెలిపించాలని కోరుతున్నా. 

మీ బిడ్డ ఎన్నికల కోసం ఏదీ చేయలేదు..
వీళ్ల దుర్మార్గాలు, కుట్రలు ఏ స్థాయిలో ఉన్నాయంటే... అవ్వాతాతలకు మొన్నటి వరకు ఇంటికే వచ్చే పెన్షన్‌కు కూడా అడ్డుపడి రానివ్వకుండా చేసిన దౌర్భా­గ్యులు వీళ్లు! మీ బిడ్డ చేసిందేదీ ఎన్నికల కోసం చేయలేదు. మీ బిడ్డ ఏదీ ఎన్నికలకు రెండు నెలల ముందు, మూడు నెలల ముందు చేసిన దాఖలాలు లేవు. 

మీ బిడ్డ ఏం చేసినా  ముందే కేలండర్‌ ప్రకటించి ఇదిగో ఈ నెలలో రైతుభరోసా, అమ్మఒడి, చేయూత ఇస్తామని చెప్పి క్రమం తప్పకుండా ఐదేళ్లుగా అందించాడు. సాధారణంగా ఎవరైనా మోసం చేస్తే చీటింగ్‌ కేసు పెడతాం. ఛీటర్‌ అంటాం. దొంగతనం చేస్తే దొంగోడు అని కేసు పెడతాం. మరి ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ మేనిఫెస్టో అంటూ అందమైన హామీలిచ్చి మన జీవితాలతో ఆడుకుంటున్న వాళ్ల మీద ఎలాంటి కేసులు పెట్టాలి? పట్టపగలే ఇంత దారుణంగా ప్రజలను మోసం చేస్తున్నారు.

మంగళగిరి బీసీలదే
మంగళగిరి సీటు బీసీలది.. వెనుకబడిన వర్గాలది. గతంలో నేను ఆర్కేకు ఇచ్చా. ఈసారి మాత్రం మనం ఈ సీటును త్యాగం చేయాలని ఆర్కేకు చెప్పా. మనం బీసీలకు సీటు ఇస్తే... అటువైపు∙వాళ్లంతా డబ్బు మూటలతో నెగ్గేందుకు ప్రయత్నిస్తున్నారు. మీ బిడ్డ మాదిరిగా చంద్రబాబు ఎక్కడా బటన్లు నొక్కలేదు కాబట్టి ఆయన దగ్గర బాగా డబ్బులున్నాయి. అందుకుని ఓటుకు రూ.5 వేలు కూడా ఇస్తానంటాడు. ఆయన డబ్బులిస్తే వద్దనకుండా తీసుకోండి.

అదంతా మన దగ్గర దోచేసిన సొమ్మే. కానీ ఓటేసేటప్పుడు మాత్రం ఎవరి వల్ల మీకు మంచి జరిగిందో ఆలోచించండి. ఎవరు ఉంటే ఈ మంచి కొనసాగుతుందో ఆలోచన చేయండి. మీ అందరికీ మంచి చేసిన ఫ్యాను ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్‌ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్‌ సింక్‌ లోనే ఉండాలి. 

వలంటీర్లు మళ్లీ మన ఇంటికే రావాలన్నా, అవ్వాతాతల పెన్షన్‌ మళ్లీ ఇంటికే రావాలన్నా, బటన్లు నొక్కిన పథకాల సొమ్ము నా అక్కచెల్లెమ్మల ఖాతాలకి రావాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు, వివక్ష లేని పాలన కొనసా­గా­లన్నా, పేదల భవిష్యత్, తలరాతలు మారాలన్నా, మన పిల్లల చదువులు, బడు­లు బాగుపడాలన్నా, మన వ్యవసాయం, మన వైద్యం మెరుగుపడాలన్నా ఫ్యాను గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి. 

2014 బాబు విఫల హామీల్లో ముఖ్యమైనవి
»  రూ.87,612కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ అయ్యాయా? రూ.14,205కోట్ల పొదుపు రు­ణా­ల్లో ఒక్క రూపాయి మాఫీ  చేశాడా? 
» ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకులో డిపాజిట్‌ చేస్తామ­న్నారు. ఎవరికైనా రూపాయి ఇచ్చాడా?
»    ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.2 వేలు ని­రుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ఈ లెక్కన ఐదేళ్లలో ఏ ఇంటికైనా రూ.1.20 లక్షలు ఇచ్చాడా ? 
»    అర్హులందరికీ మూడు సెంట్లు స్థలం, పక్కా ఇళ్లు ఇస్తామన్నాడు. ఏ ఒక్కరికైనా సెంటు స్థలం ఇచ్చాడా?  
»   రూ.10వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్, చేనేత పవర్‌ లూమ్స్‌ రుణాల మాఫీ హామీ 
అమ­­లైం­దా? ఉమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేశాడా?
»   సింగపూర్‌ని మించి అభివృద్ధి, ప్రతి నగరంలోనూ హైటెక్‌ సిటీ నిర్మాణం జరిగిందా? మంగ­ళగిరి, నగరిలో ఎవరికైనా  కనిపిసు­న్నా­­యా?
» ప్రత్యేక హోదా తేకపోగా అమ్మేశాడు. 
» అదే ముగ్గురు ఇప్పుడు మళ్లీ కూటమిగా ఏర్పడి సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్, ఇంటింటికీ కేజీ బంగారం, బెంజ్‌ కారు అంటూ నమ్మబలుకుతున్నారు.

నేడు సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారం ఇలా.. 
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వ­హి­స్తారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం ఉదయం 10 గంటలకు నరసరావుపేట లోక్‌సభ స్థానం పరిధిలోని చిలక­లూరిపేటలో ఉన్న కళామందిర్‌ సెంటర్‌లో జరిగే ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్‌ పాల్గొంటారు.

 మధ్యాహ్నం 12.30 గంటలకు ఏలూరు లోక్‌సభ స్థానం పరిధిలోని కైకలూరులో ఉన్న తాలూకా ఆఫీస్‌ సెంటర్‌లో జరిగే సభకు హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 3గంటలకు కాకినాడ లోక్‌సభ స్థానం పరిధిలోని పిఠాపురంలో ఉన్న ఉప్పాడ బస్టాండ్‌ సెంటర్‌లో జరిగే సభలో సీఎం జగన్‌ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement