వారం రోజులు ముందుగానే లియో.. ఓటీటీ రిలీజ్‌ అప్పుడేనా? | Buzz On Thalapathy Vijay And Lokesh Kanagaraj Leo Movie OTT Release Date And Streaming Platform - Sakshi
Sakshi News home page

Vijay Leo Movie In OTT: ఓటీటీకి వచ్చేస్తోన్న లియో.. రిలీజ్‌ అప్పుడేనా?

Published Mon, Nov 13 2023 2:43 PM | Last Updated on Mon, Nov 13 2023 3:30 PM

Vijay and Lokesh Kanagaraj Leo Movie Ott Release Date Confirmed - Sakshi

దళపతి విజయ్, లోకేశ్ కనగరాజ్ కాంబోలో వచ్చిన చిత్రం లియో. అక్టోబర్ 19న రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.550 కోట్లకు పైగా వసూళ్ల రాబట్టింది. ఈ చిత్రంలో విజయ్ సరసన త్రిష హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఓటీటీ విడుదల తేదీపై మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

(ఇది చదవండి: బిగ్‌ బాస్‌ టాప్‌-5 ఎవరంటే..? ఫైనల్‌ లిస్ట్‌ ఇదేనా..? )

లియో మూవీ ఈనెల 16 నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని తాజా టాక్ వినిపిస్తోంది. అయితే ఈ తేదీపై కూడా మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. గతంలో నవంబర్‌ 21వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కావొచ్చని వార్తలు వినిపించాయి. ఇటీవలే ఈ చిత్రం ఆన్‌లైన్‌లో లీక్‌ అయిందని.. అందువల్లే వారం రోజులు ముందుకానే ఓటీటీకి రానున్నట్లు తెలుస్తోంది. అయితే త్వరలోనే ఓటీటీ రిలీజ్ డేట్‌పై మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చే అవకాశముంది. విజయ్‌కు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ క్రేజ్‌ ఉంది. తెలుగు ప్రేక్షకులు సైతం ఓటీటీలో ఎప్పుడొస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా.. లియో ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

(ఇది చదవండి: నెత్తిన పగిలిన బాటిల్స్‌, రైతుబిడ్డ సేఫ్‌.. నామినేషన్స్‌లో ఎవరున్నారంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement