Mamata Banerjee: వ్యాక్సినేషన్‌ సరఫరాలో కేం‍ద్రం వివక్ష

Mamata Benarjee Fire On Modi Over Vaccine Shortage In West bengal - Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కేంద్రం తీరుపై మరోసారి విరుచుకుపడ్డారు. కేంద్రం వ్యాక్సినేషన్‌ సరఫరా చేయడంలో తమ రాష్ట్రంపై వివక్షత చూపిస్తోందని అన్నారు. తాము 14 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు కావాలని మోదీ ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. అయినప్పటికీ కేంద్రం వ్యాక్సిన్‌ డోసులను  సరఫరా చేయలేదని పేర్కొన్నారు. ఇప్పటి వరకు బెంగాల్‌లో ఎక్కడ వ్యాక్సిన్‌ను వృథా చేయలేదని అన్నారు.

ఇప్పటివరకు 4 కోట్ల వ్యాక్సినేషన్‌ లక్ష్యాన్ని అధిగమించామని తెలిపారు. పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్‌ పూర్తి చేయడానికి తమకు ఇంకా 14 కోట్ల డోసులు అవసరమని తెలిపారు. బెంగాల్‌ ప్రజలందరకీ వ్యాక్సినేషన్‌ వేయటమే తమ లక్ష్యమని అన్నారు.  కేంద్రం ప్రభుత్వం నల్లధనం బయటకు తెస్తామని అమలు చేయలేని వాగ్దానాలు చేసిందని అన్నారు. తమ ప్రభుత్వం  అమలు చేయగలిగే వాటిని మాత్రమే చేప్తామని తెలిపారు. ప్రజలకు పారదర్శక పాలన అందించడమే తమ లక్ష్యమని  అన్నారు.

నిన్న(మంగళవారం) పశ్చిమబెంగాల్‌లోని జల్సాయిగురి సదర్‌ ఆసుపత్రిలో వ్యాక్సినేషన్‌ కోసం స్థానికులు ఎగబడ్డారు. ఈ ఘటనలో 25 మంది గాయపడ్డారు. దీనిలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సీఎం మమతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.  ప్రజలందరికీ వ్యాక్సినేషన్‌ వేయిస్తామని.. సంయమనం పాటించాలని కోరారు. 

చదవండి: వేరియంట్ల గుట్టు తేలుద్దాం..నమూనాల సేకరణ ఇలా

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top