'ఆటా' ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో లైబ్రరీ

Library Was Launched At Zphs School Under Ata - Sakshi

ఆటా ఆధ్వర్యంలో మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలోని జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో లైబ్రరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆటా వేడుకల చైర్‌, ఎలక్ట్‌ ప్రెసిడెంట్‌ జయంత్‌ చల్లా మాట్లాడుతూ.. తాము కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకొని ఉన్నతంగా ఎదిగామని, ఇక్కడి విద్యార్థులు కూడా అలానే ఎదగాలని ఆకాంక్షించారు. చదువుకునే పిల్లలు ఫోన్లకు, సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.

అమెరికా, భారత్‌లోని పాఠశాలల మధ్య తేడాలను ఆయన వివరించారు. ఇతర CSIR కంపెనీ లతో ఆటా మాట్లాడి వారి సహకారంతో స్కూల్‌ను మరింత అభివృద్ది చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆటా వేడుకల కో చైర్ వేణు సంకినేని, ఆటా సెక్రెటరీ రామకృష్ణారెడ్డి అల, ఆటా కోశాధికారి సతీష్ రెడ్డి, 18వ ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కో ఆర్డినేటర్ సాయి సుధిని, ఆటా జాయింట్ ట్రెజరర్ రవీందర్ గూడూరు తదితరులు పాల్గొన్నారు. 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top