
ఈ వీకెండ్ రిలీజయ్యే సినిమాల్లో కాస్తంత ఎక్కువ బజ్ ఉన్న సినిమా మ్యాడ్ స్క్వేర్. 2023లో రిలీజైన చిత్రానికి ఇది సీక్వెల్. ఇప్పటికే జోరుగా ప్రమోషన్స్ జరుగుతుండగా.. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. టీజర్ లానే ఇది కూడా ఫన్నీగా ఉంది.
(ఇదీ చదవండి: రష్మిక ఆస్తి ఎన్ని కోట్లు? ఏమేం ఉన్నాయి?)
కొన్నిరోజుల క్రితం రిలీజైన టీజర్.. అద్భుతమైన స్పందన తెచ్చుకుంది. ఇప్పుడు ట్రైలర్ లోనూ పంచులు, ప్రాసలు మరీ అంత కాకపోయినా బాగానే ఉన్నాయి. టీజర్ చివర్లో ఓకే బాయ్ అన్నట్లు.. ఇందులోనూ నేను గర్ల్స్ అయితేనే మాట్లాడుతా అని లడ్డు క్యారెక్టర్ చెప్పడం బాగుంది.
నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. కల్యాణ్ శంకర్ దర్శకుడు. నాగవంశీ నిర్మాత. మార్చి 28న మూవీ థియేటర్లలోకి వస్తోంది.
(ఇదీ చదవండి: పరువు పోతుందని భయపడ్డాను.. ఒకప్పటి హీరోయిన్ సుహాసిని)